దౌత్యం ఫలించేనా: త‌్రిమూర్తులుతో భేటీ వెనుక : ఆమంచి అడుగు అటేనా..!
చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రాజకీయ అడుగుల పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. టిడిపి తో బంధం తెం చుకొని వైసిపి వైపు అడుగులు వేయాలని ఆమంచి భావించి..కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆ సమయంలో టిడిపి అధినాయకత్వం రంగ ప్రవేశం చేసింది. ఆమంచి తో సన్నిహితంగా ఉండే మరో నేతతో దౌత్యం నడిపింది. సీయం తో నూ ఆమంచి సమావేశం కానున్నారు. దీంతో..ఇప్పుడు ఆమంచి అడుగులు ఎటువైపు అనే ఆసక్ది మొదలైంది..
త్రిమూర్తులుతో దౌత్యం..
టిడిపి ని వీడే ఉద్దేశంతో వేగంగా అడుగులు వేస్తున్న చీరాల ఆమంచి కృష్ణమోహన్ ను బుజ్జగించేందుకు టిడిపి అధి నాయకత్వం అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. వైసిపి లో చేరాలనే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేసిన ఆమంచి వద్దకు మంత్రి సిద్దా రాఘవరావును పంపి బుజ్జగింపులు చేసిన పార్టీ అధినాయకత్వం..ఇప్పుడు మరో అస్త్రం ప్రయో గించింది. ఆమంచి తో సన్నిహితంగా ఉండే తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఈ విషయంలో రంగ ప్రవేశం చేసారు.

ముఖ్యమంత్రి సూచన మేరకు ఆయన ఆమంచిని తన నివాసానికి ఆహ్వానించి న చ్చ చెప్పే ప్రయత్నం చేసారు. ఆ సమావేశంలో ఆమంచి సైతం తాను నియోజకవర్గంలో ఎదుర్కొంటున్న ఇబ్బందు లను వివరించారు. త్రిమూర్తులు స్వగ్రామమైన వెంకటాయపాలెం వెళ్లి ఆయనతో చర్చించారు. చీరాల నియోజక వర్గం లో తన వ్యతిరేకికి ఒకటికి రెండు పదవులు ఇవ్వడంతోపాటు, కింది స్థాయిలో కొందరు నాయకుల వ్యతిరేక చర్యలను నిరోధించకపోవడం పై ఆమంచి ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
చీరాల ఎమ్మెల్యే ఆమంచి కీలక వ్యాఖ్యలు, రంగంలోకి చంద్రబాబు: ఆ తర్వాత నిర్ణయం
ఆమంచి మెత్తబడినట్లేనా..
టిడిపి నుండి వస్తున్న ఒత్తిడితో ఆమంచి మెత్తబడినట్లా..కాదా అనే ఆసక్తి కర చర్చ సాగుతోంది. చంద్రబాబు, లోకేశ్ జోక్యం, మంత్రి శిద్దా రాఘవరావు చర్చలు జరిపి సీఎంను కలవాలని సూచించిన నేపథ్యంలో..ఆమంచి అప్పటిదాకా తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఈలోపు త్రిమూర్తులు తెరపైకి వచ్చారు. తొలి నుంచి కృష్ణమోహన్‌తో ఆయన కు సాన్నిహిత్యం ఉంది.

త్రిమూర్తులు తన కుమారుడి పెళ్లి పనుల నిమిత్తం స్వగ్రామమైన వెంకటాయపాలెంలో ఉ న్నారు. అక్కడకు రమ్మని ఆమంచిని ఆహ్వానించారు. ఎమ్మెల్యే బుధవారం సాయంత్రం అక్కడకు చేరుకున్నారు. ఇద్దరూ రెండు గంటలపాటు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. తన సమస్యలను వివరించిన ఆమంచి బుధవారం పార్టీ అధినేత..ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలవనున్నారు. ఆ తరువాతనే తన రాజకీయ నిర్ణయం ప్రకటించనున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!