వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా రత్న వర్సెస్ పిరానా రత్న: విజయసాయి రెడ్డి, గోరంట్ల మధ్య ట్వీట్ల తిట్లు: క్విజ్ మాస్టర్లుగా

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాజకీయాల్లో హేమాహేమీల్లాంటి ఇద్దరు నాయకుల మధ్య ట్వీట్టర్ వేదికగా కొనసాగుతోన్న యుద్ధం.. పడిపడి నవ్వుకునేలా చేస్తోంది. వారిద్దరూ క్విజ్ మాస్టర్ల అవతారం ఎత్తారు. ట్విటర్ సాక్షిగా.. కౌన్ బనేగా కరోడ్‌పతి తరహాలో ప్రశ్నలను సంధిస్తున్నారు. ఆప్షన్లను ఇచ్చుకుంటున్నారు. ఆ ఇద్దరూ- అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్లే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.

విజయసాయి రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మొదలుకుని ఆ పార్టీకి చెందిన ఏ ఒక్కర్నీ ఆయన వదలరు. తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ చెలరేగిపోతుంటారు. ప్రతిరోజూ ఆయన టీడీపీని టార్గెట్‌గా చేసుకుని ట్వీట్లను సంధిస్తుంటారు..కౌంటర్లను వేస్తుంటారు. దీనికి ప్రతిగా తెలుగుదేశం పార్టీ నుంచి తరచూ కౌంటర్ అటాక్‌లు వస్తుంటాయి.

Allegations between YSRCP MP Vijayasai Reddy and TDP MLA Gorantla Buchaiah Chowdary

సోమవారం ఉదయం కూడా సాయిరెడ్డి అదే తరహాలో ట్వీట్లను సంధించారు. ఈ సారి ఆయన క్విజ్ మాస్టర్ అవతారం ఎత్తారు. ఈ కింది వారిలో కరోనా రత్న ఎవరు అంటూ అయిదు ఆప్షన్లను ఇచ్చారు. పెదనాయుడు, చిననాయుడు, మలమల కృష్ణరాముడు, దయనేని రమ, భజనా చౌ.. అనే పేర్లను ఆప్షన్లుగా పెట్టారు. 24 గంటల్లో తమ అభిప్రాయాలు తెలియచేయండని కండీషన్ కూడా పెట్టారు సాయిరెడ్డి. సాయిరెడ్డి ఈ ట్వీట్ పెట్టిన కొద్దిసేపటికే టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దీనికి కౌంటర్ ఇచ్చారు. సాయిరెడ్డి తరహాలోనే ఆయన కూడా ఓ క్విజ్ పెట్టారు.

ఈ క్రింది వారిలో కమిషన్ వసూలు లో "పిరాన రత్న" ఎవరు అనే ప్రశ్నను వేసి.. ఆరు ఆప్షన్లను ఇచ్చారు. జలగం, కసాయి/ సీసాయి/విసాయి, గుడివాడ గోళి, తస్సదియ్య నత్తి, అంబలి రాంబా, పేరుకుపోయిన నెయ్యి అనే పేర్లను ఎంచుకోవాలని సూచించారు. 24 గంటలు కాదు..మీకు నచ్చిన టైం తీసుకోండని ఎదురుదాడికి దిగారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఓ అడుగు ముందే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పేటీఎం బ్యాచ్‌గా అభివర్ణిస్తూ మరో ట్వీట్‌ను ఆయన సంధించారు.

English summary
YSR Congress Party senior leader and Rajya Sabha member V Vijayasai Reddy and Telugu Desam Party MLA Gorantla Buchaiah Chowdary over the State politics in Andhra Pradesh. The both leaders were alleged each other on the Social media platforms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X