• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపిలో పొత్తు పై తేల్చేసిన అధినేత‌లు..చంద్ర‌బాబు చెప్పింది ఇదే: రాహుల్ ల‌క్ష్యం అదే..!

|

ఏపిలో కాంగ్రెస్ -టిడిపి పొత్తు పై స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది. ఏపి ఎన్నిక‌ల్లో ఈ రెండు పార్టీల మ‌ద్య ప్ర‌త్య‌క్ష పొత్తు ఉంటుందా లేక‌..విడివిడిగా పోటీ చేసి స‌హ‌క‌రించుకుంటారా అనే అంశం పై కొద్ది రోజులుగా చ‌ర్చ సాగుతోంది. దీని పై పిసిసి తో పా టుగా టిడిపి నేత‌లు అనేక చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇక‌, టిడిపి అధినేత చంద్ర‌బాబు ఈ అంశం పై అనేక ర‌కాలుగా స‌ర్వేలు చేయించారు. లాభ - న‌ష్టాల పై బేరీజు వేసారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ సైతం నిర్ణ‌యాధికారం చంద్ర‌బాబు కే వ‌దిలి వేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో..ఇప్పుడు రెండు పార్టీలు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసారు..

తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌భావం..

తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌భావం..

జాతీయ రాజ‌కీయాల్లో భాగంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ తో టిడిపి అధ్య‌క్షుడు చంద్ర‌బాబు స‌మావేశ‌మ‌య్యారు. ఢిల్లీ కేంద్రంగా వీరి ఆక‌స్మిక భేటీ జ‌రిగింది. ప్ర‌ధాని మోదీకి వ్య‌తిరేకంగా ఎలాగైనా మోదీని గ‌ద్దె దింపాల‌నే ల‌క్ష్యంతో బిజెపీ య‌త‌ర పార్టీల‌న్నీ ఏకం కావాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలో బిజెపిని ఓడించా లంటే ఖ‌చ్చితంగా కాంగ్రెస్ తో క‌లిసి ముందుకు సాగాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసారు. ఇందులో భాగంగా..ప‌లువురు జాతీ య పార్టీల నేత‌ల‌ను చంద్ర‌బాబు క‌లిసారు. ఇదే స‌మ‌యంలో తెలంగాణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ - టిడిపి త‌మ రాజ‌కీయ శ‌త్రుత్వాన్ని ప‌క్క‌న పెట్టీ మ‌రో క‌లిసి పోటీ చేసాయి. కానీ, ప్ర‌జ‌లు ఆ పొత్తును స్వాగ‌తించ లేదు. ఏపి వాసులు ఎక్కువ గా ఉన్న గ్రేట‌ర్ ప‌రిధిలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఫ‌లితాలు ప్ర‌తికూలంగా వ‌చ్చాయి. అప్ప‌టి నుండి కాంగ్రెస్ - టిడిపి మ‌ధ్య పొత్తు ఏపిలో కొన‌సాగుతుందా లేదా అనే చ‌ర్చ మొదలైంది..

సర్వేలతో పాటు ఇదీ అటు వైపే!: 2019లో ఏపీకి ముఖ్యమంతి వైయస్ జగన్?సర్వేలతో పాటు ఇదీ అటు వైపే!: 2019లో ఏపీకి ముఖ్యమంతి వైయస్ జగన్?

ఏపిలో ఇంకా చ‌ల్లార‌ని ఆగ్ర‌హం..టిడిపి పై ప్ర‌భావం..

ఏపిలో ఇంకా చ‌ల్లార‌ని ఆగ్ర‌హం..టిడిపి పై ప్ర‌భావం..

రాష్ట్ర విభ‌జ‌న ఏక‌ప‌క్షంగా చేసిన కాంగ్రెస్ పార్టీ పై ఏపి ప్ర‌జ‌ల ఆగ్ర‌హం ఇంకా చ‌ల్లార‌లేదు. 2014 ఎన్నిక‌ల్లో ఒక్క సీటు లోనూ కాంగ్రెస్ గెల‌వ‌లేదు. ఇప్పటి ప‌రిస్థితుల్లో పెద్ద‌గా మార్పు లేదు. ఇదే స‌మ‌యంలో ఏపిలో సెంటిమెంట్ గా మారి న ప్ర‌త్యేక హోదా పై కాంగ్రెస్ అధినేత స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేసారు. తాము అధికారంలోకి వ‌స్తే తొలి సంత‌కం ఏపికి ప్ర త్యేక హోదా మీదే ఉంటుంద‌ని తేల్చి చెప్పారు. దీంతో..ఏపికి ప్ర‌త్యేక హోదా ఇస్తామంటున్న కాంగ్రెస్ తో క‌లవ‌టం ద్వారా రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని టిడిపి నేత‌లు అంచ‌నా వేసారు. అయితే, తెలంగాణ ఎన్నిక‌ల త‌రువా త వారి ఆలోచ‌న‌ల్లో మార్పు వ‌చ్చింది. ఏపిలో టిడిపికి ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధిగా వైసిపి ఉంది. వైసిపికి ఎస్సీ-ఎస్టీ-ద‌ళిత ఓటు బ్యాంకు ప్ర‌ధానంగా అండ‌గా నిలుస్తోంద‌ని..వారి ఓట్ల‌ను చీల్చ‌గ‌లిగితే ..త‌మ‌కు క‌లిసి వ‌స్తుంద‌ని టిడిపి నేత‌ల భావ‌న‌. అయితే, కాంగ్రెస్ పై ఇంకా వ్య‌తిరేక‌త త‌గ్గ‌లేద‌ని సీయం చేయించిన స‌ర్వేల్లో తేలింది. కాంగ్రెస్ తో క‌ల‌వటం వ‌ల‌న ఏపి లో కాంగ్రెస్ కే ప్ర‌యోజ‌నం మిన‌హా..టిడిపికి ఎటువంటి ఉప‌యోగం లేద‌నే అంచ‌నాకు టిడిపి నేత‌ల వ‌చ్చారు. దీంతో..పొత్తు వ‌ద్ద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చేసారు.

ఏపిలో విడివిడిగా..ఢిల్లీలో ఒక్క‌టిగా..

ఏపిలో విడివిడిగా..ఢిల్లీలో ఒక్క‌టిగా..

ఇక‌, తాజాగా ఢిల్లీలో టిడిపి-కాంగ్రెస్ అధినేత‌ల మ‌ధ్య స‌మావేశం జ‌రిగింది. ఆ స‌మావేశంలో ఏపి రాజ‌కీయాల పైనా చ‌ర్చ సాగింది. అయితే, రాహుల్ గాంధీ త‌న‌కు స్థానికంగా కంటే జాతీయ స్థాయిలో ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌ని..బిజెపి ని ఓడించ‌ట‌మే ల‌క్ష్యం అని తేల్చి చెప్పిన‌ట్లు స‌మాచారం. ఏపిలో రెండు పార్టీలు క‌లిసి వెళ్తే ప్ర‌యోజ‌న‌మా..విడివిడిగా పోటీ చేస్తే లాభ‌మా..ఏం చేయాల‌నే దాని పై చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకోవాల‌ని రాహుల్ కోరారు. దీంతో..బ‌లం లేని చోట కాంగ్రెస్ కు సీట్లు ఇచ్చి ప‌రోక్షంగా వైసిపి విజ‌యానికి కార‌ణం అవ్వ‌టం కంటే..ఏపిలో విడివిడిగా పోటీ చేయాల‌ని.. బ‌ల‌మైన ప్ర‌చారం ద్వారా గ‌తం కంటే ఎక్కువ‌గా కాంగ్రెస్ ఓట్లు ద‌క్కించుకొని..ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు జ‌గ‌న్ కు వెళ్ల కుండా చూడ‌టం ద్వారా త‌మకు లాభం క‌లుగుతుంద‌ని టిడిపి అంచ‌నాకు వ‌చ్చింది. దీంతో..రాష్ట్ర స్థాయి ప్ర‌యోజ నాల కోసం విడివిడిగా పోటీ చేసి..ఎవ‌రికి ఎన్ని సీట్లు వ‌చ్చినా..జాతీయ స్థాయిలో మాత్రం క‌లిసే ఉండాల‌ని ఇరు పార్టీ ల అధినేత‌లు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. దీంతో..ఏపిలో టిడిపి ఒంటరిగానే పోటీ చ‌య‌టం దాదాపు ఖాయంగా క‌నిపిస్తోంది.

English summary
In the coming elections in AP sources say that there would be no alliance between TDP and congress.In this backdrop TDP chief and Congress chief seems to have come to an understanding. Both decided to have an ally at the national level to put a check to BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X