సమంత సాంగ్ ట్రెండింగ్ - కాపీ అంటూ ట్రోలింగ్ : బ్రహ్మానందాన్ని అనుకరిస్తారా..మీమ్స్...!!
ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప ఐటెం సాంగ్ మెనియానే కనిపిస్తోంది. 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తొలిసారిగా స్పెషల్ సాంగ్‌లో కాలు కదిపింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్‌ల కాంబినేషన్లో తెరక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'పుష్ప'లో సామ్ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది. సమంత తన అందచందాలు ఆరబోస్తూ కుర్రకారు మతి పోగొడుతోంది.

అచ్చం ఆ పాట లాగే ఉందంటూ
కాగా ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా.. గాయని ఇంద్రావతి చౌహాన్ ఆలపించింది. ఈ పాటలో సమంత గ్లామర్, దేవిశ్రీ సంగీతం ఒక ఎత్తయితే.. గాయనీ ఇంద్రావతి చౌహన్ మత్తు వాయిస్ పాటను నెక్స్ట్ లెవల్‌కు తీసుకేళ్లింది. ఇక అంతా బాగానే ఉన్న ఈ పాట ఎక్కడో విన్నట్టు అనిపిస్తోందంటూ నెటిజన్లు పట్టేస్తున్నారు. తమిళ స్టార్ హీరో సూర్య-తమన్నా జంటగా నటించిన వీడొక్కడే మూవీ మంచి రికార్డులు సాధించింది. ఈ మూవీలో కూడా అచ్చం ఇలాగే ఓ స్పెషల్ ఉంది.

ట్రెండింగ్ - ట్రోలింగ్
'హానీ.. హానీ..' అంటూ ఆ పాట సాగుతుంది. ఇప్పుడు సమంత చేసిన ఈ స్పెషల్ సాంగ్ అచ్చం ఆ పాటను తలపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. లిరిక్స్ బాగున్నా మ్యూజిక్ మాత్రం సేమ్ ఉందని, అంటే సమంత సాంగ్‌ను కాపీ కొట్టారా అని ప్రశ్నిస్తూ.. కామెంట్స్ తో ట్రోల్ చేయడం ప్రారంభించారు. మరి దీనిపై పుష్ప టీం ఎలా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. అయితే స్టార్ హీరోయిన్ అయినప్పటికీ సామ్ డేర్ చేసి ఈ స్పెషల్ సాంగ్ చేసింది. కానీ ఇప్పుడు ఈ పాట ఇలా ట్రోల్స్ బారిన పడటంతో ఈ అంశం మరింతగా సోషల్ మీడియాలో డిస్కషన్ కు కారణమైంది.

బ్రహ్మానందాన్ని కాపీ కొడుతోందంటూ
ఇక, ఈ పాట సోషల్ మీడియాలో ఎంతలా ట్రెండ్ అవుతుందో...అదే స్థాయిలో నెటిజన్లు ఈ పాటను తెగ వాడేస్తూ రకరకాల ఎడిటింగ్లు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సాంగ్‌ను ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందానికి అన్వయిస్తూ ఎడిట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీన్ని రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ రీట్వీట్ చేశాడు. హిలేరియస్, సూపర్‌గా ఎడిట్ చేశారంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. అంతేకాదు బ్రహ్మానందాన్ని కాపీ కొడుతోందంటూ కొన్ని మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

పుష్ప పై భారీ అంచనాలతో..
బ్రహ్మానందం తో పాటుగా ప్రభాస్ ను సైతం ఇందులో వదటలం లేదు. ఆ ఇద్దరినీ వాడేస్తూ ఎడిటింగ్ చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్- సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ఫ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఊ అంటావా మావా అనే ఐటం సాంగ్‌లో సమంత సందడి సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. తాజాగా అల్లు అర్జున్ - రష్మిక ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ ప్రమోషన్స్ తెలుగు, తమిళంలో మొదలయినట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.