వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రకాశం జిల్లాలో కరణం బలరాం కి తలనొప్పిగా మారిన ఆమంచి కృష్ణ మోహన్

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఎన్నికల్లో వైసిపి ప్రభంజనం కొనసాగినా ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో ఆమంచి కృష్ణ మోహన్ మాత్రం ఘోర ఓటమి పాలయ్యారు. ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికలకు ముందు నుంచి వివాదాస్పదుడు . ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసిపిలోకి పార్టీ ఫిరాయించిన ఆమంచి చీరాలలో టిడిపి సీనియర్ నేత కరణం బలరాంపై 17 వేల ఓట్ల భారీ తేడాతో పరాజయం పొందారు. అయినా ప్రకాశం జిల్లా రాజకీయాలలో కీలక వ్యక్తిని తానేనని ప్రతి విషయంలో వేలు పెడుతూ టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం కి పెద్ద తలనొప్పిగా తయారయ్యారు.

<strong>గోరంట్ల మాధవ్ ను టార్గెట్ చేసిన లోకేష్ ..జే ట్యాక్స్ కోసం వణికిస్తున్నారని ట్వీట్</strong>గోరంట్ల మాధవ్ ను టార్గెట్ చేసిన లోకేష్ ..జే ట్యాక్స్ కోసం వణికిస్తున్నారని ట్వీట్

స్థానిక ఎమ్మెల్యే కరణం బలరాంకు చుక్కలు చూపిస్తున్న ఆమంచి

స్థానిక ఎమ్మెల్యే కరణం బలరాంకు చుక్కలు చూపిస్తున్న ఆమంచి

రాష్ట్రమంతా ఫ్యాను గాలి వీచిన సమయంలో చీరాలలో ఓటమికి మాత్రం ఆమంచి వ్యక్తిగత ప్రవర్తనే కారణమని పలువురు ఇప్పటికే ఆయనపై ఒక అభిప్రాయంతో ఉన్నారు. ఇక ఎన్నికల్లో ఓటమిని చవి చూసిన ఆమంచి కుటుంబం ఎన్నికలు ముగిసినప్పటినుంచి స్థానికంగా ఉన్న ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుండటంతో పాటు స్థానిక ఎమ్మెల్యేను ఇబ్బంది పెట్టటంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు . తాను ఓటమి పాలైనా , తమ ప్రభుత్వం గెలిచిందని ఏదున్నా తన మాటే వినాలని ఆయన స్థానిక అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. అయితే ఓడిన కానీ తన పట్టు తగ్గకుండా చూసుకోవాలని ఆమంచి గట్టి పట్టుదలతో ఉన్నాడు. అందుకే ఎమ్మెల్యే కరణం బలరాం ని కాకుండా తన మాటకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన జులుం చేస్తున్నారు.

గ్రామ వాలంటీర్ పోస్టుల విషయంలో తనమాటే వినాలని అధికారులకి హుకుం జారీ చేసిన ఆమంచి

గ్రామ వాలంటీర్ పోస్టుల విషయంలో తనమాటే వినాలని అధికారులకి హుకుం జారీ చేసిన ఆమంచి

ఇక చీరాల నియోజకవర్గంలో ప్రతి పనిలో కూడా వేలుపెడుతూ నేను ఓడిపోయినా మా ప్రభుత్వం గెలిచింది, నేను చెప్పిన పనులు చేయండంటూ అధికారులకి అదేశాలిస్తున్నారు. ముఖ్యంగా గ్రామ వాలంటీర్ పోస్టుల విషయంలో ఆమంచి దూకుడు చూపిస్తున్నాడు.తాను ఇవ్వమన్న వాళ్ళకే గ్రామ వాలంటీర్ లు గా అవకాశం ఇవ్వమని ఆయన అధికారులను ఇబ్బంది పెడుతున్నారు. దీంతో కరణం బలరాం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తాను స్థానిక ఎమ్మెల్యే నని తన మాట వినాలని ఆయన ఎమ్మెల్యే గా రికమండేషన్ లెటర్స్ ఇచ్చి పంపుతున్నారు .స్థానిక ఎమ్మెల్యే అనుమతి లేకుండా ఎలా చేస్తారంటూ రెచ్చిపోతున్నారు. ఒక పక్క ఆమంచి, మరో పక్క కరణం ఇద్దరు కూడా నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం పోటీపడుతున్నారు. ఈ క్రమంలో ఏమి చేయాలో అధికారులకి తెలియక తికమక పడుతున్నారు. ఎమ్మెల్యేగా తాను గెలిచినప్పటికీ తనకు పట్టు లేకుండా చెయ్యాలని చూస్తున్న ఆమంచి ప్రవర్తన ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం కు పెద్ద తలనొప్పిగా మారింది.

కరణం బలరాం కు కూడా కొరకరాని కొయ్యగా మారిన ఆమంచి.. అమంచికి చెక్ పెట్టేపనిలో కరణం బలరాం

కరణం బలరాం కు కూడా కొరకరాని కొయ్యగా మారిన ఆమంచి.. అమంచికి చెక్ పెట్టేపనిలో కరణం బలరాం

ఒంగోలులో ఓటమికి స్థానిక వైసీపీ నేతలు కారణం అని వారిని టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేసిన ఆమంచి వివాదాస్పదుడుగా ముద్ర వేసుకున్నాడు. ఆమంచి వ్యవహార శైలిపై జగన్ చర్య తీసుకోకుంటే పార్టీకి కష్టమే అని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అటు ఎన్నికల్లో గెలవక, ఇటు స్థానికంగా ఉన్న వైసిపి నేతలతోనే పొసగక, రోజుకు ఒక వివాదాన్ని కొనితెచ్చుకుంటున్న ఆమంచి కృష్ణమోహన్ , ఇటు ఎమ్మెల్యే కరణం బలరాం కు కూడా కొరకరాని కొయ్యగా మారారు. ఎన్నికల్లో గెలవలేకున్నా , అన్నీ నేనే , అంతా నేనే అన్నట్టు చూడాలని చేస్తున్న ప్రయత్నం ఎప్పటికప్పుడు కరణం బలరాం తిప్పికొట్టే పనిలో పడ్డారు.

English summary
Former MLA Amanchi Krishna Mohan defeated by TDP MLA Karanam Balaram. Since the loss of the election, he is involving in every work in the cheerala constituency, our government won, and the authorities were obliged to do what I said. He is particularly aggressive in the case of village volunteer posts.MLA Karanam Balaram also became embarrassed. Balaram is trying to check for Amanchi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X