వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ క్యాబినెట్‌‌కు భారీ బందోబస్తు... కొత్తవారిని ఇళ్లలోకి రానివ్వద్దని నోటీసులు

|
Google Oneindia TeluguNews

శుక్రవారం జరగనున్న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్‌ సమావేశాలు అంత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీసులు సచిలవాలయం చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. క్యాబినెట్ రోజున ఇతర కొత్త వ్యక్తుల ఎవరు సచివాలయం ప్రాంతాల్లోకి రాకుండా నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే కొత్తవారు ఎవరైన వస్తే తమకు సమాచారం అందించాలని మందడం ప్రాంతంలోని ఇళ్లకు నోటీసులు అంటించారు.

27న క్యాబినెట్ కీలక సమావేశం

27న క్యాబినెట్ కీలక సమావేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిపై ఈనెల 27 జరగనున్న కేబినెట్ సమావేశం కీలకంగా మారనుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం, రాష్ట్ర సమగ్ర అభివృద్దిపై జీఎన్ రావు ఇచ్చిన కమిటీ నివేదికపై రాష్ట్ర క్యాబినెట్‌లో చర్చనున్నారు. జీఎన్ రావు కమిటీ ఇచ్చిన సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకోనున్న ప్రభుత్వం, రాజధాని మార్పు ఇతర అంశాలపై కీలక నిర్ణయాలకు అమోదముద్ర వేయనున్నారు. ఈనేపథ్యంలోనే మూడు రాజధానులపై కీలక ప్రకటన చేయనున్నారు.

అమరావతిలో ఆందోళనలు

అమరావతిలో ఆందోళనలు

అయితే అమరావతి నుండి రాజధానిని తరలించవద్దంటూ రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు గత ఎనిమిది రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.... ముఖ్యంగా సెక్రటేరియట్ వెళ్లే మందడం గ్రామంలో పెద్ద ఎత్తున రైతులు తమ అందోళనలు నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకోంది... దీంతో రైతుల అందోళనలకు ప్రతిపక్షనాయకులు టీడీపీ, బీజేపీతో పాటు ఇతర ప్రజా సంఘాలు కూడ మద్దతు తెలుపుతున్నాయి. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ...టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ... రైతులకు పూర్తి మద్దతును ప్రకటించింది. దీంతో అమరావతి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇళ్లలోకి కొత్తవారిని రానివ్వద్దు

ఇళ్లలోకి కొత్తవారిని రానివ్వద్దు

అయితే ఈ ఆందోళనల మధ్యలోనే 27న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కొనసాగనుంది. దీంతో అమరావతిలోకి అల్లర్లు సృష్టించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. క్యాబినెట్ జరుగనుండడంతో సీఎం, మంత్రులు సెక్రటేరియట్‌కు రానున్నారు. అయితే వీరి కాన్వాయ్‌లను అడ్డకోవడం లాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉండడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. దీంతో మందడం నుండి సెక్రటేరియట్‌కు వెళ్లే దారిలో ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే సెక్రటేరియట్ దారిలో ఉన్న ఇళ్లకు నోటీసులు అంటించారు. ఇళ్లలోకి కొత్తవారిని రానివ్వద్దని, ఎవరైన కొత్తవారు వచ్చినా...తమకు సమాచారం ఇవ్వాలని నోటిసులో పేర్కొన్నారు.

English summary
amravati police have set up tight security for cabinet meeting which will be held on 27th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X