వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ఆర్‌పై పొగడ్తలు.. జగన్‌‌‌పై విమర్శలా.. అంసతృప్తులపై అంబటి రాంబాబు ఫైర్

|
Google Oneindia TeluguNews

పార్టీలో ఉంటూ.. అధినేత జగన్‌పై విమర్శలు చేసే నేతలపై ధ్వజమెత్తారు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. కొందరు తెలివిగా వ్యవహరిస్తున్నారని.. వైఎస్ఆర్‌ను పొగుడుతూ.. జగన్‌పై కామెంట్లు చేయడం ఏంటీ అని ప్రశ్నించారు. తండ్రి రాజకీయ వారసత్వం పుణికి పుచ్చుకున్న జగన్‌ను కొనియాడాల్సింది పోయి.. విమర్శించడం సరికాదని సూచించారు. సొంత పార్టీలో ఇది కొత్త తరహా రాజకీయాలకు దారితీశారని మండిపడ్డారు. బుధవారం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో అంబటి రాంబాబు మాట్లాడారు.

వైసీపీలో కాదు..

వైసీపీలో కాదు..

తమ పార్టీలో కాక టీడీపీలో.. చంద్రబాబుపై మాట్లాడితే కరెక్టుగా సరిపోతుందన్నారు. కుమారుడిని గెలిపించుకోనందుకు చంద్రబాబు సిగ్గుపడాలన్నారు అంబటి రాంబాబు. చంద్రబాబు పేరు ప్రస్తావిస్తే ఒక్క పథకం గుర్తుకురాదన్నారు. ప్రతీ పార్టీలో వెన్నుపోటుదారులు ఉంటారని అంబటి గుర్తుచేశారు. తమ పార్టీలో కొందరు ఉన్నారని.. వారు జగన్‌ను తిడుతూ.. వైఎస్ఆర్‌ను ప్రశంసిస్తున్నారని తెలిపారు.

తాత్కాలిక ఆనందమే..

తాత్కాలిక ఆనందమే..

తమ పార్టీ గుర్తుపై గెలిచిన కొందరు ఇవాళ అధినేత జగన్‌ను విమర్శిస్తున్నారని రఘురామకృష్ణం రాజు గురించి పరోక్షంగా ప్రస్తావించారు. అలా విమర్శించి తాత్కాలికంగా ఆనందం పొందొచ్చు కానీ ఎప్పటికీ కాదన్నారు. దానిని కొందరు సపోర్ట్ చేసి చిన్న దాన్ని పెద్దగా చేస్తున్నాయని అంబటి తెలిపారు. చేప నీటిలో ఉన్నంత సేపే బాగుంటుందుందని.. బయటకొస్తే గిల గిలలాడి చనిపోతుందని చెప్పారు. ఓ రాజకీయ పార్టీ నుంచి గెలిచి.. మరో పార్టీకి మద్దతు తెలపడం కూడా అలాంటిదేనని చెప్పారు.

విమర్శించడం కోసం

విమర్శించడం కోసం

మరికొందరు వైఎస్ఆర్ మిత్రులమని చెబుుతున్నారని అంబటి గుర్తుచేశారు. వైఎస్ఆర్‌తో ఉన్నది తామేనని చెప్పారు. కానీ జగన్‌ను విమర్శించేందుకు వైఎస్ఆర్‌ మిత్రుడని చెప్పుకుంటున్నారని తెలిపారు. ఒకరిని విమర్శించేందుకు మిత్రుత్వాన్ని ఆపాదించేవారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. బుధవారం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా రైతు దినోత్సవంగా జరుపుకోవాలని అంబటి రాంబాబు ప్రజలను కోరారు.

English summary
ambati rambabu criticize some ysrcp rebel leaders for allegations
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X