వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందుకే విశాఖ వదిలేశాం: అమెరికా కంపెనీ షాక్, వెంటనే బాబు ఆదేశాలు

ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఓ ఆసక్తికర సంఘటన ఎదురయింది. బీపీఓ సేవల సంస్థ పట్రా కార్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాన్ ఎస్ సింప్సన్..

|
Google Oneindia TeluguNews

అమెరికా: ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఓ ఆసక్తికర సంఘటన ఎదురయింది. బీపీఓ సేవల సంస్థ పట్రా కార్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాన్ ఎస్ సింప్సన్.. చంద్రబాబుతో సమావేశమయ్యారు.

తమ సంస్థ ఏపీలో విస్తరణ పట్ల ఆసక్తిగా ఉన్నప్పటికీ, స్థలం లభించక వెనుదిరిగినట్లు చెప్పారు. విశాఖలో కేంద్రాన్ని పెట్టి ఇప్పటికే 1500 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, తగిన స్థలం ఉంటే మరో 500 మందికి ఉపాధిని కల్పించే వాళ్లమని సింప్సన్ చెప్పారు.

చంద్రబాబు పర్యటనపై వైసిపి ప్లాన్ ఇలా చేసిందా?చంద్రబాబు పర్యటనపై వైసిపి ప్లాన్ ఇలా చేసిందా?

స్థలం లభించకపోవడం వల్ల రాయ్‌పూర్‌కు తరలి వెళ్లామన్నారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. పెట్రా కార్ప్‌కు టెక్ మహీంద్రా బిల్డింగ్‌ను కేటాయించాలని అక్కడికక్కడే ఏపీఐఐసీకి ఆదేశాలు జారీ చేశారు. ఆపై వీసా కార్డ్, బెల్ కర్వ్ ల్యాబ్స్, మొబిలిటీ ఇన్ ఫ్రా తదితర కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు చర్చలు జరిపారు.

అమెరికాలో ఒప్పందాలు

అమెరికాలో ఒప్పందాలు

ఇదిలా ఉండగా, అమెరికాకు చెందిన అనేక దిగ్గజ సంస్థలు ఏపీకి వివిధ రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం అందజేసేందుకు ముందుకొచ్చాయి. చంద్రబాబు అమెరికా పర్యటన సందర్భంగా చర్చలు, ఒప్పందాలు జరుగుతున్నాయి. వాటిలో గూగుల్‌, టెస్లా, యాపిల్‌, ఆయోవా యూనివర్సిటీ, సిస్కో, ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ వంటి సంస్థలున్నాయి.

గూగుల్ సంస్థతో అవగాహన ఒప్పందం

గూగుల్ సంస్థతో అవగాహన ఒప్పందం

రాష్ట్రంలో ఫైబర్ నెట్‌ ప్రాజెక్టులో భాగంగా మారుమూల ప్రాంతాలకు తీగలు లేకుండా బ్యాండ్‌ విడ్త్‌ తీసుకెళ్లే ప్రాజెక్టుపై గూగుల్‌ సంస్థతో అవగాహన ఒప్పందం జరిగినట్టు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని 2వేల నోడ్స్‌లో, డిసెంబరు నాటికి ఈ ప్రాజెక్టుని గూగుల్‌ పూర్తి చేస్తుందన్నారు.

ప్రవాసాంధ్రులతో..

ప్రవాసాంధ్రులతో..

అడవులు, నదులు వంటి అడ్డంకులున్నచోట, వైర్ల ద్వారా బ్యాండ్‌విడ్త్‌ అందజేయడం కష్టమైన ప్రాంతాల్లో ఈ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రతి నోడ్‌కి చుట్టుపక్కల 20 కి.మీ. వరకు బ్యాండ్‌విడ్త్‌ అందుతుందన్నారు. చంద్రబాబు నాలుగోరోజు అమెరికా పర్యటనలో భాగంగా శాన్‌హోజ్‌లో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగించారు.

అయోవా స్టేట్ వర్సిటీ సందర్శన

అయోవా స్టేట్ వర్సిటీ సందర్శన

విత్తనాభివృద్ధి, పరిశోధన రంగాల్లో పేరుగాంచిన అమెరికాలోని అయోవా స్టేట్‌ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్‌లో మెగా విత్తనాభివృద్ధి కేంద్రం (సీడ్‌పార్కు) ఏర్పాటు చేయనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, యూనివర్సిటీ డీన్‌ ప్రొఫెసర్‌ వెండీ వింటర్‌స్టీన్‌ ప్రాజెక్టు తొలి దశకు అంకురార్పణ చేశారు. నాలుగో రోజు అమెరికా పర్యటనలో భాగంగా చంద్రబాబు ఆదివారం అయోవా స్టేట్‌ యూనివర్సిటీని సందర్శించారు.
అధికారులతో సమావేశమయ్యారు. మెగా సీడ్‌పార్కు ప్రాజెక్టు గురించి యూనివర్సిటీ డైరెక్టర్‌ మంజిత్‌ మిశ్రా ప్రతినిధులకు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ప్రపంచంలోని 80శాతం రైతులు నాణ్యమైన విత్తనాల కొరతను ఎదుర్కొంటున్నారని యూనివర్శిటీ ప్రతినిధులు తెలిపారు.

English summary
America company shocks AP CM Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X