వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమరావతి రైతులపై స్పందించిన వెంకయ్యనాయుడు... రాజకీయాల్లో లేనని వ్యాఖ్య
ఏపీ రాజధాని రైతుల ఆందోళనలను తాను అర్థం చేసుకున్నానని, అయితే ప్రస్తుతం తాను ప్రభుత్వంలో లేనని, కాని రైతుల సమస్యలపై ఎవరికి చెప్పాలో వారిక తెలియజేస్తానని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మంగళవారం సాయంత్రం స్వర్ణభారతి ట్రస్ట్‌లో ఉపరాష్ట్రపతిని రాజధాని ప్రాంత రైతులు కలిసి రాజధాని మారకుండా చూడాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఉపరాష్ట్రపతి స్పందించారు.

ఈ నేపథ్యంలోనే రైతులు దేశంలో ఎక్కడా లేని విధంగా రాజధాని నిర్మాణం కోరకు 33 వేల ఎకరాలు ఇచ్చారని ,వారి బాధలు , ఇబ్బందులు నాకు తెలుసని వెంకయ్య నాయుడు తెలిపారు. అయితే తాను ప్రస్తుతానికి రాజకీయాల్లో లేనని, రాజ్యంగ పదవిలో ఉండి వివాస్పద వ్యాఖ్యలు చేయకూడదని అన్నారు. అయితే రాజధాని రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని అన్నారు.