వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొడాలి నాని బాతుబచ్చా అన్నట్లేగా - జగన్ భార్యను వంశీ ఏమన్నాడో గుర్తులేదా?: దివ్వవాణి ఫైర్

|
Google Oneindia TeluguNews

ఏపీలో మూడు రాజధానుల అంశంపై రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరాయి. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని తప్పుపడుతూ.. అమరావతికి శాసన రాజధాని హోదా కూడా వద్దని మంత్రి కొడాలి నాని అనడం దుమారంరేపింది. అమరావతి, చంద్రబాబులపై మంత్రి వ్యాఖ్యలను గర్హిస్తూ రైతులు, టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అయినాసరే విమర్శలు చేయడం ఆపబోనని ఆయన స్పష్టం చేశారు. ఈక్రమంలోనే టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి.. మంత్రి నానిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

వ్యాక్సిన్ గుడ్‌న్యూస్: ఈ ఏడాదిలోనే - ఆస్ట్రాజెనెకా అనూహ్య ప్రకటన - ట్రయల్స్ నిలిపేతపై సీఈవో వివరణవ్యాక్సిన్ గుడ్‌న్యూస్: ఈ ఏడాదిలోనే - ఆస్ట్రాజెనెకా అనూహ్య ప్రకటన - ట్రయల్స్ నిలిపేతపై సీఈవో వివరణ

ప్రెసిడెంట్ మందు తాగి, వాగితే..

ప్రెసిడెంట్ మందు తాగి, వాగితే..

అమరావతికి చెందిన మహిళా రైతులు మంత్రి నాని ఫొటోలకు శవయాత్ర చేసిన తర్వాత ఆయనలో డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందని దివ్యవాణి అన్నారు. జగన్ సర్కారు మద్యం దుకాణాల్లో విక్రయిస్తోన్న ‘ప్రెసిడెంట్ మెడల్' మందు తాగి నాని నోటికి ఏదొస్తే అది మాట్లాడితే మహిళలు చీపుళ్లతో కొట్టరా? అని ప్రశ్నించారు. అర్ధరాత్రి రోడ్లపై తిరిగే ఆడవాళ్లే తన ఫొటోలు దహనం చేశారని మంత్రి వ్యాఖ్యానించడం మహిళల పట్ల ఆయనుకున్న చిన్నచూపును తెలియజేసేలా ఉందని దివ్యవాణి అన్నారు.

చైనాకు చెక్: భారత్‌-జపాన్ మధ్య కీలక సైనిక ఒప్పందం - ‘ఇండో-పసిఫిక్'లో డ్రాగన్ ఆటకట్టించేలా..చైనాకు చెక్: భారత్‌-జపాన్ మధ్య కీలక సైనిక ఒప్పందం - ‘ఇండో-పసిఫిక్'లో డ్రాగన్ ఆటకట్టించేలా..

ఆ 5వేల ఇల్లుల్ని పంచొచ్చుగా..

ఆ 5వేల ఇల్లుల్ని పంచొచ్చుగా..

అమరావతి విషయంలో జగన్ సర్కారు సొమ్మొకడది, సోకు ఒకడిది అన్నట్లుగా వ్యవహరిస్తున్నదని, రాజధానికి రైతులు ఇచ్చిన భూములను పేదలకు ఎలా పంచుతారని దివ్యవాణి ప్రశ్నించారు. మొత్తంగా రాజధాని రైతులకు, పేదలకు మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలనే ఉద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెబుతున్నదని, నిజంగా పేదలకు మేలు చేయాలన్న ఉద్దేశమే వైసీపీకి ఉంటే.. గతంలో చంద్రబాబు కట్టించిన 5 వేల ఇళ్లను పేదలకు కేటాయించడానికి ఇబ్బందేంటని మంత్రిని ఆమె నిలదీశారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడుతున్న నాని లాంటి వైసీపీ నేతలకు ప్రజలే బుద్ది చెబుతారని మండిపడ్డారు.

పందులు, కుక్కల్లానే కనిపిస్తారు..

పందులు, కుక్కల్లానే కనిపిస్తారు..

‘‘ప్రతి విషయాన్ని న్యాయంగా, ధర్మంగా మాట్లాడేవాళ్లను చూస్తే మంత్రి నానికి పందులు, కుక్కల్లాగానే కనిపిస్తుస్తున్నట్లుగా ఉంది. మరి, గతంలో విడదల రజిని, రోజా లాంటివాళ్లు వైఎస్సార్ ను, వైఎస్ జగన్ ను ఏ రేంజ్ లో తిట్టిపోశారో నానికి తెలీదా? ప్రస్తుత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ గతంలో జగన్ భార్య వైఎస్ భారతిని జైలుకు పంపుతానని సవాలు చేయడం మర్చిపోయారా? అర్ధరాత్రి రోడ్ల మీద తిరిగేవాళ్లు అని మహిళల్ని తిట్టే ముందు.. జగన్ కోసం విజయమ్మ, షర్మిల సైతం రోడ్లమీదకు వచ్చిన విషయాన్ని.. వాళ్ల గురించి టీడీపీ ఏనాడూ అసహ్యంగా మాట్లాడలేదన్న సంగతిని కొడాలి నాని గుర్తుచేసుకోవాలి'' అని దివ్యవాణి అన్నారు.

చంద్రబాబు ముందు బాతుబచ్చా..

చంద్రబాబు ముందు బాతుబచ్చా..

అమరావతి ఇష్యూలో టీడీపీ అధినేతను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసిన మంత్రి నాని.. తాను నిక్కర్లు వేసుకునే వయసు నుంచీ చంద్రబాబును చూస్తున్నానని, మొదటి నుంచీ ఆయది మోసకారి బుద్ధేనని వ్యాఖ్యానించారు. దీనిపై దివ్యవాణి స్పందిస్తూ.. ‘‘నిక్కర్లు వేసే వయస్సు నుంచే చంద్రబాబుని చూశానని చెబుతోన్న నాని.. తనకు తానే చంద్రబాబు ముందు బాతుబచ్చా అని ఒప్పుకుంటున్నట్లే కదా'' అని సెటైర్లు వేశారు. మరోవైపు, కొడాలి నాని అప్రజాస్వామిక భాష వాడుతున్నారని ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు.. ఒకవేళ పోలీసులు చర్యలు తీసుకోకుంటే, గవర్నర్ ను కలవాలని, ఆపై కోర్టుకు కూడా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మొత్తంగా అమరావతిని శాసన రాజధానిగా కూడా ఉంచొదన్న వ్యాఖ్యల తర్వాత కొడాలిపై టీడీపీ ముప్పేటదాడి జరుపుతున్నది. అయినాసరే, తానూ వెనక్కి తగ్గబోనని నాని స్పష్టం చేశారు.

English summary
war of words between tdp leaders and ap minister reaches to peak. amid minister comments on amaravathi capital and criticism over chandrababu, tdp leader divyavani hits back at kodali. However, Minister Kodali Nani says he will continue criticism on tdp
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X