వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబూ! ఇదేం మెలిక, రోజా ముఖం చూడొద్దనుకుంటే వెళ్లిపో: అంబటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రోజా సస్పెన్షన్ విషయంలో హైకోర్టు తీర్పు పైన సభలో చర్చిస్తామని, మెజార్టీ సభ్యుల నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని చెప్పడం విడ్డూరమని వైసిపి నేత అంబటి రాంబాబు శుక్రవారం ధ్వజమెత్తారు. రోజాను అడ్డుకోవడానికి ఇది మెలిక అని అభిప్రాయపడ్డారు.

సభలో మీరే మెజార్టీ సభ్యులు ఉన్నందున రోజాకు ఉరిశిక్ష వేయాలని చెప్పి అమలు చేస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు రోజా ముఖం చూడవద్దని ఉంటే, ఆయన శాసన సభను విడిచి వెళ్లాలని అంబటి నిప్పులు గక్కారు.
నగరి నుంచి టిడిపి అభ్యర్థిని ఓడించి రోజా అసెంబ్లీకి వచ్చిందన్నారు.

 Ambati sees conspiracy with government in Roja issue

రోజాకు అనుకూలంగా తీర్పు రావడంతో సభ వాయిదా

ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన మహిళా ఎమ్మెల్యేపై కుట్ర సిగ్గుచేటు అన్నారు. సిగ్గులేకుండా ఏడాది సస్పెన్షన్ వేయడం విడ్డూరమన్నారు. సభను నాలుగు గంటల వరకు సభ నడిపిస్తామని చెప్పారని, కానీ హైకోర్టులో రోజాకు అనుకూలంగా తీర్పు రావడంతో సభను వాయిదా వేశారన్నారు.

శాసన సభ హక్కులను, శాసన సభ్యుల హక్కులను కాపాడాలని అంబటి విజ్ఞప్తి చేశారు. తాము నిరంతరం ప్రజల కోసం పోరాడుతామని చెప్పారు. హైకోర్టు తీర్పును మళ్లీ శాసన సభలో పెట్టి, మెజార్టీ ప్రకారం నడుచుకుంటామని చెప్పడం విడ్డూరమన్నారు.

రెండు రెళ్లు ఆరు అవుతుందా

హైకోర్టు తీర్పును సభలో పెడితే.. టిడిపికి ఎక్కువ మంది సభ్యులు ఉన్నందున వారిదే గెలుస్తారన్నారు. రెండు రెళ్లు అయిదు అని మంత్రి యనమల రామకృష్ణుడు, స్పీకర్ శివప్రసాద రావు ఆదేశాలు జారీ చేస్తారా అని ప్రశ్నించారు. రూల్స్ ప్రకారం ముందుకు వెళ్లాలన్నారు.

మీరు ఉన్నంత కాలం రోజా సభకు రావొద్దని తీర్మానం చేయాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు. సభ నిర్ణయం అంటే.. రోజాకు ఉరిశిక్ష వేస్తారా అని మండిపడ్డారు. చంద్రబాబూ! ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారని గుర్తించాలన్నారు.

రోజాను ఏకపక్షంగా సస్పెండ్ చేసి సభను నడిపించారని, ఇప్పుడు హైకోర్టు తీర్పును కూడా పక్కన పెడుతున్నారన్నారు. ఇలా ఏకపక్షంగా నడిపితే ఊరుకునేది లేదన్నారు. రోజాకు అన్యాయం జరుగుతుందన్నారు. చంద్రబాబును నిలదీస్తున్న రోజాకు అన్యాయం జరిగితే చివరి దాకా పోరాడుతామన్నారు.

మళ్లీ కోర్టుకెందుకెళ్లారు

రోజాను అడ్డుకున్నంత కాలం తాము ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళన చేస్తూనే ఉంటామన్నారు. చంద్రబాబు రోజా ముఖం చూడవద్దనుకుంటున్నారని, ఆమె ముఖం చూడవద్దనకుంటే ముఖ్యమంత్రే సభ నుంచి వెళ్లిపోవాలన్నారు. చంద్రబాబుకు రెండు తలకాయలు ఉంటాయన్నారు. ఒక తలకాయ మాట్లాడుతుందన్నారు.

అసెంబ్లీ వ్యవహారాలలో కోర్టు తీర్పులు చెల్లవని చెప్పి ఇప్పుడు మళ్లీ కోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. టిడిపి సభ్యులు కరణం బలరాంను ఆరు నెలలు సస్పెండ్ చేయడాన్ని ప్రశ్నిస్తున్నారు కదా అని విలేకరులు అడగగా.. దానిపై అంబటి స్పందించారు. కరణం సస్పెన్షన్ తప్పని కోర్టులు చెప్పాయా అని ప్రశ్నించారు.

English summary
Ambati sees conspiracy with AP government in Roja issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X