వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త‌స్సాదియ్య‌..! ఎన్నిక‌ల కోసం మ‌ద్యాన్ని ముంద‌స్తుగా కొని పెట్టుకున్నారు..! ఏపిలో ఎంత 'మందు' చూపో..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

త‌స్సాదియ్య‌..!!! ఏపిలో ఎంత 'మందు' చూపో..!!! | Oneindia Telugu

అమ‌రావ‌తి/హైద‌రాబాద్ : మ‌ద్యం ఏరులై పార‌డం అంటే ఏంటో విన‌డ‌మే గానీ ఎప్పుడూ చూసి ఉండం. కాని ఎన్నిక‌ల సంద‌ర్బంగా ఏపిలో ఆ విచిత్ర ఘ‌ట్టాన్ని కూడా చూడ‌బోతున్నాం. ఓటర్లను తమ దారిలోకి తెచ్చుకోవాలంటే పలు రకాల ప్యాకేజీల‌తో ఆకర్షిస్తుంటారు. అయితే చేతిలో నోటు పెట్టినా సంతృప్తి చెందని ఓటర్లు సైతం మద్యానికి మాత్రం జై కొడ‌తారు. అందుకే ప్రతీసారి ఎన్నికల సమయంలో పోలింగ్‌కు వారం, పది రోజుల ముందు మద్యాన్ని కొనుగోలు చేస్తుండేవారు. ఈ దఫా అధికార పార్టీ నాయకులు ముందుగానే మద్యం కొనుగోలు చేసి నిల్వలు ఉంచుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఇప్పటికే మద్యం నిల్వను గ్రామస్థాయికి పంపించారు రాజ‌కీయ నేత‌లు.

డ్రీం క్యాబినెట్ - ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019

ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉన్న డోంట్ కేర్..! మ‌ద్యాన్ని ఏరులై పారిస్తున్న నేత‌లు..!!

ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉన్న డోంట్ కేర్..! మ‌ద్యాన్ని ఏరులై పారిస్తున్న నేత‌లు..!!

నామినేషన్ల పర్వం ప్రారంభం కాకముందే మద్యం పంపిణీకి తెరలేపారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న సందర్భంలో మద్యాన్ని ఏరులై పారించారు. వజ్రపుకొత్తూరు మండలంలోని మత్స్యకార గ్రామాల్లో సైతం మద్యాన్ని విచ్చలవిడిగా పంపిణీ చేయడం, ఆ దృశ్యాలు ప్ర‌సార మాద్య‌మాల‌కు చిక్కిన విషయం తెలిసిందే. వారం రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మద్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఇందులో 90 శాతం వరకు అధికార పార్టీకి చెందిన వారి నుంచే స్వాధీనం చేసుకోవడం గమనార్హం.

 విచ్చ‌ల‌విడి మ‌ద్యం డంపింగ్..! అదికార‌వ పార్టీ నేత‌ల ఆగ‌డాలు..!!

విచ్చ‌ల‌విడి మ‌ద్యం డంపింగ్..! అదికార‌వ పార్టీ నేత‌ల ఆగ‌డాలు..!!

ఇలా అధికార పార్టీ నాయకులు మద్యం విషయంలో ముందు జాగ్రత్త పడ్డారు. జిల్లాలో అధిక శాతం మద్యం దుకాణాలు అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే నడుస్తున్నాయన్నది జగమెరిగిన సత్యం. అటువంటి దుకాణాల్లో కూడా పరిమితికి మించి మద్యాన్ని నిల్వ చేసినట్లు సమాచారం. అయినప్పటికీ వీటి వైపు ఎక్సైజ్‌ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. అదేవిధంగా ఒడిశా నుంచి కూడా పెద్ద ఎత్తున మద్యాన్ని జిల్లాకు తరలించి నిల్వ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

 నామ‌మాత్ర‌ను త‌నిఖీలు..! రెచ్చి పోతున్న మ‌ద్యం వ్యాపారులు..!!

నామ‌మాత్ర‌ను త‌నిఖీలు..! రెచ్చి పోతున్న మ‌ద్యం వ్యాపారులు..!!

జిల్లాలో 200 కోట్ల రూపాయ‌ల విలువ చేసే మద్యం నిల్వ ఉంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నామమాత్రపు తనిఖీలకే మద్యం పట్టుబడుతుంటే కేంద్ర బలగాలు తనిఖీలు చేస్తే మరింత పెద్ద ఎత్తున మద్యం నిల్వలు బయటపడతాయని అధికార పార్టీ వారే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంఘం కూడా ఈ విషయంపై దృష్టి సారించి తనిఖీలను ముమ్మరం చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చ‌ర్చ జ‌రుగుతోంది.

నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే శిక్ష త‌ప్ప‌దు..! హెచ్చ‌రిస్తున్న ఈసీ..!!

నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే శిక్ష త‌ప్ప‌దు..! హెచ్చ‌రిస్తున్న ఈసీ..!!

వజ్రపుకొత్తూరు: మండలంలోని కొమరల్తాడ గ్రామంలో బెల్టుషాపుపై ఆదివారం ఎస్‌ఐ పీ నరిసింహమూర్తి, ఎన్నికల ప్లయింగ్‌ స్క్వాడ్‌ దాడులు నిర్వహించారు. ఈ మేరకు గ్రామానికి చెందిన రత్నాల ఢిల్లేశ్వరావు నుంచి 48 డీకే మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు 41 సీఆర్‌పీసీ ప్రకారం 34 ఏ సెక్షన్‌ కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉన్న‌ప్ప‌టికి రాజ‌కీయ నేత‌లు ఎందుకు ఇంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప్ర‌జ‌ల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

English summary
During the polls, buying liquor before the week and ten days before polling. This week's ruling party leaders are buying alcohol in advance. Already in every constituency, alcohol reserves were sent to the village level by political leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X