వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ మీద కేసులున్నప్పుడే ప్రజలు గెలిపించారు: బాబు..పవన్ కలిసే నడుస్తున్నారు: అంబటి ఫైర్..!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ కోర్టు గైర్హాజరు కోరుతూ దాఖలు చేసిన పిటీషన్ ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. దీని పైన టీడీపీ నేతల వ్యాఖ్యలను వైసీపీ నేత అంబటి రాంబాబు తిప్పి కొట్టారు. పిటీషన్ కోర్టు తిరస్కరిస్తే జగన్ రాజీనామా చేయాలని టీడీపీ నేతలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారని..ఇది అర్దరహితమన్నారు. జగన్ పైన కేసులు ఉన్న సమయంలోనే..కోర్టుకు హాజరవుతున్న సమయంలోనే ఎన్నికలకు వెళ్లారని..ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారని రాంబాబు చెప్పుకొచ్చారు.

ఇక, చంద్రబాబు..పవన్ విడిపోయినట్లుగా ఉంటూనే కలిసి పని చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు చెప్పిందే పవన్ చేస్తారని ఆరోపించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో పైన రాద్దాంతం చేస్తున్నారని..దాని కారణంగా ఎటువంటి నష్టం లేదని వివరించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం టీడీపీ ప్రభుత్వం అయిదేళ్ల పాటు నిర్వహించలేదని ..జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ ఏడాది నుండి తిరిగి ప్రారంభించారని..దీనిని కూడా విమర్శిస్తున్నారంటూ అంబటి రాంబాబు తప్పు బట్టారు.

Ambati Rambabau says CBN and pawan Kalyan politically moving in single ajjenda

కేసులున్నప్పుడే జగన్ సీఎం అయ్యారు..
జగన్ పిటీషన్ ను సీబీఐ కోర్టు తిరస్కరించటం..టీడీపీ నేతల వ్యాఖ్యల మీద వైసీపీ నేత అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. జగన్ గతంలోనూ ఇదే రకంగా కోర్టుకు గైర్జాజరు పిటీషన్ పాదయాత్ర సమయంలో దాఖలు చేయగా..అప్పుడు కూడా కోర్టు తిరస్కరించిందని గుర్తు చేసారు. ఇప్పుడు సీబీఐ కోర్టు తిరస్కరించినా..ఉన్నత న్యాయ స్థానంలో అప్పీల్ చేస్తున్నామని వివరించారు. జగన్ రాజీనామా చేయాలంటూ టీడీపీ నేతలు చేస్తున్న డిమాండ్లు అర్దరహితమన్నారు.

జగన్ పైన కేసులు ఉన్న సమయంలోనే పాదయాత్ర చేసారని..ఎన్నికలకు వెళ్లారని..ప్రజలు ఆశీర్వదించి గెలిపించారని చెప్పుకొచ్చారు. సీబీఐ వాదనలు సైతం అర్ద రహితంగా ఉన్నాయన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారని..కోర్టుకు రాకపోతే సాక్ష్యులను ప్రభావితం చేస్తారని వారి వాదనగా ఉందని..కోర్టుకు రాకపోతే ప్రభావితం చేయలేరా అని ప్రశ్నించారు. అయినా..కోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవిస్తామని అంబటి రాంబాబు స్పష్టం చేసారు.

విడిపోయినట్లుగా ఉంటారు..కలిసే నడుస్తారు
టీడీపీ అధినేత చంద్రబాబు..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడిపోయినట్లుగా ఉన్నా..కలిసే నడుస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు పుత్రరత్నం దీక్ష చేస్తే..రాజకీయ దత్తపుత్రుడు లాంగ్ మార్చ్ చేస్తున్నారని ఎద్దేవా చేసారు. వరదలు తగ్గిన వెంటనే ఇసుక ఇబ్బందులు పూర్తిగా తొలిగిపోతాయన్నారు. చంద్రబాబు మాట్లాడిందే..పవన్ రిపీట్ చేస్తారని.. వారిద్దరూ ఎప్పుడూ విడిపోలేదని..అలా విడిపోయినట్లుగా నటిస్తారని విమర్శించారు.

ఇక, మీడియా స్వేచ్ఛకు భంగం వాటిల్లే విధంగా ప్రభుత్వం వ్యవహరించలేదని..తప్పుడు వార్తలు రాసే వారు మాత్రమే ఆందోళన చెందాల్సి ఉంటుందన్నారు. ఏపీ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను అయిదేళ్ల పాటు నిర్వహించని చంద్రబాబు..ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తుంటే అర్దం లేని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

English summary
YCP leader Ambati Rambabau says CBN and pawan Kalyan politically moving in single way against jagan. Jagan go for appeal in higher court for his court attnedence excemption. Sand problem will be lear in next few days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X