వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపికి జగన్ పార్టీ షాక్: 'మహానాడుకు వచ్చి, అందరూ బీచ్‌కు వెళ్లారు'

తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మంగళవారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహానాడు సభలో వినేందుకు ఎవరూ లేరని, అందరూ బీచ్‌కు వెళ్లిపోయారని వ

|
Google Oneindia TeluguNews

గుంటూరు: తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మంగళవారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహానాడు సభలో వినేందుకు ఎవరూ లేరని, అందరూ బీచ్‌కు వెళ్లిపోయారని విమర్శించారు.

జగన్‌నే అంటావా, పవన్ కళ్యాణ్ లేకుంటే: లోకేష్‌పై వైసిపి సంచలనంజగన్‌నే అంటావా, పవన్ కళ్యాణ్ లేకుంటే: లోకేష్‌పై వైసిపి సంచలనం

మహానాడులో ఎలాంటి పస లేదన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేశారని అంబటి మండిపడ్డారు. నాడు ఎన్టీఆర్‌ను ఏకాకిని చేశారని, ఆ క్షోభతోనే ఆయన మృతి చెందారన్నారు.

భూస్థాపితం చేసి...

భూస్థాపితం చేసి...

ఎన్టీఆర్ స్థాపించిన టిడిపిని భూస్థాపితం చేసిన వ్యక్తి ఇవాళ ఆయన పుట్టిన రోజు వేడుకలను జరపడం సిగ్గుచేటు అని అంబటి మండిపడ్డారు.

జగన్‌కు సవాలా?

జగన్‌కు సవాలా?

టిడిపి యువనేత, మంత్రి నారా లోకేష్ తమ పార్టీ అధినేత జగన్‌కు సవాల్ విసరడం విడ్డూరమన్నారు. ఎక్కడకైనా చర్చకు వస్తామని లోకేష్ చెప్పారని, కానీ ఆయన రావాల్సింది చర్చకు కాదని, విచారణకు అని అంబటి అన్నారు.

లోకేష్ రాజకీయాల్లోకి ఎందుకొచ్చారో అందరికీ తెలుసు

లోకేష్ రాజకీయాల్లోకి ఎందుకొచ్చారో అందరికీ తెలుసు

నారా లోకేష్ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారో అందరికీ తెలుసునని అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రజా సేవ కోసం వచ్చాడో, సూటుకేసులో మోసేందుకు వచ్చాడో అందరికీ తెలుసునన్నారు. విశాఖలో భూ కుంభకోణం జరిగిందని స్వయంగా మంత్రి అచ్చెన్నాయుడే చెప్పారన్నారు.

జగన్ దానికే అడ్డుపడుతున్నారు

జగన్ దానికే అడ్డుపడుతున్నారు

తమ పార్టీ అధినేత జగన్ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారనే వ్యాఖ్యల్లో అర్థం లేదని అంబటి అన్నారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న అవినీతి, అక్రమాలకు ఆయన అడ్డుపడుతున్నారని టిడిపికి కౌంటర్ ఇచ్చారు. జగన్ అభివృద్ధికి అఢ్డుపడుతున్నారని టిడిపి విమర్శిస్తోన్న విషయం తెలిసిందే.

English summary
YSR Congress Party spokes person Ambati Rambabu alleged that people went to beach from Mahanadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X