వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్! బాబంటే ప్రేమా? భయమా?: అవిశ్వాసంపై తేల్చి చెప్పిన అంబటి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవిశ్వాస తీర్మానంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోన్ రెడ్డి సవాల్ స్వీకరిస్తామన్నారే తప్ప.. సవాల్ చేయలేదని స్పష్టం చేశారు.

Recommended Video

YS Jaganmohan Reddy Touches PM Narenda Modi Legs !

పవన్ కళ్యాణ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు చెప్పడం సరికాదని అంబటి రాంబాబు అన్నారు. మంగళవారం ఉదయం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. హోదా సాధనలో మీ పాత్ర ఏమిటంటే పవన్ కళ్యాణ్ కు బాధేసిందేమోనని అన్నారు.

చిన్న పిల్లాడిలా పవన్..

చిన్న పిల్లాడిలా పవన్..

ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో మార్చి 21న అవిశ్వాస తీర్మానం తమ పార్టీ పెడుతోందని అంబటి చెప్పారు. అయితే, పవన్ మాత్రం ఇప్పుడే పెట్టాలని చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నారని అంబటి ఎద్దేవా చేశారు. పవన్ చెప్పినట్లుగా అవిశ్వాసం పెట్టేందుకు జగన్ అంగీకరిస్తే.. ఇప్పుడే పెట్టాలనడం ఏంటని ప్రశ్నించారు.

పవన్ అలా చేయాలి..

పవన్ అలా చేయాలి..

తమకు ఇప్పుడు అవిశ్వాసం పెట్టాలన్నా అభ్యంతరం లేదని అన్నారు. తమకు 5ఎంపీలే ఉన్నారని, మరో 45మంది ఎంపీల మద్దతు ఉంటేనే పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం నిలబడుతుందని చెప్పారు. 20మంది టీడీపీ ఎంపీలను అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చేలా పవనే చూడాలని అన్నారు.

మమ్మల్నే ఎందుకు?

మమ్మల్నే ఎందుకు?

తాము రాజీనామా చేస్తామంటే తమ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నారని, అవిశ్వాసం పెడతామంటే ఇప్పుడే పెట్టమంటారని పవన్ కళ్యాణ్‌పై అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదా కోసం ఎలాంటి ప్రయత్నం చేయని బాబును నమ్ముతారు కానీ, వైసీపీని మాత్రం నమ్మరా? అని నిలదీశారు. అవిశ్వాస తీర్మానం తలా తోక లేనిదని చంద్రబాబు ఇటీవల వ్యాఖ్యానించారని అంబటి గుర్తు చేశారు.

బాబు వ్యాఖ్యలు జగన్‌ను కాదు పవన్‌ను ఉద్దేశించినవే

బాబు వ్యాఖ్యలు జగన్‌ను కాదు పవన్‌ను ఉద్దేశించినవే


పార్లమెంటు విధానాలు వారికి తెలియవని చంద్రబాబు అన్న వ్యాఖ్యలు జగన్‌ను ఉద్దేశించి కావని.. అవి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించినవేనని అంబటి తెలిపారు.
పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెడితే అప్పుడే పరిగణలోకి తీసుకుంటారని.. అడ్వాన్స్ బుకింగ్స్ ఏమీ ఉండవని అంబటి అన్నారు. అయితే, అవిశ్వాసం పెడితే కనీసం 50మంది ఎంపీలు మద్దతుగా నిలబడాలని.. లేదంటే అది పక్కన పడేస్తారని చెప్పారు. అందుకే మద్దతు సమీకరించి అవిశ్వాసం పెట్టాలని అనుకుంటున్నామని తెలిపారు.

పవన్ వ్యవహారంపై ప్రజల్లో బాధ ఉంది

పవన్ వ్యవహారంపై ప్రజల్లో బాధ ఉంది

చంద్రబాబు హోదా కోసం ఒక్క మాట మాట్లాడకున్నా.. ఆయనపై పవన్ ఎలాంటి విమర్శలు చేయరని.. పోరాటం చేస్తున్న వైసీపీనే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబును ప్రశ్నించే హక్కు పవన్ కు ఉందని అన్నారు. 1.25శాతం ఓట్లతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, దానికి కారణం పవనే అని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. అలాంటి పవన్ బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నానే బాధ ప్రజల్లో ఉందని అన్నారు.

వపన్.. బాబంటే ప్రేమా? భయమా?

వపన్.. బాబంటే ప్రేమా? భయమా?

ప్యాకేజీ ఇచ్చిన రోజునే సమావేశం పెట్టి కేంద్రంలోని బీజేపీ సర్కారు పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని పవన్ అన్నారని.. కానీ ఆ ప్యాకేజీ అద్భుతంగా ఉందన్న బాబును మాత్రం పవన్ ఏమీ అనలేదని అంబటి విమర్శించారు. చంద్రబాబు తప్పులు చేస్తున్నా.. పవన్ ఏమీ అనకపోవడానికి ఆయనపై ఉంది ప్రేమా? లేక భయమా? అని అంబటి ప్రశ్నించారు.

English summary
YSRCP leader Amabati Rambabu on Tuesday fired at Andhra Pradesh CM Chandrababu Naidu and Janasena president Pawan Kalyan for No-confidence motion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X