వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త పార్టీకి సిఎం కలెక్షన్లు: అంబటి, లగడపాటిపై ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టుబడి కోసం ముఖ్యమంత్రి హోదాలో వందల కొద్ది ఫైళ్లపై సంతకాలు పెడుతున్నారని, కమిషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

సమైక్యవాదం పేరుతో కొత్త పార్టీ పెట్టి తర్వాత కాంగ్రెస్‌లో కలపాలన్నదే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహమని అన్నారు. సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌వి నకిలీ సమైక్య ఉద్యమాలని అంబటి రాంబాబు ఆరోపించారు.

లగడపాటికి ఒక న్యాయం.. సామాన్యుడికొక న్యాయం అనే విధంగా ప్రభుత్వ వైఖరి ఉందని ఆరోపించారు. లగడపాటికి చెందిన ల్యాంకో గ్రూపు రూ. 40వేల కోట్ల అప్పుల్లో ఉందని, ల్యాంకోకు నెలకు రూ. 570 కోట్ల నష్టాలు వస్తున్నాయని తెలిపారు. ల్యాంకో ఇన్‌ఫ్రాకు రూ. 8వేల కోట్ల రుణాలను బ్యాంకులు రీషెడ్యూలు చేశాయని, తిరిగి రూ. 3,500 కోట్ల రుణాలు కొత్త ఇచ్చాయని వెల్లడించారు. ఇవన్ని కొత్త పార్టీకి పెట్టుబడులా అని అంబటి అనుమానం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌కు నిజమైన దత్తపుత్రుడు లగడపాటి కాబట్టే ఆయనకు ఉదారంగా రుణాలు ఇప్పిస్తోందని అన్నారు. కిరణ్ పార్టీ పెడితే ఓట్లు, సీట్లు రెండూ రావని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పదవిని వదిలేస్తే కిరణ్ కుమార్ రెడ్డిని ఎవరూ గుర్తుపట్టరని అంబటి అన్నారు. కాగా తెలంగాణ ముసాయిదా బిల్లు వచ్చినా రాకపోయినా అసెంబ్లీలో సమైక్యరాష్ట్ర తీర్మానం చేయాలని మరో నేత, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

English summary
YSR Congress Party Spokes person Ambati Rambabu fired at CM Kiran kumar Reddy and MP Lagadapati Rajagopal on Thursday. CM has signs on files for get funds to his new party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X