వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రాహ్మణి ఖాతాకు అమ్మ ఒడి నగదు ? ..పిచ్చి తిట్లు తిట్టిన నారా లోకేష్

|
Google Oneindia TeluguNews

ఏపీలో రాజధాని అమరావతి వేదికగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. జగన్ మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉన్నారని తాజా పరిణామాలతో అర్ధం అవుతున్న తరుణంలో ఆందోళనలు మరింత ఉధృతం అయ్యాయి. రాజధాని అమరావతి కోసం పోరాటం సాగిస్తున్న టీడీపీ నేతలను అరెస్ట్ చేసినా, హౌస్ అరెస్ట్ లు చేసినా సరే పోరాటాన్ని మాతరం కొనసాగిస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటె తాజాగా అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్ చదువుకునే విద్యార్థుల తల్లుల ఖాతాలో అమ్మ ఒడి పథకం క్రింద 15 వేలు జమ చేస్తున్నారు . ఇక ఈ క్రమంలో లోకేష్ సతీమణి బ్రాహ్మణి ఖాతాలో కూడా అమ్మ ఒడి నగదు పడినట్టు ఓ పోస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

నారా లోకేశ్ భార్య బ్రాహ్మణి కూడా లబ్ధి పొందారంటూ తప్పుడు ప్రచారం

నారా లోకేశ్ భార్య బ్రాహ్మణి కూడా లబ్ధి పొందారంటూ తప్పుడు ప్రచారం

సోషల్ మీడియా వేదికగా విమర్శలు, ప్రతి విమర్శలతో పాటు ఫేక్ న్యూస్ కూడా జోరుగా ప్రచారం అవుతుంది . ఈ క్రమంలోనే కొందరు ఏపీలో అమలవుతున్న అమ్మ ఒడి పథకంలో మాజీ మంత్రి , టీడీపీ నేత నారా లోకేశ్ భార్య బ్రాహ్మణి కూడా లబ్ధి పొందారంటూ తప్పుడు ప్రచారం మొదలైంది . ఇందుకోసం ఫేక్ పోస్ట్ లను సృష్టించి ఆన్ లైన్లో ప్రచారంలోకి తెచ్చారు కొందరు . అంతేకాదు.. తమకు రూ. 15 వేలు జమ చేసినందుకు ధన్యవాదాలు చెబుతూ నారా లోకేష్ , బ్రాహ్మణి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు సృష్టించారు .

నారా బ్రాహ్మణి ఖాతాలోనూ రూ.15000 జమ చేసినట్టు ఫేక్ పోస్ట్ ...లోకేష్ ఫైర్

దీనిపై బ్రాహ్మణి భర్త నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో వైసీపీ సోషల్ మీడియా పై విరుచుకుపడ్డారు.అమ్మ ఒడి పథకం కింద తన సతీమణి నారా బ్రాహ్మణి ఖాతాలోనూ రూ.15000 జమ చేసినందుకు తాను ధన్యవాదాలు చెబుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న పోస్టుపై స్పందించిన లోకేష్ అది ఫేక్ పోస్టు అని స్పష్టం చేశారు.మీ పిచ్చి డ్రామాలు నా దగ్గర కాదు. జగన్ ముందు వేసుకోండి. వైసీపీ పేటీఎమ్ బ్యాచ్ సైలెంట్ గా ఉంటే మంచిది అంటూ ఆయన ఘాటుగానే ఫైర్ అయ్యారు .

5 రూపాయల ముష్టికోసం వైకాపా పేటీఎమ్ బ్యాచ్ అంటూ ఫైర్ అయిన నారా లోకేష్

5 రూపాయల ముష్టికోసం వైకాపా పేటీఎమ్ బ్యాచ్ పడుతున్న కష్టం చూస్తుంటే జాలి వేస్తుందని నారా లోకేష్ ట్వీట్ చేశారు. అమ్మ ఒడి అని బొమ్మ చూపించారు. బడుగు బలహీన వర్గాలకు చెందాల్సిన 6 వేల కోట్లు పక్కదారి పట్టించారు. ప్రతి బిడ్డకి అమ్మ ఒడి అన్నారు ఇప్పుడు ఇంట్లో ఒక్కరికే అంటున్నారు. అర్హుల సంఖ్య సగానికి కోశారు అంటూ ఆయన అమ్మ ఒడి పథకం కోసం ఏం చేస్తున్నారో చెప్తూ విమర్శలు గుప్పించారు. శుక్రవారం... జగన్ కోర్టుకు వెళతారు కాబట్టి అక్కడ కొట్టుకోండి మీ డప్పు అంటూ లోకేశ్ ట్విట్టర్ లో విరుచుకుపడ్డారు.

English summary
Brahmani's husband Nara Lokesh fires on ycp social media. He said that was a fake post which is spreading in social media . lokesh alleged ycp paytm batch created that governmnet has deposited the amma odi scheme amount Rs. 15,000 to brahmani's account .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X