వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివాదాల సుడిగుండాల్లో విశ్వవిద్యాలయాలు..."నన్నయ" విసిపై అవినీతి ఆరోపణలు

|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి: ఒకప్పుడు విశ్వవిద్యాలయాలంటే ఎంతో గొప్ప అభిప్రాయం ఉండేది...మేధావులైన ఆచార్యులు...సమాజం ఉన్నతి కోసం చర్చలు...పరిశోధనలు...ప్రతిభకు నిలయాలుగాగా ఉండేవి...కానీ నేడు యూనివర్శిటీల్లో నెలకొని ఉన్నపరిస్థితులు చూస్తుంటే విద్యావ్యవస్థ మీదే నమ్మకం పోతుంది...ఏ యూనివర్శిటీ చూసినా ఏముంది బేధం అన్న చందంగా ప్రతిష్టాత్మక యూనివర్శిటీలతో సహా ఒక్కోసారి ఒక్కో యూనివర్శిటీ వివాదాల్లో చిక్కుకుంటూ ప్రజలకు విరక్తి కలుగచేస్తున్నాయి...విషయానికొస్తే...

కొన్ని రోజుల క్రితమే ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ విద్యార్థులు రోడ్డెక్కగా...చివరకు తనపై నిర్భయ కేసు పెట్టి అరెస్ట్ అయ్యేంతవరకు వెళ్లిన ఆచార్యుడి ఉదంతంతో కాకినాడ జెఎన్టియు అప్రతిష్ట మూటకట్టుకోగా...తాజాగా ఇదే జిల్లాలో అవినీతి ఆరోపణలతో తల బొప్పి కట్టి నన్నయ విశ్వవిద్యాలయం విసి తలవంపులు తెచ్చుకున్నారు...వివరాల్లోకి వెళితే...

 ఆచార్యుడిపై ఆరోపణలు...అరెస్ట్

ఆచార్యుడిపై ఆరోపణలు...అరెస్ట్

టెక్నాలజీ పరంగా రాష్ట్రంలోనే ప్రముఖ యూనివర్శిటీగా పేరు తెచ్చుకున్న కాకినాడ జేఎన్టీయూ ఇటీవలే ఓ వివాదం కారణంగా అప్రతిష్ట పాలైన సంగతి తెలిసిందే. తమను ప్రొఫెసర్ లైంగికంగా వేధించారంటూ ఎంటెక్‌ ఫస్టియర్ విద్యార్థినులు యూసీఈకే ఈసీఈ విభాగం ప్రొఫెసర్‌ కె.బాబులుకు వ్యతిరేకంగా అందోళన చేసిన నేపథ్యంలో ఆయన అరెస్ట్ అయిన ఘటన యూనివర్శిటీ ప్రతిష్టను దారుణంగా దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో వీసీ మెతక వైఖరి కారణంగా ఈ ప్రతిష్టాత్మక జేఎన్టీయూకే యూనివర్శిటీకి ఈ పరిస్థితి వచ్చిందన్న విమర్శలు వస్తున్నాయి.

ఇప్పుడు...నన్నయ విసి వంతు...

ఇప్పుడు...నన్నయ విసి వంతు...

ఉన్నత విద్య వెసులుబాటు కోసం ఏర్పాటు చేసిన కొత్త యూనివర్శిటీల్లో రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఒకటి...అయితే విద్యాప్రమాణాల సంగతేమో కానీ ఇంకా ఈ యూనివర్శిటీ ప్రజలకు ఉనికి చాటుకోకముందే అవినీతి ఆరోపణలతో చెడ్డ పేరు మాత్రం బాగానే గడిస్తోంది...
ఆరు నెలల క్రితం ఈ యూనివర్శిటీలో ఆటోమేషన్‌ కాంట్రాక్టులో రూ.3.5 కోట్లు స్వాహా చేసేందుకు రంగం సిద్దమైందని విద్యార్థి సంఘాలు ఆందోళన చెయ్యడం...ఆ వ్యవహారం గురించి మీడియాలో వార్తలు వెల్లువెత్తడంతో ఉన్నత విద్యామండలి ఆ ఆటోమేషన్‌ కాంట్రాక్టును రద్దు చెయ్యమని సూచించేంత వరకు వెళ్లడం...ఆప్రకారం చెయ్యడం జరిగిపోయింది...అదే క్రమంలో తాజాగా ఈ యూనివర్శిటీలో చేపట్టిన నియామకాలు వివాదానికి...విశ్వవిద్యాలయం అప్రతిష్టకు కారణమయ్యాయి.

 నియామకాల నిలిపివేతకు...విసికి ఆదేశం...తాజాగా ఈ

నియామకాల నిలిపివేతకు...విసికి ఆదేశం...తాజాగా ఈ

విశ్వవిద్యాలయంలో ఇటీవల చేపట్టిన ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు నిలిపివేయాలని గవర్నర్‌, ఉన్నత విద్యామండలి కార్యాలయాల నుంచి వీసీకి ఆదేశాలు వచ్చాయనే ప్రచారం గుప్పుమంటోంది. వాస్తవంగా జనవరి 27న ఐదు ప్రొఫెసర్‌, 11 అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు జరగాల్సి ఉంది. అయితే ఈ ఉద్యోగాలకు రేటు పెట్టి అమ్ముకునేందుకు రంగం సిద్దం చేశారని, అలా అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టేందుకు మొత్తం స్కెచ్ అంతా సిద్దం అయిందంటూ ఏకంగా గవర్నర్‌కే ఫిర్యాదులు వెళ్లాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

అనేక ఆరోపణలు...అంతకుమించి...వివాదాలు...

అనేక ఆరోపణలు...అంతకుమించి...వివాదాలు...

నిబంధనల ప్రకారం యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ పదవికి ప్రొఫెసర్‌ స్థాయి వ్యక్తి నే నియమించాలి. అయితే నన్నయ వర్సిటీ రిజిస్ట్రార్‌గా నియమితులైన అశోక్‌ కు ఆంధ్ర యూనివర్శిటీ ప్రొఫెసర్‌గా పదోన్నతి ఇవ్వలేదనే విషయం వాస్తవం. కాకినాడ పీజీ సెంటర్లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సమయంలో ఆయన ప్రమోషన్ కోసం ధరఖాస్తు చేయగా...కెరీర్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌లో ఈయన ప్రొఫెసర్‌ పోస్టుకి అనర్హుడంటూ ఏయూ కమిటీ తిరస్కరించడం జరిగింది. అయితే ఆ క్రమం లోనే ఏయూ పరిధిలో ఉన్న కాకినాడ నాయకర్‌ పీజీ సెంటరును నన్నయ యూనివర్సిటీకి బదిలీ చేయడం జరిగింది. దీంతో ఏం జరిగిందో ఏమో కానీ నెల రోజుల వ్యవధిలోనే అశోక్‌కు ప్రొఫెసర్‌గా పదోన్నతి కల్పించి రిజిస్ట్రార్‌ పదవి కట్టబెట్టారు. ఈ వ్యవహారంపైనా గవర్నర్‌కి ఫిర్యాదులు వెళ్లినట్లు, అలా ఫిర్యాదు చేసినవారిలో ఈసీ సభ్యులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మరో ఫ్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పరిశీలన కమిటీ సభ్యుడు ఒకరిపై కూడా నకిలీ విద్యార్హత పత్రాలు సమర్పించి పదోన్నతి పొందారని గవర్నర్‌కు ఫిర్యాదులు వెళ్లడం గమనార్హం. దీంతో నన్నయ యూనివర్శిటీ అక్రమాల పుట్టగా మారిందని...ఈ యూనివర్శిటీలో వ్యవహారాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగు చూస్తాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

English summary
East Godavari: Various Student Association leaders alleges on Vice-Chancellor of Adikavi Nannaya University about irregularities had taken place in the appointment of professors in University in Rajamahendravaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X