వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆమంచి మ‌రో ట్విస్ట్ : సీయం అన్నీ ఒప్పుకున్నారు ..కానీ,: ఆయ‌న రూటు ఇక అటేనా..!

|
Google Oneindia TeluguNews

పొలిటిక‌ల్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా మారిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహ‌న్ వ్య‌వ‌హారం లో మ‌రో ట్విస్ట్. టిడిపి నుండి బ‌య‌ట‌కు రావాల‌నే నిర్ణ‌యం తో అభిమానుల‌తో ఆమంచి స‌మావేశం కావ‌టం..టిడిపి అధినాయ‌కత్వం జోక్యం చేసుకోవ టంతో..ఆమంచి నేరుగా ముఖ్య‌మంత్రితో స‌మావేశం అయ్యారు. ఆయ‌న తో ఓపెన్ మైండ్‌తో మాట్లాడారు. సమావేశం సం తృప్తి కరంగా సాగింది. అయినా..అంటూ అసలు ట్విస్ట్ అక్క‌డే..ఇక ఆమంచి రూటు అటేనా..

భేటీలో ఏం తేల్చారు...

భేటీలో ఏం తేల్చారు...

మూడు రోజులుగా పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిన ఆమంచి కృష్ణ‌మోహ‌న్ వ్య‌వ‌హారానికి ముగింపు ప‌ల‌కాల ని టిడిపి నిర్ణ‌యించింది. ఆయ‌న ఎలాగైనా వైసిపి లోకి వెళ్ల‌కుండా చూడాలని భావించింది. ఆయ‌న పార్టీ వీడుతున్నార‌నే స‌మాచారం అంద‌గానే మంత్రి సిద్దాను పంపి రాయ‌బారం న‌డిపారు. ముఖ్య‌మంత్రి..లోకేష్ ఇద్ద‌రూ ఫోన్ లో చ‌ర్చించారు. ఆ త‌రువాత ఆమంచి కి మంచి మిత్రుడైన తోట త్రిమూర్తుల‌ను రంగంలోకి దింపారు. ఆయ‌న తో నూ ఆమంచి సుదీర్ఘ మంత‌నాలు జ‌రిపారు. అయినా ఆమంచి మెత్త‌బ‌డ‌లేదు. నేరుగా సీయం ను క‌ల‌వ‌టానికి ఆయ‌న మాట కోసం అసెంబ్లీకి వ‌చ్చారు. మంత్రి సిద్దాతో క‌లిసి ముఖ్య‌మంత్రితో స‌మావేశం అయ్యారు. తాను నియోజ‌క‌వ‌ర్గం లో ఎదుర్కొంటున్న ప‌రిస్థితుల‌ను వివ‌రించారు.

సీయం అభ‌యం...నేను చూసుకుంటా..

సీయం అభ‌యం...నేను చూసుకుంటా..

రాల నియోజ‌క‌వ‌ర్గంలో స్వ‌తంత్ర అభ్య‌ర్దిగా గెలిచిన తాను టిడిపిలో చేరిన త‌రువాత అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటు న్నాన‌ని ఆమంచి సీయం దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు స‌మాచారం. టిడిపి నేత‌లు కొంద‌రు త‌న‌ను డామినేట్ చేస్తూ రాజ‌కీ యాలు చేస్తున్నార‌ని సీయంకు వివ‌రించారు. అక్క‌డ ఉన్న ప‌రిస్థితుల్లో తాను అడ్జ‌స్ట్ కాలేక‌పోతున్నాన‌ని సీయం ముందు ఆమంచి వాపోయిన‌ట్లు తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి సైతం ఆమంచిని వారించే ప్ర‌య‌త్నం చేసారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఎటువంటి ఇబ్బందులు రావ‌ని..ఇప్ప‌టికే పోతుల సునీత‌కు ఎమ్మెల్సీ ఇచ్చామ‌ని..వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ ఎమ్మెల్యే అభ్య‌ర్దిగా మీరే ఉంటార‌ని ఆమంచికి ముఖ్య‌మంత్రి హామీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. తాను ఇదే విష‌యాన్ని త‌న అనుచ‌రుల‌తో మాట్లాడి నిర్ణ‌యం చెబుతాన‌ని సీయం కు ఆమంచి వివ‌రించిన‌ట్లు తెలుస్తోంది.

ఆమంచి రూటు ఇక అటేనా..

ఆమంచి రూటు ఇక అటేనా..

ముఖ్య‌మంత్రితో స‌మావేశం త‌రువాత ఆమంచి మీడియాతో మాట్లాడారు. తాను సీయం తో జ‌రిగిన స‌మావేశం పై సం తృప్తి క‌రంగా ఉన్న‌ట్లు చెప్పారు. ముఖ్య‌మంత్రి ప‌రిస్థితి సెట్ చేస్తాన‌ని హామీ ఇచ్చార‌ని చెప్పుకొచ్చారు. తన‌కు టిడిపి లో కొన‌సాగాల‌ని ఉంది కానీ, అంటూ డైల‌మా కొన‌సాగించారు. అయితే, ఆమంచి కృష్ణ‌మోహ‌న్ చెప్పిన మాట‌లు.. సీ యం తో స‌మావేశానికి ముందు..త‌రువాత ఆయ‌న చెబుతున్న విష‌యాలు లోతుగా ప‌రిశీలిస్తే ఆయ‌న టిడిపిలో కొన‌సా గే ప‌రిస్థితి లేద‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. అయితే త‌న అనుచ‌రుల‌తో సమావేశ‌మై రెండు మూడు రోజుల్లో త‌న నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తాన‌ని చెబుతున్నారు. అదే స‌మ‌యంలో టిడిపి లో అడ్జ‌స్ట్ అవ్వ‌లేక‌పోతున్నాన‌ని చెప్ప‌టం ద్వారా ఇక ఆయ‌న పార్టీ వీడ‌టం ఖాయ‌మ‌నే అభిప్రాయం బ‌లంగా వినిపిస్తోంది. దీంతో..ఆయ‌న వైసిపి వైపే అడుగులు వేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు.

English summary
Chirala Mla Amanchi Krishna Mohan met Cm Chandra babu in Assembly and discussed his problems which facing in party. CM Assured him all problem will be settled.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X