• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెరమీదకు అమరావతి భూ కుంభకోణం .. లోకేష్ తో పాటు ఆ టీడీపీ నేతల మెడకు ఉచ్చు బిగుస్తుందా ?

|

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి భూముల కుంభకోణం మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అమరావతి భూములలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని మొదటి నుంచి ఆరోపిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఏపీ సిఐడికి భూముల అక్రమాలపై విచారణ బాధ్యతను అప్పగించింది. అప్పటినుండి అమరావతి భూముల అక్రమాల తీగ లాగుతున్న సీఐడీ అధికారులు తాజాగా ఈ వ్యవహారంలో టిడిపి అధినేత, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, అలాగే నాడు మంత్రిగా వ్యవహరించిన నారాయణకు నోటీసులు ఇవ్వడం ఏపీలో దుమారంగా మారింది. దీంతో చంద్రబాబు తో పాటుగా లోకేష్ మరికొంతమంది పేర్లు ప్రధానంగా వినిపించిన నేపథ్యంలో వారి మెడకు కూడా రాజధాని భూముల అక్రమాలపై ఉచ్చు బిగుస్తుందా అన్న చర్చ సాగుతుంది.

 రాజధాని భూముల అక్రమాలలో నాడు టీడీపీ మంత్రులు , నేతల పేర్లు

రాజధాని భూముల అక్రమాలలో నాడు టీడీపీ మంత్రులు , నేతల పేర్లు


అమరావతి భూముల వ్యవహారంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం విచారణ జరిపి అమరావతి భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లుగా తేల్చిన విషయం తెలిసిందే. అమరావతి భూముల అక్రమాలతో సంబంధమున్న నేతల జాబితాను కూడా నాడు మంత్రివర్గ ఉప సంఘం సమర్పించింది. మంత్రివర్గ ఉప సంఘం నివేదిక మేరకే సిఐడి కేసులు నమోదు చేసింది . ముఖ్యంగా చంద్రబాబు, నారాయణలతో పాటుగా లోకేష్ ,పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, పత్తిపాటి పుల్లారావు, పయ్యావుల కేశవ్, లింగమనేని రమేష్ , ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి, వేమూరు రవికుమార్ ప్రసాద్, కంభంపాటి రామ్మోహన్, లంకా దినకర్ తదితరుల పేర్లను అక్రమాలకు పాల్పడిన జాబితాలో చేర్చింది మంత్రివర్గ ఉప సంఘం.

TDP defeat in Vijayawada Corporation Elections: ఆసక్తికర చర్చ .. సొంత పార్టీ నేతలే కొంప ముంచారా !!TDP defeat in Vijayawada Corporation Elections: ఆసక్తికర చర్చ .. సొంత పార్టీ నేతలే కొంప ముంచారా !!

రంగంలోకి దిగిన సిఐడీ అధికారులు ..పలువురిపై కేసుల నమోదు

రంగంలోకి దిగిన సిఐడీ అధికారులు ..పలువురిపై కేసుల నమోదు

రాజధాని ప్రాంతంలో అక్రమాలకు పాల్పడి, టిడిపి నేతలకు వారి బినామీలకు లబ్ధి చేకూర్చిన్నట్లు ప్రధానంగా వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేశారు.

రాజధాని అమరావతి భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, అమరావతి భూముల అక్రమాలపై విచారణ జరపడం కోసం మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికతో ఏపీ ప్రభుత్వం ఏపీ సి ఐ డి విభాగాన్ని రంగంలోకి దించింది. ఈ వ్యవహారంలో ప్రాథమిక విచారణ జరిపిన ఏపీ సి ఐ డి విభాగం అక్కడ భూములు కొనుగోలు చేసిన కొందరిపై కేసులు నమోదు చేసింది.

 సిఐడీ కేసులకు కోర్టులో సవాల్ .. ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను కొట్టేసిన కోర్టు

సిఐడీ కేసులకు కోర్టులో సవాల్ .. ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను కొట్టేసిన కోర్టు

అప్పటి టిడిపి ప్రభుత్వంలోని కొందరు పెద్దలతో ఉన్న పరిచయాల వల్ల రాజధాని ఏ ప్రాంతం లో వస్తుందో ముందుగా తెలుసుకొని ఆ ప్రాంతంలో రాజధాని అధికారిక ప్రకటన రాకముందే అక్కడ భూములు కొన్నారని కొందరు టిడిపికి సన్నిహితంగా ఉన్న వారిపై అభియోగాలు నమోదు చేశారు. దీంతో తమపై నమోదైన ఎఫ్ఐఆర్ లను రద్దు చేయాలంటూ కోర్టుకు వెళ్లడం ఆ తర్వాత కోర్టు సిఐడి అధికారులు చెబుతున్న ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని, అది ఏపీ సి ఐ డి నమోదుచేసిన సెక్షన్ల కిందకు రాదని కోర్టు కొట్టేసింది.

లోకేష్ తో పాటు ఆ నేతల మెడకు ఉచ్చు బిగుస్తుందా ?

లోకేష్ తో పాటు ఆ నేతల మెడకు ఉచ్చు బిగుస్తుందా ?

అయినప్పటికీ మరోమారు సర్కార్ రాజధాని భూముల అక్రమాలను విడిచిపెట్టేది లేదని తేల్చింది . మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి నుండి టీడీపీ ఇంకా కోలుకోకముందే మరోసారి రాజధాని భూముల అక్రమాల వ్యవహారాన్ని తెర మీదకు తీసుకు వచ్చింది. చంద్రబాబు నాయుడు, నారాయణకు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో ఇప్పుడు రాజధానిలో భూ అక్రమాలపై ఆరోపణలు ఎదుర్కొన్న లోకేష్, పత్తిపాటి పుల్లారావు, పరిటాల శ్రీరామ్, పయ్యావుల కేశవ్ తదితరులకు కూడా ఏపీ సిఐడి ఉచ్చు బిగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.


English summary
The YCP government, which has been alleging insider trading in Amaravati lands from the outset, has handed over the responsibility of investigating land irregularities to the AP CID. CID officials, who have been pulling the strings of illegal land acquisition in Amaravati ever since, have recently issued notices to TDP chief and then chief minister Chandrababu Naidu, as well as Narayana, who is now a minister. With this, along with Chandrababu, Lokesh and a few other names are mainly heard in the background and the debate continues as to whether they will also be trapped in the capital land irregularities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X