వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇప్పుడు జగన్‌కు సారీ చెప్పండి: అంబటి, మీరు రాసిపెట్టుకోవచ్చు: కమెడియన్ పృథ్వీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీలో కాపులకు న్యాయం చేసేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు అన్నారు. తమ పార్టీ అధినేత జగన్‌ను కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చిత్రీకరించిన వాళ్లు ఇప్పుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు న్యాయం జరగాలన్నదే వైసీపీ లక్ష్యమని చెప్పారు. కాపు రిజర్వేషన్లపై జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై టీడీపీ నేతలు, కాపులు మండిపడ్డారు. దీంతో ఆయన మంగళవారం వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు క్షమాపణ చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు.

Ambati Rambabu rambabu demands TDP leaders apology

వైసీపీదే గెలుపు: కమేడియన్ పృథ్వీ

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీక్లీన్ స్వీప్ చేస్తుందని కమేడియన్ పృధ్వీరాజ్ జోస్యం చెప్పాడు. ఓ చానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సాధించినటువంటి విజయాన్ని వైసీపీ సొంతం చేసుకోనుందన్నారు. కావాలంటే ఈ విషయాన్ని రాసిపెట్టుకోవచ్చన్నారు.

తన అనుచరులు, ఇతర నేతలు చెప్పే మాటలు, సలహా, సూచనలను జగన్ పట్టించుకోరని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. జగన్‌ను దగ్గర నుంచి చూసిన తనకు ఆయన మనస్తత్వం గురించి పూర్తిగా తెలుసునని చెప్పారు. గతంలో జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో జగన్ పాప్యులారిటీని చూసి మొత్తం ప్రభుత్వం రంగంలోకి దిగి విజయం కోసం శ్రమించాల్సి వచ్చిందన్నారు.

Recommended Video

200 రోజులు అగండి, చుక్కలు చూపిస్తాం : కొడాలి నాని

రమణదీక్షితులును కలిసిన భూమన కరుణాకర్ రెడ్డి

వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి రమణదీక్షితులును కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వ్యక్తిగత ద్వేషంతోనే రమణదీక్షితులును ప్రభుత్వం ప్రధాన అర్చక పదవి నుంచి తొలగించిందన్నారు. అర్చకులు ఉద్యోగులుగా చూడటం అపచారమని పేర్కొన్నారు. బ్రిటష్ కాలం నుంచి అర్చకుల వంశపారంపర్యం వస్తోందని చెప్పారు. రమణదీక్షితులు ఇంట్లో చంద్రబాబు ఫోటో కూడా ఉంటుందన్నారు. కానీ ఆయనపై కక్ష తీర్చుకున్నారన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక తొలగించిన అర్చకులను తీసుకుంటామన్నారు.

జగన్ ఎప్పటికీ సీఎం కాలేరు: చినరాజప్ప

వైయస్ జగన్ ఎప్పటికీ సీఎం కాలేరని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కనీసం పులివెందుల ఎమ్మెల్యేగా కూడా గెలుపొందలేరని సవాల్ చేశారు. కాపు రిజర్వేషన్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు.

English summary
YSR Congress Party leader Ambati Rambabu rambabu demands TDP leaders apology.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X