గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి శంకుస్థాపన పూర్తి: ఇక మిగిలింది రాజధాని నిర్మాణమే, ఖర్చు ఎంత?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని వీక్షించేందుకు అక్టోబర్ 22 ఎప్పుడొస్తుందా గత కొన్ని రోజులుగా తెలుగు ప్రజలు ఎదురుచూశారు. ఆరోజు రానే వచ్చింది. చరిత్రలో కనివినీ ఎరుగుని రీతిలో తెలుగు ప్రజల కీర్తి పతాకంలో కలికితురాయిగా నిలిచిపోయేలా రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవం జరిగింది.

ప్రజారాజధానిగా తెలుగు ప్రజలు పిలుచుకుంటున్న అమరావతి శంకుస్థాపన కార్యక్రమం భారతదేశ ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదగా పండితులు నిర్ణయించిన మహూర్తం ప్రకారం మధ్యాహ్నం 12.35 - 12.43 గంటల మధ్య వేద మంత్రోచ్ఛరణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు.

Photos: అమరావతి శంకుస్థాపన

అమరావతి శంకుస్థాపన మహోత్సవం గురువారం పూరైంది కాబట్టి ఇక రాజధాని నిర్మాణమే తరువాయి. రాజధాని అమరావతి నిర్మాణాన్ని దశల వారీ పూర్తి చేయాలని, అదే విధంగా నిధులను సమకూర్చుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలనూ వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది.

Amaravati rises as Modi lays foundation stone for capital

అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో అమరావతి అభివృద్ధి జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు. అమరావతి నిర్మాణంలో భాగమైనందుకు సంతోషంగా ఉందని మంత్రి ఈశ్వరన్ తెలిపారు. అమరావతి నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వాన్ని ప్రధాని స్వాగతించారన్నారు.

రాజధాని మాస్టర్ ప్లాన్‌ను తక్కువ సమయంలోనే పూర్తి చేశామన్నారు. కాగా, సింగపూర్ ప్రణాళికలు అమలుచేసేందుకు సిద్ధమై, డెవలపర్ పాత్ర తమకు అప్పగిస్తే 70 వేల కోట్ల రూపాయిల వరకూ పెట్టుబడి పెట్టేందుకు సింగపూర్ ప్రభుత్వం సిద్ధమైంది. పదేళ్ల వ్యవధిలో వారు 70వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధానికి సుమారు 20 వేల కోట్ల రూపాయిల వరకూ అందజేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం కనీసం మరో 10వేల కోట్లను తమ ఖజానా నుండి ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే రానున్న పదేళ్లలో లక్ష కోట్ల రూపాయిలు వెచ్చిస్తే రాజధానికి ఒక ముఖచిత్రం వస్తుందని అంటున్నారు.

Amaravati rises as Modi lays foundation stone for capital

అమరావతి రాజధానిని సింగపూర్ ప్రభుత్వం కేవలం అమరావతికే (సీడ్ క్యాపిటల్ సిటీ) పరిమితం కాకుండా సిఆర్‌డిఎను విస్తరించాలనే దృష్టితో చూస్తోంది. దశల వారీ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి మూడు ప్రణాళికలను అందజేసిన సింగపూర్ ప్రభుత్వం తాజాగా నిర్మాణ దశలోనూ భాగస్వామ్యం కావడమేగాక, రాజధాని నిర్మాణ బృహత్ ప్రణాళికను ప్రభుత్వానికి అందజేసింది.

సింగపూర్ ప్రభుత్వం క్యాపిటల్ రీజియన్ ప్లాన్ అండ్ రిపోర్టును, సిటీ మాస్టర్ ప్లాన్ అండ్ రిపోర్టు, సీడ్ డెవలప్‌మెంట్ మాస్టర్ ప్లాన్ అండ్ రిపోర్టులను గతంలో అందజేసింది. ఇందులో కొత్త నిర్మాణాలు, ప్రణాళికలు, వ్యయం, అవకాశాలు, సవాళ్లు గురించి వివరించింది.

ఇక రెండో దశలో నిర్మాణాలు చేపట్టాలనుకుంటే అవి ఏ స్థాయిలో ఉండాలి, ఏ అవసరాల కోసం ఏ నిర్మాణాలు చేపట్టాలి? అవి ఏ మేరకు ఉండాలి? సీడ్ క్యాపిటల్ సిటీలో ఏ ప్రదేశంలో ఏ నిర్మాణం ఉండాలి అందుకు ఎంత వ్యయం అవుతుందో వివరిస్తూ సమగ్ర నిర్మాణ బృహత్ ప్రణాళికలో పేర్కొంది.

Amaravati rises as Modi lays foundation stone for capital

రాజధాని అమరావతి నిర్మాణాలను ఐదు దశల్లో చేపట్టనున్నారు. మొత్తం ప్రాజెక్టులో ప్రతి 18 శాతం పనులను ఐదేళ్ల చొప్పున పాతికేళ్లలో పూర్తి చేస్తారు. ఇందుకు ఐదు దశలుగా ప్రణాళికలను సింగపూర్ ప్రభుత్వం రూపొందించింది. ఒక్కో ప్రణాళికకు ఒక్కో దళగా తీసుకుని ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తారు.

ప్రతి దశను పూర్తి చేయడానికి ఐదేళ్ల వ్యవధి పడుతుందని సింగపూర్ ప్రభుత్వం అంచనా వేసింది. తొలి విడత నిర్మాణ ప్రణాళికలో ఏ ఏ భవనాలు ఎక్కడ నిర్మించాలి, ఏ స్థాయిలో నిర్మాణం ఉండాలి? రహదార్లు, రవాణా, విద్యుత్ సౌకర్యాలు, ఇతర సామాజిక వౌలిక సదుపాయాలు ఎలా ఉండాలనేది సిద్ధం చేస్తారు.

రాజ్‌భవన్, శాసనసభ, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, అధికారులకు కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థల భవనాలు, అధికారుల నివాసాలు ఎలా ఉండాలో, ఒకొక్కటీ ఎన్ని అంతస్తులు నిర్మించాలో కూడా నివేదికలు సిద్ధం చేస్తున్నారు.

Amaravati rises as Modi lays foundation stone for capital

కాగా మరో పక్క ఉద్యోగులకు 2500 గృహాలను రాజధాని అమరావతిలోనే నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం 1100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఒక పక్క ఉద్యోగుల నివాస గృహాలకు అందుబాటులోనే స్కూళ్లు, ఆస్పత్రులు, పార్కులు, షాపింగ్ మాల్స్, రవాణా సదుపాయాన్ని ఉండేలా సిద్ధం చేస్తున్నారు.

మంత్రులకు ఒకొక్కరికీ 5వేల చదరపు అడుగులు, సివిల్ సర్వీసు అధికారులకు ఒకొక్కరికీ 3000 చదరపు అడుగులు, గెజిటెడ్ అధికారులకు 1800 చదరపు అడుగులు, ఇతర ఉద్యోగులకు 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో నివాస గృహాలను నిర్మించనున్నారు.

English summary
Amid fertile agricultural lands and in the presence of a galaxy of dignitaries, including Ministers from foreign countries, Prime Minister Narendra Modi is set to lay the foundation for Amaravati, the futuristic capital of Andhra Pradesh, at a grand ceremony on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X