వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ రెడ్డి కోట్లు వెనకేశాడు, సిక్స్ అని డకౌట్: అంబటి

|
Google Oneindia TeluguNews

Ambati and Balineni fires at Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చివరి బంతి వరకు సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తామని చెప్పి, చివరి క్షణం వరకు లక్షల సంతకాలు పెట్టి కోట్ల రూపాయలు దండుకున్నారని కిరణ్ కుమార్ రెడ్డిపై ధ్వజమెత్తారు.

అంతా అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం ద్వారా సమైక్య సింహం ముసుగు తొలగిందని అంబటి అన్నారు. రాష్ట్ర విభజనకు ముఖ్య కారణకుడు కిరణ్ కుమార్ రెడ్డేనని ఆయన ఆరోపించారు. వ్యక్తిగత స్వార్థం కోసం తెలుగు ప్రజలను మోసం చేశాడని కిరణ్ కుమార్ రెడ్డిపై మండిపడ్డారు.

ఇక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు నీతి, నిజాయితీలనేవే లేవని ఆరోపించారు. అవే ఉంటే రాజకీయాలకు స్వస్తి పలకాలని చంద్రబాబు నాయకుడు అంబటి సూచించారు. లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం కోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డిలు ఒకరికొకరు సహకరించుకున్నారని విమర్శించారు.

సిక్స్ కొడతానని డకౌటయ్యారు: సిఎంపై బాలినేని

రాష్ట్ర విభజనను అడ్డుకుంటానని చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి తెలుగు ప్రజలను మోసం చేశాడని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిఎల్పీ ఉపనేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చివరి బంతికి సిక్స్ కొడతానని చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి డకౌట్ అయ్యారని విమర్శించారు.

రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తవుతున్న సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం వల్ల ఓరిగేదేమి లేదని బాలినేని శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విభజనపై నిర్ణయం తీసుకున్నప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసివుంటే విభజన జరిగివుండేది కాదని చెప్పారు. ఇప్పుడు రాజీనామా పేరుతో కిరణ్ కుమార్ రెడ్డి నాటకాలాడుతున్నారని ఆరోపించారు.

English summary
YSR Congress senior leaders Ambati Rambabu and Balineni Srinivas Reddy on Wednesday fired at former CM Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X