వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధానిపై ఫైనల్ డెసిషన్..... పోలీసుల కంట్రోల్‌లో అమరావతి... !

|
Google Oneindia TeluguNews

అమరావతి పోలీసుల దిగ్బంధనంలో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం, సమగ్ర అభివృద్దిపై ఏర్పాటైన జీఎన్ రావు కమిటీ నివేదికను శుక్రవారం జరిగే క్యాబినెట్‌లో అమోదించనుండడంతో పెద్ద ఎత్తున ఆందోళనలను చెలరేగనున్నాయి. ఈ నేపథ్యంనే క్యాబినెట్ సమావేశాన్ని సచివాలయంలోనా.. లేక సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించాలా అనే నిర్ణయం కూడ వెలువడని పరిస్థితి నెలకొంది. ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు జరగకుండా రేపటి సమావేశానికి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. మూడు రాజధానులపై క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలోనే అమరావతి తరలింపు వ్యతిరేకిస్తున్న రైతులు సచివాలయాన్ని ముట్టడించే అవకాశాలు ఉన్నాయని ఇంటలీజెన్స్ వర్గాలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు సచివాలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ బలగాలను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున ఆయుధాలు , లాఠీలతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

Amaravati is under police control

సచివాలయానికి వెళ్లే దారిలో టియర్ గ్యాస్ , వాటర్ కెనాన్‌ వాహానాలు మోహరించారు. దీంతో అక్కడ యుద్ద వాతవరణం నెలకొంది. కాగా పోలీసులు ఇప్పటికే మందడం ప్రాంతంలోని ఇళ్లలకు నోటీసులు సైతం అంటించారు. కొత్తవారిని ఎవరిని ఇళ్లలోకి రానివ్వద్దని, ఎవరైన వస్తే... తమకు సమాచారం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే రైతులు మాత్రం వెనక్కి తగ్గే అవకాశాలు కనిపిండం లేదు. అమరావతిలో నిరసన ప్రదర్శలతో పాటు బైకు ర్యాలీలు నిర్వహించేందుకు సిద్దమయ్యారు. ఇందుకోసం పోలీసుల అనుమతి కూడ కోరారు.

English summary
Amaravati is under police control The Cabinet will decide on three capitals at its AP Cabinet meeting at 11 am on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X