వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్‌ను మించిన మహానటుడు చంద్రబాబు.. జగన్‌పైన మతపర విమర్శలా.. అంబటి ఫైర్

|
Google Oneindia TeluguNews

పవన్ కల్యాణ్ ను ఢిల్లీకి చంద్రబాబు తన దూతగా ఏమైనా పంపించి ఉంటాడనేది తమ అనుమానమని వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఆయన మాత్రం రాష్ట్ర ప్రయోజనాలకోసం వెళ్లాడని తాను భావించడంలేదన్నారు. పవన్ కల్యాణ్ ను మించిన మహానటుడు చంద్రబాబుని వ్యాఖ్యానించారు. ఇసుక కొరతపై చంద్రబాబు చేసింది దొంగ దీక్ష చేసారని ఆరోపించారు. ఆరునెలలు అధికారంలేకపోయేసరికి చంద్రబాబు ప్రస్టేషన్ లో ఉన్నారని...వికృత రూపం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా.. పదేళ్లు ప్రతిపక్షనేతగా ఉన్నవ్యక్తి ఇసుకదీక్షలో డ్రామాలు ఆడారని అంబటి ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఆదేశాలమేరకు పవన్ కల్యాణ్ నడుస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.

రాజధాని పులివెందులలో కడతారా: ఓదార్పు చేసిన జగన్..అది చేయరా : పవన్ కళ్యాన్ ఫైర్..!రాజధాని పులివెందులలో కడతారా: ఓదార్పు చేసిన జగన్..అది చేయరా : పవన్ కళ్యాన్ ఫైర్..!

 పవన్ అందుకే ఢిల్లీ వెళ్లారు..

పవన్ అందుకే ఢిల్లీ వెళ్లారు..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చంద్రబాబు సూచనల మేరకే వెళ్లి ఉంటారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు ఇప్పుడు బీజేపీ నేతలను కలవలేని పరిస్థితుల్లో ఉన్నారని.. తన ప్రతినిధిగా పవన్ ను పంపించి ఉంటారనేది తన అనుమానమని రాంబాబు వ్యాఖ్యానించారు. ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రం ఢిల్లీకి వెళ్లరని విమర్శించారు. ఇసుక దీక్షలో చంద్రబాబు సీఎం జగన్ మీద చేసిన విమర్శలను అంబటి తిప్పి కొట్టారు. పలుగు,పారలు కెమెరాలకు కనబడేలా చేయాలని దీక్షలో కూర్చున్నవారికి చంద్రబాబు డైరక్షన్ చేస్తున్నారని ఎద్దేవా చేసారు. బొచ్చా ,పార పట్టుకున్నవారినే కాదు పవన్ కల్యాణ్‌కు సైతం చంద్రబాబు డైరెక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు డబ్బు పిచ్చి పట్టుకుందని..జగన్ గురించి ఇష్టంవచ్చినట్లు విమర్శలు చేస్తున్నారుని మండిపడ్డారు.

 ఇలా చేస్తేనే..23 సీట్లు..

ఇలా చేస్తేనే..23 సీట్లు..

151 సీట్లతో జగన్ అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే చంద్రబాబు కంగారు పడుతూ అందర్ని కంగారు పెడుతున్నారని విమర్శించారు. జగన్ అవినీతి తగ్గించటానికి చర్యలు తీసుకుంటన్నారా లేదా చంద్రబాబు చెప్పాలని సూచించారు. పొలిటికల్ అవినీతిని పూర్తిగా తగ్గించారని...అటువంటి సమయంలో జే టాక్స్ అని మాట్లాడుతారా..మీరు మీ కాలంలో వసూలు చేసారంటూ ఫైర్ అయ్యారు. అది చూసే 23 సీట్లకే టీడీపీని పరిమితం చేసారని గుర్తు చేసారు. మద్యపాన నిషేధం లో భాగంగానే..మద్యం ధరలు పెంచామని చెప్పుకొచ్చారు. అన్నా క్యాంటీన్లను చంద్రబాబు ఎప్పుడు తెచ్చారని ప్రశ్నించారు. తాము ఆ తరహా లో చేయలేమని అంబటి వివరించారు. చంద్రబాబు ఆదేశాలమేరకు పవన్ కల్యాణ్ నడుస్తున్నారని విమర్శించారు.

 జగన్ పైన మతపర విమర్శలా..

జగన్ పైన మతపర విమర్శలా..

పవన్ కళ్యాన్ కు ప్యాకేజీలు ఎక్కడ నుండి వస్తున్నాయని ప్రశ్నించిన అంబటి రాంబాబు.. జగన్ పైన మతరపరమైన విమర్శలు ఎందుకు చేస్తున్నారని నిలదీసారు. వైయస్సార్ ది ఏ మతమో..జగన్ ది అదే మతమని చెప్పుకొచ్చారు. పరిపాలనకు..మతానికి ముడిపెట్టి జగన పైన హిందూ వ్యతిరేకి అనే మద్ర వేయటానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జగన్ పాదయాత్ర ముందు..తరువాత శ్రీవారిని దర్శించుకున్నా రని.. వేంకటేశ్వర స్వామి అంటే జగన్ కు నమ్మకం ఉందని వివరించారు. అసలు రాజకీయాల్లో మత ప్రస్తావన ఎందుకు తెస్తున్నారని నిలదీసారు.

English summary
YCP MLA Ambati Rambabu slams Chandra Babu and pawan Kalyan on thier comments against Cm jagan. He says on Pawan Delhi tour may be in direction CBN.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X