వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్ ను కలిసిన అమరావతి జేఏసీ నేతలు .. ఏం చెప్పారంటే

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌ లో రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రాజధాని రైతుల పోరాటం నేటితో 31వ రోజుకు చేరుకుంది . ఒక పక్క రాజధాని రైతుల పోరాటం ఉధృతంగా సాగుతుంటే, మరో పక్క ప్రభుత్వం తమ పని తాము చేసుకుపోతుంది. ఇక రాజధాని రైతుల పోరాటాన్ని అడుగడుగునా అడ్డుకోవటం కోసం పోలీసులు విఫల యత్నం చేస్తున్నారు. మహిళలు అని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇక ఈ నేపధ్యంలో తాజా పరిణామాలను గవర్నర్ బిస్వభూషణ్ హరి చందన్ దృష్టికి తీసుకు వెళ్ళటానికి నిర్ణయం తీసుకున్న జేఏసి నేతలు నేడు గవర్నర్ ను కలిశారు.

రాజధాని ప్రాంతంలో రాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా నెలకొన్న పరిస్థితులను వివరించడం కోసం అమరావతి జేఏసీ నేతలు ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. రాజధాని ప్రాంతంలో పోలీసులు శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న తమపై నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, రైతులపై దాడులకు తెగబడ్డారని వారు గవర్నర్‌కు తెలిపినట్లు సమాచారం. మహిళల పట్ల పోలీసుల వైఖరిని సైతం వారు గవర్నర్ కు తెలిపారు.

Amaravathi JAC leaders met the Governor said about police over action on villagers of amaravati region

గవర్నర్‌ను కలిసి బయటకు వచ్చిన అమరావతి జేఏసీ నేతలు విలేకరులతో మాట్లాడుతూ ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అరాచకం కొనసాగుతుందని, రాజధాని రైతుల, ప్రజల బాధలను గవర్నర్‌కు వివరించామని చెప్పారు. పోలీసుల నిరంకుశ ప్రవర్తనను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. అమరావతిలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని కొనసాగేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ కోరినట్లు జేఏసీ నేతలు తెలియజేశారు. దీనిపై గవర్నర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు అమరావతి జేఏసీ నేతలు .

English summary
Amaravathi JAC leaders met Vishwabhushan Harichandan, Governor of Andhra Pradesh, to explain the situation that led to the move to the capital Amaravati. They have informed the governor that the police in the capital area are acting in total tyranny over the peaceful agitators and the farmers have been subjected to attacks. They also told the governor about the attitude of the police towards women.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X