• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమరావతి డిక్లరేషన్‌ ఆవిష్కరణ నేడే...సిఎం,స్పీకర్ తో సహా హాజరుకానున్న వివిధ రంగాల ప్రముఖులు

|

అమరావతి: సమాజంలో వివిధ రంగాల్లో ఉన్న మహిళలు, యువతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించేందుకు అమరావతి డిక్లరేషన్‌ వేదికగా నిలవనుందని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు చెప్పారు. పుస్తక రూపంలో పొందుపరచిన అమరావతి డిక్లరేషన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సాయంత్రం ఆవిష్కరించనున్నట్లు శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తెలిపారు. వివిధ రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, భవిష్యత్తులో రూపొందించే చట్టాలకు అమరావతి డిక్లరేషన్‌ సూచికగా నిలుస్తుందన్నారు.

  Real Time Governance State Center in Amaravati, Watch | Oneindia Telugu
   మహిళల కోసం సమగ్రంగా...

  మహిళల కోసం సమగ్రంగా...

  ఈ ఏడాది ఫిబ్రవరిలో పవిత్రసంగమం వద్ద వుమెన్స్‌ పార్లమెంట్‌ సదస్సులోనే మహిళల కోసం ఒక సమగ్ర డిక్లరేషన్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో విభిన్న రంగాలకు చెందిన మహిళలు తెలియచేసిన అభిప్రాయాల్ని, ఆ సదస్సులో జరిగిన చర్చలు, సిఫార్సుల్ని సంక్షిప్తంగా అమరావతి డిక్లరేషన్‌ లో పొందుపరిచినట్లు స్పీకర్ కోడెల తెలిపారు. ఈఇందులో మహిళల ఆరోగ్యం, విద్య, పౌష్టికాహారం, రక్షణ, రాజకీయాలు, పరిశోధనల్లో భాగస్వామ్యం, సామాజిక భద్రత, స్థిరమైన అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, పారిశ్రామిక రంగం వంటి మొత్తం పది రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పలు సూచనలు చేశారన్నారు.

   విఐపిల రాక....

  విఐపిల రాక....

  ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబునాయుడు, అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, కేంద్ర శాస్త్ర, సాంకేతిక స్టేట్‌ మంత్రి సుజనాచౌదరి, బాలల హక్కుల ఉద్యమవేత్త కైలాస్‌ సత్యార్ధి, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ చైర్మన్‌ అరుంధతి భట్టాచార్య, యునిసెఫ్‌ ప్రతినిధి మెల్తల్‌ రుసిడియ, అడయార్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ వి.శాంత. భారతీయ చెస్‌ గ్రాండ్‌ మాస్టర్‌ కోనేరు హంపి, ప్రపంచ నెంబరు-2 బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ కిడాంబి శ్రీకాంత్‌లు గౌరవ అతిథులుగా హాజరుకానున్నారు.

   పటిష్ట భద్రతా ఏర్పాట్లు...

  పటిష్ట భద్రతా ఏర్పాట్లు...

  అమరావతి డిక్లరేషన్‌ అవిష్కరణ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, స్పీకర్‌తో సహా వివిధ రంగాల ప్రముఖులు హాజరు కానుండటంతో వారిని ప్రొటోకాల్‌ మర్యాదలతో సభా ప్రాంగణానికి తీసుకురావడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పది వేల మంది మహిళలను, విద్యార్ధినిలను ఇక్కడకు తీసుకురావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వారందరినీ బస్సులలో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న వేదికను పోలీసుల సూచనల మేరకు నిర్మిస్తున్నారు.విఐపిల రాక దృష్ట్యా భారీ బందోబస్తు,పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని మెటల్‌ డిటెక్టర్లతో పరీక్షించిన తరువాతే లోపలికి అనుమతిస్తారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  amaravathi: Chief Minister N. Chandrababu Naidu will release the Amaravati Declaration at a function scheduled at the Siddhartha Academy grounds on Monday. Amaravathi declaration will serve as a guiding light for the governments striving for women empowerment in Andhra Pradesh and also to others in the country.. Assembly Speaker Kodela Siva Prasad Rao told the media on the sidelines of his visit to the Siddhartha Academy to supervise the arrangements for the function.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more