వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తగులబడుతుండగానే ఆ విషయం బాబుకు ఎలా తెలిసింది: అంబటి

By Pratap
|
Google Oneindia TeluguNews

గుంటూరు: తునిలో కాపు ఐక్య గర్జన నిర్వహిస్తుండగా విధ్వంసకాండ జరిగినప్పుడు ఒక వైపు రైలు తగులబడుతుండగానే అదే సమయంలో ఆ ఘటన వెనక ఎవరున్నారో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఎలా తెలుసునని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు ప్రశ్నించారు. అప్పుడు రైలు కాలుతుండగానే చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఆ ఘటన వెనక కాపులు లేరని, కడప నుంచి వచ్చిన గుండాలు ఉన్నారని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేారు

సాధారణంగా ఎవరికీ అంత వెంటనే తెలియదని, విచారణ తర్వాత చెప్పాల్సి ఉంటుందని, కానీ రాజకీయ కక్షతో మొదటి రోజు నుచి తమ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడేందుకే టిడిపి ప్రభుత్వం ప్రయత్నించిందని అన్నారు. తుని ఘటనతో తమ పార్టీ సంబంధం లేదని అందరికీ తెలుసునని ఆయన అన్నారు.

అయితే మోకాలికీ బోడిగుండుకు ముడిపెట్టి వైసిపి నేతృత్వంలో జరిగిందని అపవాదు మోపి రాజకీయ కక్ష తీర్చుకోవాలని చంద్రబాబు ఇలా చేస్తున్నారని ఆయనయ అన్నారు. భూమన కాల్ డేటాలో ముద్రగడ నెంబరు ఉందనే విషయంపై అంబటి రాంబాబు స్పందించారు..

Amabati ramababu questions Chandrababu on Tuni incident

ఇందులో రహస్యం ఏమీ లేదని, భూమన స్వయంగా ముద్రగడను కలిసి ఆయనయ చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఉంటుందని చెప్పారని అంబటి చెప్పారు. భూమన కరుణాకర్ రెడ్డితో పాటు తాను కూడా అదే విషయం చెప్పానని, ముద్రగడ ఆశయాలను బలపరిచేవాళ్లు చాలా మందే ఉన్నారని ఆయన అన్నారు. సాక్షాత్తు తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాపులను బీసీల్లో చేర్చాలనే ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారని ఆయన చెప్పారు.

తునిలో జరిగిన విధ్వంసం జరగకూడని విషయమని ఆయన అన్నారు. దానిపై వెంటనే న్యాయవిచారణ జరిపించి దోషులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. గుంటూరు సిఐడి కార్యాలయం బయట రోడ్డు మీద ఉన్న శానససభ్యులు ఎందుకు వెళ్లిపోవాలో అర్థం కాలేదని ఆయన అన్నారు

వాస్తవానికి భూమన కరుణాకర్ రెడ్డి విచారణ మధ్యాహ్నం 3 గంటలకే అయిపోయినట్లు తమకు సమాచారం ఉందని, కేవలం మానసిక ఒత్తిడి పెంచడానికే ఇలా ఎక్కువ సేపు కూర్చోబెడుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు పాలన మొత్తం పోలీసు రాజ్యంగానే సాగుతోందని, భూమనపై ఎలాంటి చర్య తసుకున్నా తాము చట్టపరంగా న్యాయపరంగా ఎదుర్కుంటామని చెప్పారు. అందరూ ఇలా కక్ష సాధింపు ధోరణితో కొనసాగితే ఇక తమిళనాడుకు మనకు తేడా ఏముంటుందని ఆయన అడిగారు.

English summary
YSR Congress party leader Amabti Rambabu questioned Andhra Pradesh CM Nara Chandrababu naidu on Tun incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X