• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చంద్రబాబు ఏమన్నాడో చూడండి: అమితాబ్ బచ్చన్ ట్వీట్‌తో పవన్ కళ్యాణ్ దిమ్మతిరిగే షాక్

|

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును పదేపదే టార్గెట్ చేస్తున్నారు. ఏపీలో నిర్వహిస్తున్న బహిరంగ సభలతో పాటు అప్పుడప్పుడు తన సోషల్ మీడియా వేదికల పై నుంచి కూడా ఆయన చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

నన్ను రెచ్చగొడితే ఏమవుతుందో అర్థమైందా: బాబు, కాంగ్రెస్‌తో దోస్తీ, కేసీఆర్ పాలనపై కీలక వ్యాఖ్యలు

తన ట్విట్టర్, ఫేస్‌బుక్ అకౌంట్ల నుంచి పవన్ టీడీపీ అధినేతపై కౌంటర్లు వేస్తున్నారు. సందర్భోచితంగా పలు పోస్టులు పెడుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో జత కట్టడంపై కూడా ఓ కార్టూన్ పోస్ట్ చేశారు.

చంద్రబాబు ఏమన్నాడో చూడండి

కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై చంద్రబాబు చేసిన విమర్శలు అంటూ పవన్ కళ్యాణ్ కొన్ని విమర్శలను తన ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంటులో పోస్టు చేశారు. 11-12-2009 నుంచి 15-2-2014 మధ్య చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ ముఖ్య నేతలపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన క్లిప్పింగ్‌ను ఉంచారు.

చంద్రబాబు మీరు హెడ్.. అలా చేయవద్దు

ఇక్కడ పెట్టిన పోస్టును చెక్ చేయాలని చెబుతూ... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ఏమన్నారో ఇక్కడ చూడవచ్చునని, ఇప్పుడు అదే రాహుల్ గాంధీ వద్దకు వెళ్లి మోకాళ్లపై కూర్చొని ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. చంద్రబాబు ఏపీకి హెడ్ (ముఖ్యమంత్రి) అని, కాబట్టి తెలుగువారి ఆత్మగౌరవాన్ని వారి వద్ద తాకట్టు పెట్టవద్దని చంద్రబాబుకు సూచించారు. అవకాశవాద రాజకీయాలు పక్కన పెట్టాలని కోరారు. ఇలా మీరు అవకాశవాద రాజకీయాలు చేస్తుంటే త్వరలో మీరు జగన్‌తో కలవడాన్ని కూడా చూస్తామన్నారు. విభజన విషయంలో తాము కాంగ్రెస్, బీజేపీల వైఖరిని తప్పుబడుతున్నామని చెప్పారు. మనల్ని వారు మోసం చేశారని, ఆరున్నర దశాబ్దాల అనుబంధం ఉన్న హైదరాబాదు నుంచి గెంటివేశారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ సీనియర్ పొలిటికల్ లీడర్లు ఢిల్లీలో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారన్నారు.

స్టాచ్యూ ఆఫ్ పిటీ.. పవన్ పోస్ట్

రాహుల్‌ను చంద్రబాబు కలవడంపై పవన్ కళ్యాణ్ ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. అక్కడ స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం పైన ఉన్న పచ్చ శాలువాను చంద్రబాబు లాగేసి రాహుల్ గాంధీకి కప్పి, సన్మానిస్తున్నట్లుగా ఉన్న ఓ కార్టూన్ పోస్ట్ చేశారు.

రాహుల్ గాంధీని ఉద్దేశించి పోస్ట్

రాహుల్ గాంధీని ఉద్దేశించి పోస్ట్

అదే పోస్టులో రాహుల్ గాంధీని ఉద్దేశించి పవన్ కామెంట్స్ చేశారు. మీ మీరు, మీ పార్టీ నేతలు ఏపీని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు. 2014లో రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు కలిసి రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా విభజించాయని, ఇది తమను తీవ్రంగా వేధించిందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఏపీకి అన్యాయం జరిగిందంటూ పలు కామెంట్లు చేశారు.

నోరు చేసే అఘాయిత్యాన్ని పొట్ట భరించలేదు

'నోరు చేసే అఘాయిత్యానికి పొట్ట భరించలేదు" అన్న సామెత లాగా ..

ముఖ్యమంత్రి గారు,

అవకాశవాద రాజకీయాలుతో, పూట కోక మాట మార్చే రాజకీయ నాయకులతో ప్రజలువిసుగు చెంది ఉన్నారు..అలిసి పోయిఉన్నారు ..

ఇంకా మీ నోటితో ప్రజలు మీద చేసే అఘాయిత్వాలు ఆపేసేయాలి... ఇక భరించలేకుండాఉన్నాం..' అంటూ ఆదివారం మరో పోస్ట్ పెట్టారు.

అమితాబ్ బచ్చన్ ట్వీట్‌తో చంద్రబాబుకు పవన్ షాక్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ చెప్పిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరుకు సరిపోతాయంటూ పవన్ మరో ట్వీట్ చేశారు. ఎవరైతే వారి అబద్దాలను గట్టిగా విశ్వసిస్తారో వారితో వాదన వద్దని అమితాబ్ ట్వీట్ చేశారని, ఇవి చంద్రబాబుకు అచ్చుగుద్దినట్లు సరిపోతాయని అభిప్రాయపడ్డారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
'Check the following post for : How our convenient elite political class esp., Hon.CM Sri CBN garu (TDP) had abused Congress Leaders .. Sri Rahul Gandhi & Smt. Sonia Gandhi. Today, the same leaders he had abused earlier, now..he goes and kneels in front of them.' Pawan Kalyan social media post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more