వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'అమ్మఒడి' అందరికి కాదు...! ప్రతిష్టాత్మక పథకానికి మెలిక పెట్టిన ఏపీ సర్కార్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన అమ్మఒడి పథకానికి ప్రభుత్వం మెలిక పెట్టింది, అమ్మఒడి పథకాన్ని తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే వర్తింప చేస్తామని ఏపి ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి చెప్పారు. అయితే ప్రయివేట్ స్కూలు విద్యార్థుకు అమలు చేసే అంశంపై త్వరలో చర్చిస్తామని అన్నారు ..దీంతో అమ్మఒడి పథకం ప్రైవేటు పాఠశాలకు వర్తిస్తుందా లేదా అనే సందిగ్థతకు మొత్తం మీద తెరదించింది ఏపి ప్రభుత్వం.

ప్రభుత్వ విద్యార్థులకు మాత్రమే అమ్మఒడి

ప్రభుత్వ విద్యార్థులకు మాత్రమే అమ్మఒడి

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చదువుకునే ప్రతి విద్యార్థిని ప్రభుత్వమే చదివిస్తుందని, ఇందుకోసం పిల్లలను స్కూలుకు పంపిస్తే చాలు... ప్రభుత్వమే ప్రతి విద్యార్థి కుంటుంభానికి రూ 15 వేలను అందిస్తామని ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి పథకానికి మెలికలు పెట్టారు జగన్ ఎన్నికల్లో ప్రకటించిన విధంగా ప్రతి విద్యార్థి కుటుంభానికి కాకుండా కేవలం ప్రభుత్వం స్కూళ్లలో, అదికూడ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంభాలకే వర్తిస్తుందని ప్రకటించారు.

ఇప్పటికే అమ్మఒడి పథకం పై బోర్డులు పెట్టిన ప్రైవేటు స్కూళ్లు

ఇప్పటికే అమ్మఒడి పథకం పై బోర్డులు పెట్టిన ప్రైవేటు స్కూళ్లు

ఇక అమ్మఒడి పథకాన్ని ప్రస్థుత విద్యా సంవత్సరం నుండే ప్రారంభిస్తామని ప్రకటించడంతో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు అటు ప్రైవేటు స్కూల్స్ కూడ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వేల రూపాయల ఫీజులు భరించలేక తల్లిదండ్రులు, సరైన సమయంలో ఫీజులు రాలేక విద్యా సంస్థలు సతమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నుండి వచ్చిన ప్రకటన అటు విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలకు కూడ కోంత ఊరటనిచ్చింది. దీంతో తమ స్కూళ్లో అమ్మఒడి పథకం వర్తిస్తుందని పలు కార్పేరేట్ స్కూళ్లు అప్పుడే ప్రకటనలు కూడ ఇచ్చుకున్నాయి.

ప్రభుత్వ నిర్ణయం విద్యార్థులకు ఆశనిపాతం

ప్రభుత్వ నిర్ణయం విద్యార్థులకు ఆశనిపాతం

అయితే అమ్మఒడి పథకం అమలుపై విద్యార్థుల తల్లి దండ్రులు, ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు భావించినట్టుగా కాకుండా ప్రభుత్వం నిర్ణయం మరోలా ఉంది. ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వ విద్యా వ్యవస్థ సరిగా లేక చాలమంది వెనకబడిన వర్గాలు అనేక కష్టనష్టాలకు ఓర్చి తమ పిల్లలను ప్రైవేటు విద్యా సంస్థల్లోనే చదివిస్తున్నారు. పిల్లల భవిష్యత్ కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇలాంటీ వాళ్లకు ప్రభుత్వం ఇచ్చే 15వేల కోసం అకస్మత్తుగా తమ పిల్లల స్కూళ్లను మార్చే పరిస్థితి ఉండదు..దీంతో ప్రజలు ఆశించిన విధంగా అమ్మ ఒడి పథకం అమలయ్యో అవకాశాలు ఉన్నాయా లేవా అనేది ప్రభుత్వం తేల్చాల్సి ఉంది.

English summary
Amma odi scheam only for government school students The ap government has clarified the about thescheam , which was announced by Chief Minister Jagan before the Andhra Pradesh elections campaign. AP Minister Buggana Rajendra Prasad..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X