వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘‘అది చంద్రబాబు భ్రమ, లోకేష్‌కు మాట్లాడటమే రాదు మూడు శాఖలా?’’

సోషల్‌ మీడియా ఫిప్త్‌ ఎస్టేట్‌గా మారిందని, దాన్ని అణచివేయాలనుకోవడం చంద్రబాబు భ్రమ అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అరెస్ట్‌లు చేసేకంటే లోకేశ్‌కు ఎలా మాట్లాడాలో ట్రైనింగ్‌ ఇస్తే మంచిదని సూచించారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు సోషల్‌ మీడియాపై ఆంక్షలు విధించడాన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

సోషల్‌ మీడియా ఫిప్త్‌ ఎస్టేట్‌గా మారిందని, దాన్ని అణచివేయాలనుకోవడం చంద్రబాబు భ్రమ అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అయితే సోషల్‌ మీడియాలో అన్ని నిజాలే ఉంటాయని తాను అనడం లేదని, వాస్తవాలకు దగ్గరకు ఉంటాయని ప్రజలు భావిస్తున్నారన్నారు.

చంద్రబాబులో అభద్రతా భావం...

చంద్రబాబులో అభద్రతా భావం...

అభద్రతా భావంతో ఏపీ సర్కార్‌ వ్యవహరిస్తోందన్నారు. ప్రజలు అందరూ సోషల్‌ మీడియావైపు చూస్తున్నారన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. మీడియాను కంట్రోల్‌ చేయాలని చూడటం సరికాదని అంబటి రాంబాబు అన్నారు

లోకేష్ ఆ పదవికి అనర్హుడు...

లోకేష్ ఆ పదవికి అనర్హుడు...

మంత్రి పదవికి లోకేశ్‌ అనర్హుడని, పరిజ్ఞానం లేని వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారని రాంబాబు ఎద్దేవా చేశారు. విమర్శలు చేసినంత మాత్రాన పొలిటికల్‌ పంచ్‌ రవికిరణ్‌ను అరెస్ట్‌ చేస్తారా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

రవికిరణ్ అరెస్టుపై న్యాయ పోరాటం...

రవికిరణ్ అరెస్టుపై న్యాయ పోరాటం...

అసలు రవికిరణ్‌ను ఎందుకు అరెస్ట్‌ చేశారో, కోర్టులో ప్రవేశపెట్టకుండా అతడిని ఎందుకు వదిలేశారో అర్థం కావడం లేదని, ఈ విషయంలో పోలీసులపై కూడా న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు.

ఏం మాట్లాడాలో తెలియదు.. మూడు శాఖలా?

ఏం మాట్లాడాలో తెలియదు.. మూడు శాఖలా?

విమర్శించే వారిని అరెస్ట్‌ చేసే కంటే చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌కు ఎలా మాట్లాడాలో ట్రైనింగ్‌ ఇస్తే మంచిదని అంబటి రాంబాబు సూచించారు. పరిణితి లేని వ్యక్తిని తీసుకువచ్చి మూడు శాఖలకు మంత్రిని చేస్తే... పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు.

పోలీసులు మైండ్ సెట్ మార్చుకోవాలి...

పోలీసులు మైండ్ సెట్ మార్చుకోవాలి...

లోకేశ్‌కు మంత్రి స్థాయి లేదని, అర్హత లేని వ్యక్తిని అందలం ఎక్కిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేశ్‌ ఏం చెబితే అది చేయాలనే మైండ్‌సెట్‌తో పోలీసులు ఉన్నారని, వారు ఆ పద్ధతి మార్చుకుంటే మంచిదంటూ హితవు పలికారు.

English summary
Guntur: YCP says to control media is nothing but madness. YCP leader Ambati Rambabu while reacting on Political Punch cartoonist Inturi Ravi Kiran's arrest questioned Chandrababu and Lokesh Why they fear of Social Media?' He said YCP will support Ravi Kiran in every aspect, says Ambati. While talking to media over the issue he said it is an unfortunate incident. He claimed that TDP is trying to take away the rights of people. He said no body can dare to shut the voice of social media and print media forcibly and also YCP will support Ravi Kiran in his fight for justice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X