విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భక్తులారా! విశాఖలో వినాయకుడే వచ్చి ట్రాఫిక్స్ రూల్స్‌పై అవగాహన కల్పించారు!

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: నగరంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చేయడంలో కోసం ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. వినాయక చవితి వేడుకలు జరుగుతున్న సందర్భంలో ఆ దేవుడి వేషాధారణలోనే వాహనదారులకు జాగ్రత్తలు తెలియజేశారు.

నగరంలోని ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు నిబంధనలు, హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు. సిగ్నల్ వద్ద వాహనదారులందరూ ఆగిపోగా.. అక్కడికి వినాయకుడి వేషంలో ఓ వ్యక్తి బైక్‌పై వస్తాడు.

ఆ తర్వాత ఆయనకు ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధరింపజేస్తారు. అనంతరం వినాయకుడి రూపంలో ఉన్న వ్యక్తి.. ప్రజలారా.. భక్తులారా.. అంటూ ట్రాఫిక్ నిబంధనల గురించి, హెల్మెట్ పెట్టుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ఈ కొత్త ప్రయత్నాన్ని పలువురు నెటిజన్లు అభినందించారు.

Amazing initiative by AP Traffic Police in Vizag

English summary
Amazing initiative on Traffic rules by Andhra Pradesh Traffic Police in Vizag.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X