
Chiranjeevi: అల్లు అరవింద్ లేని లోటు చిరంజీవికి బాగా తెలుస్తోందే!!
తెలుగు చలనచిత్ర పరిశ్రమల్లో కొన్ని దశాబ్దాలపాటు అగ్ర కథానాయకుడిగా చిరంజీవి వెలుగొందారంటే అందులో ఆయన బావమరిది అల్లు అరవింద్ కృషి ఎంతో ఉంది. సినిమా కథను ఎంపిక చేసే విధానం నుంచి షూటింగ్ జరిగే విధానం, విడుదల వరకు అన్ని వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షించేవారు. సాధ్యమైనంతవరకు సినిమా ఫ్లాప్ అవకుండా చూసేవారు. ఈరోజు చిరంజీవి సుప్రీంహీరో నుంచి మెగాస్టార్‌గా మారారంటే అల్లు అరవింద్ పాత్రను విడదీయకుండా చూడలేం.

ఇరు కుటుంబాల మధ్య సఖ్యత లేదా?
అయితే కొన్నాళ్లుగా చిరంజీవి కుటుంబానికి, అల్లు అరవింద్ కుటుంబానికి సఖ్యత లేదని తెలుగు చలనచిత్ర పరిశ్రమ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ వార్తలు బయటకు వచ్చినప్పుడు అటువంటిదేమీ లేదని ఇద్దరూ ఖండించారు. ఇప్పుడు ఎవరికి వారు విడిగా సినిమాలు తీసుకుంటున్నారు. చిరంజీవి సినిమాల బాధ్యత కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ తీసుకున్నారు.

అల్లు అరవింద్ ప్రమేయం లేనివే
చిరంజీవి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత తీస్తున్న సినిమాలుకానీ, ఎంచుకుంటున్న కథలుకానీ, విడుదలై ఫ్లాపైన సినిమాలుకానీ, నిర్మాణంలో ఉన్న సినిమాలు కానీ అన్నీ అల్లు అరవింద్ ప్రమేయం లేనివే అవుతున్నాయి. అంటే ఒకరకంగా నాసిరకమైన కథలు, నాణ్యతలేమితో సినిమాలు వస్తున్నాయనే అభిప్రాయం ఫిల్మ్‌నగర్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. బిగ్‌బాస్ తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకొని చేసిన సినిమాలు కూడా ఘనవిజయాన్ని సాధించాయి. అప్పుడు కూడా అల్లు అరవింద్ పాత్ర ఉంది.

స్క్రిప్ట్‌పై పూర్తిస్తాయి పట్టు సాధించడం అరవింద్ బలం
ఇటీవలి కాలంలోనే అరవింద్ పాత్ర తగ్గిందనే వార్తలు వస్తున్నాయి. స్క్రిప్ట్‌పై పూర్తిస్థాయి పట్టు సాధించిన తర్వాతే షూటింగ్‌కు వెళ్లడం అరవింద్‌కు అలవాటు. ఇటీవల విడుదలైన సర్కారువారిపాట స్క్రిప్ట్ మొదట అరవింద్ విన్నారు. కానీ సెకండ్ పార్ట్ బాలేదని, మార్చాలని పరశురామ్‌కు చెప్పారు. కానీ పరశురామ్ తనదైన శైలిలోనే మహేష్‌బాబుతో తీశారు. ఫలితాన్నిన చవిచూశారు. సినిమా పరిశ్రమలో సీనియర్ నిర్మాతగా స్క్రిప్ట్‌పై ఆయనకున్న పట్టు అలాంటిది. ఇప్పుడు కూడా చిరంజీవి సినిమాల విషయంలో అల్లు అరవింద్ శ్రద్ధ పెట్టాలని, సూపర్హిట్లు అందించేలా కథలను ఎంపిక చేయాలని చిరంజీవి అభిమానులు కోరుతున్నారు.