విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి డ్రోన్స్..మేడిన్ ఆంధ్రా..రెడీ టు మార్కెట్!..ఇవీ ప్రత్యేకతలు...

|
Google Oneindia TeluguNews

Recommended Video

అమరావతి డ్రోన్స్..మేడిన్ ఆంధ్రా.. ఇవీ ప్రత్యేకతలు..!

అమరావతి, విశాఖపట్నం: అమరావతి డ్రోన్...మేడిన్ ఆంధ్రా డ్రోన్...అచ్చ తెలుగులో చెప్పాలంటే అచ్చమైన ఆంధ్రా తయారీ డ్రోన్...మేడిన్ చైనా వస్తువులు మన దేశంలో ఎంత పాపులర్ అయ్యాయో అలాగే డ్రోన్ల రంగంలో మనదైన స్పెషాలిటీని చాటేందుకు అందరి ముందుకు వచ్చేసింది.

అమరావతి...నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని...అయితే ఇప్పుడు ఇదే పేరు ఒక ప్రత్యేక వస్తువు తయారీకి సంబంధించి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ఓ బ్రాండ్‌ కూడా కానుందా?...అంటే అవుననే అంటోంది ఎపి ఇన్నోవేషన్ అకాడెమి...అదెలాగంటే?...
ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ, డ్రోన్ తయారీ సంస్థ ఓమ్ని ప్రెసెంట్ భాగస్వామ్యంతో విశాఖపట్నంలో ఏర్పాటైన అమరావతి డ్రోన్ల మాన్యుఫాక్చరింగ్ కంపెనీ తమ తొలి ప్రొడక్ట్ ను తయారుచేశాయి. అలా తయారైన మొట్టమొదటి మేడ్ ఇన్ ఆంధ్రా డ్రోన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆవిష్కరించారు.

 డ్రోన్ తయారీకి...అంకురార్పణ...

డ్రోన్ తయారీకి...అంకురార్పణ...

టెక్నాలజీ వినియోగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం...నూతన ఆలోచన,ఆవిష్కరణల కోసం ప్రత్యేకంగా ‘ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ'ని విశాఖపట్నం సన్‌రైజ్‌ స్టార్టప్‌ విలేజ్‌లో ఏర్పాటుచేసింది. కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చేవారితో స్టార్టప్ లను ప్రారంభించంలో కీలక పాత్ర పోషిస్తున్నఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ...ఈ మధ్యకాలంలో అత్యంత పాపులర్ అయిన డ్రోన్ల తయారీ మీదా దృష్టిసారించింది. దీంతో ఢిల్లీ కేంద్రంగా పనిచేసే రోబోటిక్‌ టెక్నాలజీ సంస్థ ‘ఓమ్నీ ప్రెజెంట్‌'తో కలిసి విశాఖపట్నంలో నాలుగు నెలల క్రితం ‘అమరావతి డ్రోన్స్‌' పేరుతో రిసెర్చ్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ లేబొరేటరీని ఏర్పాటుచేసింది.

 తొలి డ్రోన్ వచ్చేసింది...

తొలి డ్రోన్ వచ్చేసింది...

విశాఖపట్నంలో నాలుగంటే నాలుగే నెలల క్రితం ఏర్పడిన ‘అమరావతి డ్రోన్స్‌' కంపెనీ...2018 జనవరి నాటికల్లా తమ తొలి డ్రోన్‌ను తయారుచేసి బైటకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అవసరమైన మౌలిక వసతులు, సిబ్బంది నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. నిపుణులను నియమించుకొని, డ్రోన్లకు అవసరమైన హార్డ్‌వేర్‌(విడి భాగాలు)ను విదేశాల నుంచి రప్పించి, దానికి సాఫ్ట్‌వేర్‌ను జత చేసి తొలి డ్రోన్‌ను విజయవంతంగా తయారుచేసింది. అలా తయారైన...మేడిన్ ఆంధ్రా...తొలి...అమరావతి డ్రోన్ ను...జనవరి 19 తేదీన కలెక్టర్ల సదస్సులో సిఎం చంద్రబాబు ఆవిష్కరించారు.

 మార్కెట్లోకి...ఎప్పుడంటే...

మార్కెట్లోకి...ఎప్పుడంటే...

ఇప్పటి వరకూ అందరిలాగే డ్రోన్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నఆంధ్రప్రదేశ్ ఇక నుంచి సొంతంగా తయారీ మొదలుపెట్టేసింది. అయితే వీటిని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడానికి ఇంకో రెండు నెలల సమయం పడుతుందని ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ సీఈవో ప్రొఫెసర్‌ వల్లీకుమారి చెప్పారు. మార్చి నెలాఖరుకల్లా మార్కెట్‌లోకి 25 డ్రోన్లు తీసుకొస్తామని, అనంతరం ప్రతి నెలా 25 డ్రోన్లు తయారుచేస్తామని వివరించారు. వీటి ఉత్పత్తి కొనసాగిస్తూనే కొత్త రకం డిజైన్‌, ఫీచర్లతో మరో 5 రకాల డ్రోన్లను తీసుకురావాలనే ఆలోచన ఉందని చెప్పారు.

 ఇవీ..అమరావతి డ్రోన్...ప్రత్యేకతలు

ఇవీ..అమరావతి డ్రోన్...ప్రత్యేకతలు

ఇందులో విజువల్‌ సెన్సర్‌తో పని చేసే దీనికి 24 మెగాపిక్సెల్‌ కెమెరా ఉంది...25 రకాల అప్లికేషన్లతో పని చేసే ఈ డ్రోన్‌కు ఆరు రెక్కలు ఉన్నాయి. దీని మోటారు ఏకధాటిగా 40 నిమిషాల పాటు పనిచేస్తుంది. మోటారు ఆగిపోయినా,పనిచెయ్యక పోయినా సురక్షితంగా ల్యాండ్‌ కావడం దీని స్పెషాలిటి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన దీని బరువు నాలుగు కిలోలు ఉంది. మార్కెట్లో ఇలాంటి డ్రోన్‌ ఖరీదు 5 లక్షల 50 వేల రూపాయలు కాగా మన డ్రోన్ రూ3.50 లక్షలకే సిద్ధ కావడం.

 ఎపి ప్రభుత్వం...స్పెషాలిటీ...

ఎపి ప్రభుత్వం...స్పెషాలిటీ...

ఇప్పటివరకూ భారతదేశంలో ఎక్కడా డ్రోన్ల తయారీ యూనిట్లు లేవు...తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే డ్రోన్ల తయారీకి ముందుకు వచ్చింది...పైగా మార్కెట్ లో దొరికే డ్రోన్ల కంటే ఎక్కువ నాణ్యత, తక్కువ ధరకే మేడ్ ఇన్ ఆంధ్రా డ్రోన్ల తయారీ...జరగడం గమనార్హం.

 ప్రభుత్వపరంగా...డ్రోన్ తో ఉపయోగాలు...

ప్రభుత్వపరంగా...డ్రోన్ తో ఉపయోగాలు...

ప్రభుత్వపరంగా ఈ డ్రోన్‌ను అనేక రకాలుగా ఉపయోగించుకునే వీలుంది. ఎర్రచందనం ఆక్రమ రవాణాని అరికట్టడం, సిఆర్డిఏ పోలవరం పనులు, స్మార్ట్ పోలీసింగ్ లోనూ డ్రోన్లను ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇంకా పంచాయతీరాజ్‌ శాఖ విషయానికి వస్తే...గ్రామాల్లో రహదారుల నిర్మాణం, వాటి నాణ్యత, గుంతలు పడిన రహదారులు, చెరువుల తవ్వకం, మట్టి తరలింపు, కాలువల నిర్మాణం, వాటిలో పూడికతీత వంటి అనేక విషయాలను ఈ డ్రోన్‌తో వీడియో తీసి, కార్యాలయంలో కూర్చొనే అక్కడి పరిస్థితిని తెలుసుకోవచ్చు.

 డ్రోన్ల గురించి...సిఎం ఏమన్నారంటే...

డ్రోన్ల గురించి...సిఎం ఏమన్నారంటే...

మేడిన్ ఆంధ్రా తొలి డ్రోన్ ను శుక్రవారం కలెక్టర్ల సదస్సులో ఆవిష్కరించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమన్నారంటే...డ్రోన్ల వినియోగం వల్ల అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని, రాష్ట్రంలో జలవనరుల శాఖ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పర్యాటకం, ఆటవీ శాఖలకు ఈడ్రోన్ల ఉపయోగం చాలా ఉందన్నారు. అంతేకాదు... తిరుపతిలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ డ్రోన్ల ద్వారా ఇంటింటికీ ఆహారం సరఫరా చేసేలా వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారన్నారు. డ్రోన్ల వినియోగం పెరిగితే రేట్లు తగ్గుతాయని సీఎం చెప్పారు. డ్రోన్ల ఉత్పత్తిపై అధికారులు మరింత దృష్టి పెట్టాలన్నారు. అవసరమైతే పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ప్రభుత్వమే డ్రోన్లు సరఫరా చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

English summary
Made-in-Andhra Pradesh drone launched by Chief Minister Chandrababu Naidu on friday. These devices, branded as ‘Amaravati drones,’ have somany specialities..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X