వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆగని అమరావతి పోరు .. మోడీతో పాటు కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీ వెళ్ళిన రాజధాని రైతులు

|
Google Oneindia TeluguNews

ఏపీలో రాజధాని రగడ తారా స్థాయికి చేరుకుంది . రాజధాని అమరావతి కోసం ఒకపక్క అమరావతి రైతులు పోరాటం సాగిస్తుంటే, మరోపక్క ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణకు అధికారికంగానే దుగులు వేస్తుంది. దీంతో రాజధాని ప్రాంత రైతులు రాజధాని కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయం తీసుకున్నారు .మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దంటూ 29 గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్న రాజధాని రైతులు హస్తిన బాట పట్టారు .

పార్లమెంట్ లో రాజధాని అమరావతి కోసం ఆ పని చెయ్యండి .. టీడీపీ ఎంపీలకు చంద్రబాబు దిశా నిర్దేశంపార్లమెంట్ లో రాజధాని అమరావతి కోసం ఆ పని చెయ్యండి .. టీడీపీ ఎంపీలకు చంద్రబాబు దిశా నిర్దేశం

 రాజధాని గ్రామాల్లో కొనసాగుతున్న ఆందోళనలు

రాజధాని గ్రామాల్లో కొనసాగుతున్న ఆందోళనలు


మరోపక్క రాజధాని అమరావతి గ్రామాలైన మందడం, తుళ్లూరులో మహాధర్నాలు, వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రాయపూడి, మల్కాపురం, పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రులో ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి . రాజధాని ఉద్యమంలో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్‌ సర్కార్‌ వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు.

 ఫిబ్రవరి 7న విజయవాడలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్న జేఏసీ

ఫిబ్రవరి 7న విజయవాడలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్న జేఏసీ

అమరావతి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించిన జేఏసీ.. ఫిబ్రవరి 7న విజయవాడలో భారీ ర్యాలీ, బహిరంగ సభను నిర్వహించనుంది. సభకు అనుమతి కోరుతూ పోలీస్‌కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు జేఏసీ నేతలు. పోలీసులు అనుమతి ఇవ్వకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు జేఏసీ నేతలు . ఇక తాజాగా తమ సమస్యను కేంద్రానికి తెలియజేసేందుకు, కేంద్రం నుండి రాజధాని అమరావతికి మద్దతు పొందటం కోసం రైతు జేఏసీ నేతలు ఢిల్లీ బాట పట్టారు.

 మోడీకి , కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చెయ్యాలని రాజధాని రైతుల ఢిల్లీ టూర్

మోడీకి , కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చెయ్యాలని రాజధాని రైతుల ఢిల్లీ టూర్

గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరిన రైతు జేఏసీ నేతలు ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలవాలని నిర్ణయించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ,అమిత్ షా తో పాటు 10మంది కేంద్రమంత్రులను కలిసి వినతి పత్రం ఇవ్వాలని, ఎలాగైనా రాజధానిగా అమరావతినే ఉంచేలా చూడాలని విజ్ఞప్తి చెయ్యనున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం కారణంగా అమరావతికి భూములు ఇచ్చిన తమకు తీరని అన్యాయం జరుగుతుందని రైతులు కేంద్ర పెద్దల దృష్టికి తమ సమస్య తీసుకెళ్లనున్నారు . ఒక కేంద్ర బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో వీరికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ లభిస్తుందా ? అన్నది తెలియాల్సి ఉంది.

English summary
JAC decided to further the Amaravathi movement. JAC leaders filed a petition with the Police Commissioner seeking permission for rally and public meeting . JAC leaders will announce future action if police do not give permission. JAC leaders and capital farmers went to Delhi to get their support from the Center to the capital, Amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X