వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసుల చక్రబంధంలో అమలాపురం: బస్సులు తాత్కాలిక రద్దు; కొత్తవారు రాకుండా ఆంక్షలు

|
Google Oneindia TeluguNews

కోనసీమ జిల్లా పేరు మార్పుపై కోనసీమ సాధన సమితి ఆధ్వర్యంలో మొదలైన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో రాష్ట్రంలో ఒక్క సారిగా కోనసీమ జిల్లాపై దృష్టి కేంద్రీకృతమైంది. కోనసీమ జిల్లా పేరును డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చడాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేపట్టిన నిరసనకారులు ఒక్కసారిగా మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటిని తగలబెట్టడం, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిపై దాడి చేయడం, వాహనాలు తగలబెట్టడం, రాళ్లు రువ్వడం, పోలీసులను గాయాలపాలు చేయడం వంటి హింసాత్మక ఘటనలకు పాల్పడడంతో కోనసీమలో ఒక్కసారిగా అగ్గి రాజుకుంది.

పోలీసుల చక్రబంధంలో అమలాపురం

పోలీసుల చక్రబంధంలో అమలాపురం

అమలాపురంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో ప్రస్తుతం అమలాపురం పోలీసుల వలయంలోకి వెళ్ళిపోయింది. అమలాపురాన్ని పోలీసులు ప్రస్తుతం అష్టదిగ్బంధం చేశారు. కోనసీమ జిల్లాలో భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు, ముఖ్యంగా అమలాపురంలో పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా అడుగడుగునా పోలీస్ పికెట్లు, భారీ గస్తీని ఏర్పాటు చేశారు. రాత్రి నుంచి అమలాపురంలో జోరుగా వర్షం కురుస్తున్నా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పోలీసులు పోలీస్ పికెట్లను ఏర్పాటు చేశారు.

అమలాపురంలో అనుమాతులపై నిఘా, కొత్తవారు రాకుండా ఆంక్షలు

అమలాపురంలో అనుమాతులపై నిఘా, కొత్తవారు రాకుండా ఆంక్షలు


అమలాపురం పట్టణంలోకి అనుమానితులు ఎవరూ రాకుండా నిఘా పెట్టారు. అమలాపురంలో పరిస్థితుల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు అక్కడే మకాం వేసి మరీ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఈరోజు రెండు వర్గాలు ఆందోళనకు పిలుపునివ్వడంతో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. అమలాపురం పట్టణంలోకి బయట వారిని వారిని రానీయకుండా కఠిన ఆంక్షలు విధించారు పోలీసులు .

 అమలాపురం డిపో నుండి బస్సులు తాత్కాలిక నిలిపివేత

అమలాపురం డిపో నుండి బస్సులు తాత్కాలిక నిలిపివేత


ఇదిలా ఉంటే అమలాపురం డిపో నుండి బస్సు సర్వీసులను కూడా తాత్కాలికంగా రద్దు చేశారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బస్సులను కూడా ప్రయాణికులు లేకుండానే తిప్పి పంపిస్తున్నారు. బస్సులు రద్దు సమాచారం లేక వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి బస్టాండ్ కు చేరుకున్న ప్రయాణికులు బస్సుల రద్దుతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అమలాపురం లో సెక్షన్ 144 అమలు అవుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు కోనసీమ జేఏసీ పిలుపుతో ఆందోళనకారులు చలో రావులపాలెం అంటూ ఆందోళన కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో ఆందోళనలను కట్టడి చేయడానికి భారీగా పోలీసులు మోహరించారు.

అమలాపురం పట్టణాన్ని అధీనంలోకి తీసుకున్న పోలీసులు

అమలాపురం పట్టణాన్ని అధీనంలోకి తీసుకున్న పోలీసులు


కోనసీమ జిల్లాలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్పు చేస్తూ రెవిన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆగ్రహంతో ఊగిపోయిన జిల్లా వాసులు ఆందోళన బాట పట్టారు. కోనసీమ జేఏసీ పేరుతో ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఈ ఆందోళన కాస్త ఉద్రిక్తంగా మారడంతో అమలాపురంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసులు అమలాపురం పట్టణాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. అష్ట దిగ్బంధనం చేసి పరిస్థితిని కంట్రోల్ చేస్తున్నారు.

English summary
Amalapuram went into police custody in the wake of the Konaseema tensions. Buses from Amalapuram depot were suspended. Newcomers were barred from entering. Police pickets were set up in Amalapuram at every step.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X