వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'విజయసాయిరెడ్డిలా చంద్రబాబు పాదాభివందనం చేయలేదు, అది సంస్కారం'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

దుమ్మేత్తిపోస్కుంటున్న తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు

విజయవాడ: నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో చేయి కలపడంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి టీడీపీ నేత వర్ల రామయ్య కౌంటర్ ఇచ్చారు. ప్రధానితో చేయి కలిపితే వంకర మాటలు మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నీచమైన రాజకీయాలు చేస్తున్నారన్నారు.

అంతా బాగుందా: దగ్గరకు వచ్చి మరీ మోడీ, బాబు దిమ్మతిరిగే జవాబు, 'ప్రధాని హామీలు నెరవేరుస్తానన్నారు'అంతా బాగుందా: దగ్గరకు వచ్చి మరీ మోడీ, బాబు దిమ్మతిరిగే జవాబు, 'ప్రధాని హామీలు నెరవేరుస్తానన్నారు'

వైసీపీని అమిత్ షా నడిపిస్తున్నారు

వైసీపీని అమిత్ షా నడిపిస్తున్నారు

వైసీపీని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా నడిపిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులు అనైతిక రాజకీయాలకు పాల్పడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరైన చంద్రబాబు సంస్కారవంతమైన రీతిలో ప్రధానిని పలకరించారన్నారు. వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం వారి సంస్కారానికి నిదర్శనమన్నారు.

సంస్కారవంతంగా వ్యవహరించారు

సంస్కారవంతంగా వ్యవహరించారు

టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మాట్లాడుతూ... నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్రం తీరును సీఎం చంద్రబాబు ఎండగట్టారన్నారు. చంద్రబాబు చేసిన ప్రసంగం ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్దతు కూడగట్టేలా చేసిందన్నారు. విజయసాయి రెడ్డిలా చంద్రబాబు పాదాభివందనం చేయలేదన్నారు. సభ్యత, సంస్కారం, విజ్ఞత లేని వ్యక్తి బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహా రావు అన్నారు. ప్రధాని మోడీ పలకరింపుకు సంస్కారంగా మాత్రమే చంద్రబాబు వ్యవహరించారన్నారు. గుజరాత్‌లో డొలేరా సిటీకి పెద్దమొత్తంలో నిధులు కేటాయించి, అమరావతి నిర్మాణానికి నిధులు నిలుపుదల చేసి కక్ష్య సాధింపు ధోరణి అవలంభిస్తున్నారన్నారు.

మోడీకి చంద్రబాబు నమస్కరించడంపై విమర్శలు సరికాదు

మోడీకి చంద్రబాబు నమస్కరించడంపై విమర్శలు సరికాదు

ఏపీకి అన్యాయం చేసిన ప్రధాని మోడీని నిలదీసే ధైర్యం సీఎం చంద్రబాబుకే ఉందని మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. నీతి అయోగ్‌ సమావేశంలో చంద్రబాబు మోడీకి నమస్కరించడంపై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలు సరికాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా పోరాటం చేసే చిత్తశుద్ధి చంద్రబాబుకు, ఆయన మంత్రివర్గానికి ఉందన్నారు.

మోడీ ముందే చంద్రబాబు అడిగారని తెలుసుకోవాలి

మోడీ ముందే చంద్రబాబు అడిగారని తెలుసుకోవాలి

నీతి అయోగ్‌ సమావేశంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలను అన్నింటిని అమలు చేయాలని ప్రధానమంత్రి ముందే చంద్రబాబు అడిగారనే విషయం తెలుసుకోవాలన్నారు. బీజేపీతో కుమ్మక్కై దాగుడు మూతలు ఆడుతున్న జగన్‌ ఏనాడైనా మోడీని ప్రత్యేక హోదా కోసం నిలదీశారా అని ప్రశ్నించారు.

English summary
Telugudesam Party leaders Varla Ramaiah, Ravindra Babu fired at YSR Congress Party for their allegations on AP CM Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X