• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షాకింగ్: చంద్రబాబు చెప్పిందే జరిగింది -ఏపీ ప్రాణాంతక ‘ఎన్‌440కే వేరియంట్‌’ -ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దులు సీజ్

|

రోజులు గడుస్తున్నకొద్దీ కరోనా మహమ్మారి రెండో దశ విలయం అతిప్రమాదకర స్థాయికి చేరుతున్నది. ఏడాదిన్నర కాలంలో వైరస్ మరింత బలంగా తయారై డబుల్, ట్రిబుల్ మ్యూటెంట్లుగా, కొత్త రకం స్ట్రెయిన్లుగా రూపాంతరం చెందుతున్నది. కాగా, ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా నుంచి వ్యాప్తి చెందినట్లుగా భావిస్తోన్న కొత్త రకం ఎన్440కే వేరియంట్ ఇప్పుడు మధ్య, దక్షిణ భారతాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నది. సాధారణ కరోనా కంటే 15 రెట్లు ప్రాణాంతకమైన ఎన్440కే వేరింట్ గురించి టీడీపీ చీఫ్ చంద్రబాబు చేసిన హెచ్చరికలపై ఏపీ సర్కారు స్పందించనప్పటికీ, పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు సీరియస్ గా తీసుకున్నాయి..

వ్యాక్సిన్ల కొరత: మోదీపై జగన్ లేఖాస్త్రం -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు -ఆక్సిజన్, పగటి కర్ఫ్యూపైనావ్యాక్సిన్ల కొరత: మోదీపై జగన్ లేఖాస్త్రం -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు -ఆక్సిజన్, పగటి కర్ఫ్యూపైనా

ఏపీ నుంచి వెళితే నో ఎంట్రీ

ఏపీ నుంచి వెళితే నో ఎంట్రీ

మధ్య, దక్షిణ భారతంలో వైర‌స్ విస్తృతికి ఏపీలో పుట్టిన ఎన్‌440కే వేరియంట్ కారణమని సైంటిట్లులు వెల్లడించడం, ఏపీలో కొత్త కేసులు, మరణాలు భారీగా నమోదవుతోన్న దరిమిలా పొరుగున ఉన్న ఛ‌త్తీస్‌గ‌ఢ్ అప్ర‌మ‌త్త‌మ‌య్యింది. ఏపీతో స‌రిహ‌ద్దు క‌లిగిన సుక్మా జిల్లా సరిహద్దులను మూసివేసింది. ఏపీలో కొత్త ఎన్440కే స్ట్రెయిన్ విజృంభిస్తుండ‌టంతోనే బోర్డర్లు సీజ్ చేశామని, ఏపీ నుంచి వచ్చే ఎవరైనా ఆర్టీ పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ రిపోర్టు లేకుంటే రాష్ట్రంలోకి అనుమతించబోమని సుక్మా జిల్లా కలెక్టర్ వినీత్ నంద‌న్‌వార్ వెల్ల‌డించారు. ఆదివారం రాత్రి నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. మరోవైపు..

షాకింగ్:Hyderabad Zoo Parkలో పానిక్ -8సింహాలకు Covid పాజిటివ్ -దేశంలో తొలిసారి -మనుషుల నుంచే సోకిందాషాకింగ్:Hyderabad Zoo Parkలో పానిక్ -8సింహాలకు Covid పాజిటివ్ -దేశంలో తొలిసారి -మనుషుల నుంచే సోకిందా

ఎంట్రీలపై ఒడిశా కఠిన ఆంక్షలు

ఎంట్రీలపై ఒడిశా కఠిన ఆంక్షలు

ఏపీలో పుట్టిన ఎన్440కే వేరింట్ వ్యాప్తి, తెలంగాణలోనూ కేసుల పెరుగుదల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు పొరుగునే ఉన్న ఒడిశా షాకిచ్చింది. సరిహద్దులను పూర్తిగా మూసేసి, కఠిన ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చింది. ఏపీ, తెలంగాణ గుండా ఎవరైనా ఒడిశాలోకి వెళితే కచ్చితంగా 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. ఒడిశా నుంచి ఏపీ, తెలంగాణకు రాకపోకల నియంత్రణకు లేకుండా గంజాం, గజపతి, రాయగడ, కోరాపుట్, మల్కన్ గిరి, నబరంగ్ పూర్ జిల్లాల కలెక్టర్లు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వ్యక్తిగత, అద్దె వాహనాలు, రైళ్లు, విమానాల్లోనూ రాష్ట్రానికి వస్తే క్వారంటైన్ తప్పనిసరి చేశారు. కరోనా విధులు నిర్వహించేవారు, అత్యవసర మెడికల్ సప్లైలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.

  Manchu Lakshmi ట్వీట్ లు చూసారా.. ఓ పక్క హెచ్చరిస్తూనే..!! || Oneindia Telugu
  15రెట్లు ప్రాణాంతకం.. బాబు వార్నింగ్

  15రెట్లు ప్రాణాంతకం.. బాబు వార్నింగ్

  కరోనా తొలి వేవ్ చివరి దశలో ఎన్‌440కే అనే కొత్త రకం వేరియంట్ ను సీసీఎంబీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ప్రస్తుతం మరింతగా బలపడినట్లు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. ఎన్‌440కే వేరియంట్‌ గతంలో కంటే ఇప్పుడు 15 రెట్లు ప్రాణాంతకమైందిగా మారిందని హెచ్చరించారు. ఈ మ్యూటెంట్ తొలుత ఏపీలోని కర్నూలు జిల్లాలో వ్యాప్తి చెందినట్లుగా భావిస్తున్నారు. డబుల్‌ మ్యూటెంట్‌ రకాలైన బీ1.617, బీ1.618 కంటే కూడా ఏపీ నుంచి వ్యాపించిన ఎన్‌440కే బలమైందని, దక్షిణాది రాష్ట్రాలతోపాటు మధ్యభారతంలోనూ ఈ వేరియంట్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని సైంటిస్టులు చెప్పారు. తెలంగాణ హైకోర్టు సైతం ఎన్440కే వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇవే అంశాలను ప్రస్తావిస్తూ ఆదివారం నాటి ప్రెస్ మీట్ లో టీడీపీ చీఫ్ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లాలో పుట్టిన ఎన్ 440 వేరియంట్ వ్యాప్తి పట్ల జగన్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది, ఏపీ అంటేనే పక్క రాష్ట్రాలు భయపడే పరిస్థితులున్నాయని చంద్రబాబు అన్నారు. బాబు ప్రెస్ మీట్ పెట్టిన కొద్ది గంటలకే ఛత్తీస్‌గఢ్, ఒడిశాలు ఏపీ సరిహద్దుల్ని మూసేయడం గమనార్హం. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఏపీలో బుధవారం నుంచి పగటిపూట్ కూడా కర్ఫ్యూ అమల్లోకి తెచ్చారు.

  English summary
  as Centre for Cellular and Molecular Biology (CCMB) Scientists have found a new variant of SARS-CoV-2 - 'N440K' which is believed found in andhra pradesh, the bordering states are on high alert. Chhattisgarh govt has sealed andhra border and Sukma collector said no person is allowed from andhra. other side, the Odisha government has closed its border with Andhra Pradesh and Telangana to curtail the spread of the killer virus in the state.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X