వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలయ్యకు థ్యాంక్స్ చెప్పిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు: ఆ వీడియో క్లిప్‌తో కలిపి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం- అఖండ రికార్డుల దుమ్ము దులుపుతోంది. బాక్సాఫీస్‌పై తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయిస్తోంది. రోజులు గడుస్తున్నప్పటికీ.. అఖండ కలెక్షన్లు తగ్గట్లేదు. విడుదలైన అతి కొద్దిరోజుల్లోనే 150 కోట్ల రూపాయలను వసూలు చేసిన మూవీగా సరికొత్త రికార్డులను నెలకొల్పింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ.. బాలకృష్ణ కేరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

ముంచుకొస్తోన్న గడువు: ఇక రెండురోజులే: జగన్ సర్కార్‌కు కొత్త టెన్షన్ముంచుకొస్తోన్న గడువు: ఇక రెండురోజులే: జగన్ సర్కార్‌కు కొత్త టెన్షన్

 అఖండ మాస్ జాతర..

అఖండ మాస్ జాతర..

బాలయ్య-బోయపాటి కాంబినేషన్ సత్తా ఏమిటో మరోసారి తెలుగు ప్రేక్షకులకు తెలియజేసింది. అసలు సిసలు మాస్ జాతర అంటే ఏంటో చూపించింది. అఖండ టైటిల్‌ రోల్‌లో బాలయ్య నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. అఘోరగా సరికొత్తగా కనిపించిన బాలకృష్ణను అభిమానులు బ్రహ్మరథం పట్టారు. తాజాగా ఈ సినిమా ఓవర్ ది టాప్ ప్లాట్‌ఫామ్‌పైనా విడుదలైంది. అక్కడా రికార్డును నెలకొల్పింది. ఈ 21వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

 ఓటీటీపైనా తడాఖా..

ఓటీటీపైనా తడాఖా..

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదలైన 24 గంటల్లో మిలియన్ స్ట్రీమింగ్స్‌ను సాధించింది. ఇది ఆల్‌టైమ్ రికార్డు. ఓటీటీ చరిత్రలో ఆల్ టైమ్ హయ్యస్ట్ వ్యూవర్‌షిప్‌ను అందుకుంది అఖండ. బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ ఇక్కడా తన తడాఖా చూపించింది. తాజాగా- ఈ సినిమాలోని ఓ వీడియో క్లిప్‌ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినియోగించుకున్నారు. ప్రజలకు అవగాహన, చైతన్యాన్ని కల్పించడానికి దీన్ని వాడారు.

 బాలయ్య సామాజిక సందేశం..

బాలయ్య సామాజిక సందేశం..

రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాదిమంది అభిమానులు ఉన్న బాలకృష్ణ ఇచ్చిన సామాజిక సందేశాన్ని ట్రాఫిక్ పోలీసులు మరింత బలంగా జనంలోకి తీసుకెళ్లారు. బాలకృష్ణ వంటి మాస్ హీరో.. అఖండ వంటి బ్లాక్ బస్టర్ మూవీలో ఇచ్చిన ఈ సందేశాన్ని ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో మార్పును తీసుకుని రాగలుగుతామని వారు భావించారు. ఓ పవర్ ఫుల్ హీరో..అంతే పవర్ ఫుల్ గల సినిమా ద్వారా ఆ సామాజిక సందేశాన్ని ఇవ్వడం ద్వారా ప్రజలు దాన్ని అనుసరిస్తారని ఆశిస్తున్నారు.

సీట్ బెల్ట్ ధరించడంపై..

ఆ సామాజిక సందేశమే- కారును డ్రైవ్ చేస్తోన్న సమయంలో సీట్ బెల్ట్ ధరించడం. మురళీకృష్ణగా రైతు పాత్రలో నటించిన బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ మీద చిత్రీకరించిన ఓ సన్నివేశం అది. అందులో బాలకృష్ణ ఓపెన్ టాప్ జీప్‌ను డ్రైవ్ చేస్తూ అప్రోచ్ రోడ్ మీదుగా ప్రధాన రహదారికి చేరుకుంటోన్న సమయంలో ఓ భారీ టిప్పర్ వేగంగా వెళ్తుంది. దాన్ని చూసిన బాలకృష్ణ సడన్ బ్రేక్ వేస్తాడు. దీనితో- పక్క సీటులో కూర్చున్న ప్రగ్యా జైస్వాల్ ఒక్కసారిగా తూలి డాష్ బోర్డును ఢీ కొట్టబోతుండగా.. బాలకృష్ణ తన ఎడమ చేతికి అడ్డుగా పెడతాడు.

బాలకృష్ణకు థ్యాంక్స్..

బాలకృష్ణకు థ్యాంక్స్..

అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటనతో ప్రగ్యా జైస్వాల్ భయాందోళనకు గురి కాగా.. బాలయ్య ఆమెను అనునయిస్తాడు. చిరునవ్వుతో సీట్ బెల్ట్ పెట్టుకోండి..జీవితం చాలా విలువైనది.. అని సూచిస్తాడు. 17 సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియోను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినియోగించుకున్నారు. ఈ క్లిప్‌ను తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. సీట్ బెల్ట్ ధరించాలనే సామాజిక సందేశాన్ని తన సినిమాలో పెట్టుకున్నందుకు వారు బాలకృష్ణ‌కు కృతజ్ఙతలు తెలిపారు.

 ప్రతీసారీ సీట్ బెల్ట్ తప్పనిసరి..

ప్రతీసారీ సీట్ బెల్ట్ తప్పనిసరి..

దూరం ఎంత అనేది, కారు ఎవరిదనేది లెక్క కాదని, ప్రతీసారీ సీట్ బెల్ట్‌ను తప్పనిసరిగా ధరించాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన, చైతన్యాన్ని కలిగించేలా ఈ సన్నివేశాన్ని చిత్రీకరించినందుకు వారు దర్శకుడు బోయపాటి శ్రీనుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు వారిద్దరికి ఈ వీడియో ట్యాగ్ చేశారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.

English summary
Hyderabad Traffic Police thanks to Actor Nandamuri Balakrishna for teaching lesson to wearing seat belt in his latest movie Akhanda
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X