వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైవ్ డిబేట్‌లో విష్ణుపై చెప్పుతో దాడి -అమరావతి జేఏసీ నేతపై ఛానల్ ఆగ్రహం -కులం కోణం -బీజేపీvsటీడీపీ

|
Google Oneindia TeluguNews

అంతులేకుండా సాగుతోన్న ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదంలో మరో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. జగన్ సర్కారు మూడు రాజధానుల ప్రతిపాదన తర్వాత అమరావతిలో దాదాపు పనులు నిలిచిపోవడం, రాజధాని కోసం రైతులు, మహిళలు 434రోజులుగా నిరసనలు చేస్తుండటం, కేంద్రంలో అధికారంలో ఉండి, అమరావతికి జైకొడుతున్నప్పటికీ బీజేపీపై విమర్శల వెల్లువ, స్టాండ్ మార్చుకున్న జగన్.. అప్పు చేసైనా సరే అమరావతిలో 50 శాతం పనులైన భవంతుల్ని పూర్తిచేద్దామని నిర్ణయించడం.. తదితర పరిణామాల నేపథ్యంలో... 'గ్రాఫిక్స్ పూర్తిచేద్దాం' పేరుతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ మంగళవారం లైవ్ డిబేట్ నిర్వహించగా...

చంద్రబాబుకు డబుల్ షాక్ -కుప్పం టీడీపీలో ముసలం? -రాజీనామా బాటలో తమ్ముళ్లు! - ఇంకొద్ది గంటల్లో టూర్చంద్రబాబుకు డబుల్ షాక్ -కుప్పం టీడీపీలో ముసలం? -రాజీనామా బాటలో తమ్ముళ్లు! - ఇంకొద్ది గంటల్లో టూర్

 విష్ణువర్ధన్‌పై చెప్పుతో దాడి..

విష్ణువర్ధన్‌పై చెప్పుతో దాడి..

రాజధాని అమరావతిపై చానెల్ నిర్వహించిన చర్చలో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు, ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు ప్యానలిస్టులుగా పాల్గొన్నారు. అమరావతిలో నిలిచిపోయిన పనులను పూర్తి చేసేందుకు గానూ జగన్ సర్కారు అప్పు చేయబోతున్నట్లు ప్రకటించడం ఆశ్చర్యకరంగా, హాస్యాస్పదంగా ఉందని విష్ణువర్ధన్ మాట్లాడుతుండగా, ఉద్యమాన్ని కించపర్చేలా వ్యాఖ్యానాలు వద్దంటూ జేఏసీ నేత శ్రీనివాసరావు అడ్డుతగిలారు. ఈ క్రమంలో ఇద్దరికీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒక దశలో.. ''టీడీపీ ఆఫీసులో పని చేసుకో.. టీడీపీ జెండా పట్టుకో..''అని శ్రీనివాసరావును విష్ణువర్ధన్ రెడ్డి ఎద్దేవా చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. జేఏసీ నేత శ్రీనివాసరావు.. కాలికున్న చెప్పును తీసి విష్ణువర్ధన్ పై దాడి చేశారు. అంతేకాదు..

జేఏసీ నేత బహిష్కరణ..

జేఏసీ నేత బహిష్కరణ..


అమరావతిపై నిర్వహించిన లైవ్ టీవీ డిబేట్ లో బీజేపీ నేత విష్ణువ్ధన్ రెడ్డిపై చెప్పుతో దాడిచేసి, దుర్భాషలాడిన కారణంగా జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాసరావును బహిష్కరిస్తున్నట్లు చర్చా వేదిక హోస్ట్ ప్రకటించారు. శ్రీనివాసరావు దళితుడే కావొచ్చు.. బాగా చదువుకొని ఉండొచ్చు.. కానీ హుందాగా జరుగుతోన్న చర్చలో విచక్షణ కోల్పోయి, దాడిలో చేయడాన్ని సహించబోమని, వీలైతే వెటకారంతో కూడిన విమర్శలు లేదంటే సమర్థవంతమైన వాదన వినిపించాలేగానీ చర్చల్లో దాడులకు తావు లేదని, జేఏసీ నేత డాక్టర్ శ్రీనివాసరావును చర్చ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తున్నామని చానెల్ హోస్టు ప్రకటించారు. ఆ వెంటనే..

 ఇలాంటోళ్లను టీవీల్లోకి రానీయొద్దు..

ఇలాంటోళ్లను టీవీల్లోకి రానీయొద్దు..

తాను 15 ఏళ్లుగా టీవీ చర్చల్లో పాల్గొంటున్నానని, ఏనాడూ ఇలాంటి అనుభవం ఎదురుకాలేదని, చెప్పుతో దాడి చేసిన శ్రీనివాసరావు ఎవరో కూడా తెలీదని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి వాపోయారు. ఇలాంటి చర్యల వల్ల బీజేపీ విలువ ఏమాత్రం తగ్గబోదని, శ్రీనివాసరావు వెనకున్న ప్రేరక శక్తులు ఎవరో తెలియాల్సి ఉందని ఆయన అన్నారు. ఇదే అంశంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా స్పందించారు. విష్ణుపై చెప్పుతో దాడిని ఖండిస్తున్నామని, స్వీయనింత్రణ లేని వ్యక్తులను టీవీ చర్చలకు పిలవొద్దని, దాడి చేసిన శ్రీనివాసరావుపై చానెల వారే పోలీసు కేసు పెట్టాలని సోము అన్నారు. అయితే..

దళిత నేత అయినందుకే..

దళిత నేత అయినందుకే..

టీవీ చానెల్ లైవ్ డిబేట్ లో బీజేపీ నేతల విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పుతో దాడి చేసిన జేఏసీ నేత శ్రీనివాసరావు దళిత వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఈ వ్యవహారంలో కులం కోణంపైనా చర్చ జరుగుతోంది. దళిత నాయకుడు కావడం వల్లే శ్రీనివాసరావుపై బహిష్కరణ దాకా వెళ్లారని, అదే శ్రీనివాసరావును టీడీపీ కూలీగా అభివర్ణించిన విష్ణువర్ధన్ రెడ్డిని మాత్రం చానెల్ వారు వెనకేసుకురావడంపై సోషల్ మీడియాలో ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. 'అమరావతి పౌరుషం..' అంటూ తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియా వేదికగా ఈ దాడిని సమర్థిస్తున్నారు. కాగా, సోషల్ మీడియాలో చర్చను కూడా తాము ఖండిస్తున్నట్లు హోస్టు ప్రకటించడం గమనార్హం. ఈలోపే..

పేరు చివర కులం తోకలు..

పేరు చివర కులం తోకలు..

కాగా, టీవీ డిబేట్ వ్యవహారంపై టీడీపీ మహిళా నేత, ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు అనిత తీవ్ర స్థాయిలో స్పందించారు. ''పేరు చివర రెండక్షరాల తోక చూసుకుని కుల మదంతో నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటే పడటానికి ఎవరూ సిద్ధంగా లేరు. దళితుల మీద దాడి చేస్తే చెప్పు తెగుద్ది అనడానికి ఇదే నిదర్శనం. సీఎం గారి నెల జీతంతో బతికే పెయిడ్ ఆర్టిస్తు మీరు, దళిత ఉద్యమ నేతను నోటికి వచ్చినట్లు మాట్లాడతారా..'' అంటూ విష్ణువర్ధన్ రెడ్డి తీరును అనిత తప్పుపట్టారు.

విష్ణుపై దాడికి వైసీపీ ఖండన..

విష్ణుపై దాడికి వైసీపీ ఖండన..

టీవీ చర్చలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ జేఏసీ నేత శ్రీనివాసరావు దాడి చేయడాన్ని ఏపీ అధికార పార్టీ వైసీపీ తీవ్రంగా ఖండించింది. అయితే, ఈ ఘటనలో కుట్ర కోణం కూడా ఉండొచ్చని అభిప్రాయపడింది. వైసీపీ అధికార ప్రతినిధి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఈ మేరకు మంగళవారం రాత్రి ఓ ట్వీట్ చేశారు. ''లైవ్ లో మిత్రుడు విష్ణువర్ధన్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. దీనిలో ABN కుట్ర కూడా ఉందనే అనుమానం కలగదంటారా?'' అని అంబటి పేర్కొన్నారు. కాగా, విష్ణుపై దాడి టీడీపీ ప్రాయోజిత చర్య అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. దాడికి పాల్పడిన జేఏసీ నేత శ్రీనివాస్ రావుకు టీడీపీ సంబంధం ఉందని తెలిసిందేనని, ఒకవేళ సంబంధం లేదని టీడీపీ ప్రకటిస్తే గనుక దాడి ఘటనను చంద్రబాబు కూడా ఖండించాల్సిందే అని నరసింహారావు డిమాండ్ చేశారు.

జగన్ ఆదాయం రోజుకు 300 కోట్లు -ప్రధానికీ డబ్బు కావాలి -మనుషులకే పుట్టామా? -కాల్చిపారేయాలి: జేసీజగన్ ఆదాయం రోజుకు 300 కోట్లు -ప్రధానికీ డబ్బు కావాలి -మనుషులకే పుట్టామా? -కాల్చిపారేయాలి: జేసీ

English summary
amid ap capital row, amaravathi jac leader srinivasa rao attacks bjp leader vishnuvardhan reddy with footware in a live tv debate on tuesday. this incident sparks political strom between tdp and bjp after. while the tv channel boycott the jac leader, who got support from tdp dlit leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X