వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవిశ్వాసం ఆమోదం మహా కుట్ర: అంబటి, 'మోడీవైపు ఎవరో తేలిపోతుంది'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

చంద్రబాబు రోజుకో డ్రామా, అప్పుడు హేళన చేసి : వైసీపీ నేతలు ఫైర్

అమరావతి/న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఆమోదించడం మహాకుట్ర అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు బుధవారం మండిపడ్డారు. గత సమావేశాల్లో మేము కూడా అవిశ్వాసం ఇస్తే ఎందుకు ఆమోదించలేదో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు, బీజేపీ మధ్య సయోధ్య ఉందన్నారు. అందుకే ఇప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించారన్నారు.

సీఎం ఐతే బాబుపై ప్రతీకారం తీర్చుకోను కానీ: జగన్ మెలిక, పవన్ మాట విన్నవారు నాకూ ఓటేస్తారుసీఎం ఐతే బాబుపై ప్రతీకారం తీర్చుకోను కానీ: జగన్ మెలిక, పవన్ మాట విన్నవారు నాకూ ఓటేస్తారు

గత సమావేశాల్లో అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించకుండా, ఇప్పుడు ఆమోదించిన ఈ ఎపిసోడ్‌పై ఎన్డీయే, చంద్రబాబు సమాధానం చెప్పాలని నిలదీశారు. అదే సమయంలో ఆయన తిరుమల మూసివేత అంశంపై కూడా స్పందించారు.

Ambati Rambabu on discussion on no confidence motion in Lok Sabha on Friday

తిరుమల ఆలయాన్ని మూసేయాలని ఆగమశాస్త్రం చెబితే అసలు పునఃసమీక్ష చేయడం ఏమిటని అంబటి ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేస్తే ఆగమశాస్త్రాన్ని పక్కన పెట్టేస్తారా అని టీటీడీ అధికారులను నిలదీశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమశాస్త్రం ప్రకారం విధులు నిర్వహిస్తోందా చెప్పాలన్నారు.

పార్టీల రంగు తేలిపోతుంది: టీడీపీ

అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చిన పార్టీలకు టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, తోట నర్సింహం, కేశినేని నాని తదితరులు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై దేశ ప్రజలకు ఏ మేరకు విశ్వాసం ఉందో ఈ అవిశ్వాస తీర్మానంతో తేలిపోతుందని వ్యాఖ్యానించారు. అవిశ్వాస తీర్మానంతో అన్ని పార్టీల రంగు తేలిపోతుందని అభిప్రాయపడుతున్నారు. మోడీకి అనుకూలం ఎవరో, అననుకూలం ఎవరో తేలిపోతుందని చెబుతున్నారు.

English summary
YSR Congress leader Ambati Rambabu on discussion on no confidence motion in Lok Sabha on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X