వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్! ఎలా నమ్మాలి? బాబుపై అలా.. జగన్‌పై ఇలా: నాశనం చేస్తున్నారని ఏకేసిన అంబటి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏపీ ప్రత్యేక హోదా కోసం మొదట్నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే పోరాటం చేస్తున్నారని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు చెప్పారు. హోదా కోసం నిరాహార దీక్షలు, యువభేరీలు, అనేక కార్యక్రమాలు చేపట్టారని అంబటి గుర్తు చేశారు.

Recommended Video

Pawan Kalyan Dramas Over 'No Confidence Motion'

పవన్! బాబంటే ప్రేమా? భయమా?: అవిశ్వాసంపై తేల్చి చెప్పిన అంబటి పవన్! బాబంటే ప్రేమా? భయమా?: అవిశ్వాసంపై తేల్చి చెప్పిన అంబటి

ఇన్ని పోరాటాలు చేస్తున్నా.. ప్రతిపక్ష పార్టీపైనే పవన్ విమర్శలు చేయడం ఎందుకో ప్రజలకు అర్థమవుతోందని అన్నారు. అవిశ్వాస తీర్మానం వద్దని బాబు వ్యాఖ్యానించినా ఆయన్ను పవన్ ఏమీ అనడం లేదని అన్నారు. దీంతో ప్రజలకు పవన్ పై అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు.

పవన్ ఎవర్నో మోస్తున్నట్లుంది..

పవన్ ఎవర్నో మోస్తున్నట్లుంది..

కాగా, వపన్ ప్రెస్ మీట్ తర్వాత అవసరమైతే అవిశ్వాసం పెడతామని చంద్రబాబు వ్యాఖ్యానించడంలో ఆంతర్యం ఏమిటని అంబటి ప్రశ్నించారు. పవన్.. వీటన్నింటిపై చంద్రబాబును ప్రశ్నించాలన్నారు. పవన్ తప్పుగా పోతున్నారని, సమస్యల పరిష్కారం కోసం కాకుండా వినూత్నమైన మార్గాలను అవలంభిస్తున్నారని అన్నారు.
పవన్ నిష్పాక్షింగా వ్యవహరించడం లేదని, ఎవర్నో మోస్తున్నట్లుందని అన్నారు.

బాబు, పవన్ మద్దతిచ్చినా.. ఇవ్వకున్నా..

బాబు, పవన్ మద్దతిచ్చినా.. ఇవ్వకున్నా..

పవన్.. చంద్రబాబు.. మద్దతు ఇచ్చినా ఇవ్వకున్నా పార్లమెంటు వైసీపీ అవిశ్వాస తీర్మానం పెడుతుందని అంబటి స్పష్టం చేశారు. మార్చి 21 వరకు ఆందోళనలు చేస్తామని, ఆ తర్వాత బలసీమకరణ చేసి అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పారు.
కేంద్రంపై కలిసి పోరాటం చేద్దామని ఈ సందర్భంగా అంబటి పిలుపునిచ్చారు.

పవన్ మాటల్లోనే చిత్తశుద్ధి.. చేతల్లో?

పవన్ మాటల్లోనే చిత్తశుద్ధి.. చేతల్లో?

పవన్ మాటల్లోనే చిత్తశుద్ధి కనిపిస్తోందని చేతల్లో కనిపించడం లేదని అంబటి రాంబాబు అన్నారు. పవన్ జేఎఫ్‌సీ మంచిదేనని, ఆ కమిటీలో జస్టిస్ గోయెల్, జేపీ, ఉండవల్లి అరుణ్ కుమార్, ఐవైఆర్ కృష్ణారావు మొదలైన పెద్దవాళ్లున్నారని చెప్పారు. అయితే, ఆ కమిటీ సాధించేదేంటో అర్థం కావడం లేదన్నారు. హోదాను ముంచింది బాబేనని వారెందుకు అనడం లేదని ప్రశ్నించారు. కేంద్రం నిధుల లెక్క తేలితే సరిపోతుంది.. రాష్ట్రం ఏ విధంగా ఖర్చు చేసిందో తెలియాల్సిన అవసరం లేదన్నట్లు జేపీ వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు.

టీడీపీ మద్దతిచ్చేలా పవన్ చూడాలి..

టీడీపీ మద్దతిచ్చేలా పవన్ చూడాలి..

ఎంపీ వైవీ సుబ్బారెడ్డి 184కింద నోటీసు ఇచ్చారని.. దీంతో పార్లమెంటులో హోదాపై చర్చ జరుగుతుందని అంబటి చెప్పారు. ఓటింగ్ కూడా జరుగుతుందని, దీనికి బాబు తన పార్టీ ఎంపీలు మద్దతిచ్చేలా చూడాలని అన్నారు. పవన్ కూడా వీరంతా హోదా చర్చకు మద్దతిచ్చేలా ప్రయత్నించాలని, అప్పుడే ప్రజలు నమ్ముతారని అన్నారు.

పవన్.. రాళ్లేయడం మానుకో.. స్పందించు..

పవన్.. రాళ్లేయడం మానుకో.. స్పందించు..

వైసీపీ మీద రాళ్లేసే ప్రయత్నం మానుకోవాలని పవన్ కు అంబటి రాంబాబు సూచించారు. ముగ్గురు ఎంపీలు, 23మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నప్పుడు పవన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. నీతి నిజాయితీతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకుంటున్న పవన్.. వారిని రాజీనామా చేయాలని ఎందుకు కోరడం లేదని అన్నారు.

పవన్.. ఎలా నమ్మాలి?

పవన్.. ఎలా నమ్మాలి?

బాబు మీకు పాట్నర్ కాదంటే ఎందుకు నమ్మాలి అని పవన్‌ను అంబటి ప్రశ్నించారు. జగన్ మీద కేసులున్నాయని అంటున్నారే తప్ప.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడం లేదని పవన్ ను నిలదీశారు. ఆయనకెందుకు ప్రత్యేక రిజర్వేషన్ అని అన్నారు. లేదంటే బాబు పాలన మంచిగా ఉందని చెప్పండి అని అన్నారు.

బాబు నాశనం చేస్తున్నారు..

బాబు నాశనం చేస్తున్నారు..

చంద్రబాబును ఒప్పించి కేంద్రమంత్రివర్గం నుంచి టిడిపి వాళ్లను తప్పుకోమనండి.. తమతో కలిసి రమ్మనండి అని పవన్ కు అంబటి సూచించారు. ప్రతిపక్షంపై విమర్శలు చేస్తూ.. అధికార పక్షానికి మద్దతు ఎలా? ఇస్తున్నారని అన్నారు. ఊగిసలాటతో చంద్రబాబు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు అవగాహన లేదు.. తాము తప్పుకుంటే వచ్చి దూరతారని చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని అన్నారు. తాము రాజీనామా చేసేందుకు సిద్ధమవుతుంటే.. అలా ఎందుకు చేస్తామని అన్నారు.

English summary
YSRCP Leader Amabati Rambabu on Tuesday lashed out at Andhra Pradesh CM Chandrababu Naidu and Janasena Party president Pawan Kalyan special status issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X