వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ ప్రత్యక్షమైన సీఆర్డీయే.. ఏఎంఆర్డీయే మాయం... హైకోర్టు స్టేటస్ కోతో తప్పని మార్పు..

|
Google Oneindia TeluguNews

వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లుపై హైకోర్టు స్టేటస్ కో విధించిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు జూలై 31వ తేదీన గవర్నర్ సీఆర్డీయే రద్దు, వికేంద్రీకరణ బిల్లులకు ఆమోదం తెలిపారు. దీంతో సీఆర్డీయే పేరు మార్పు ప్రక్రియ కొనసాగింది. హైకోర్టులో విచారణ ఉన్నా అధికారులు వినిపించుకోలేదు. కానీ హైకోర్టు మంగళవారం యథాతథస్థితి విధించడంతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. బిల్లులకు గవర్నర్ ఆమోదంతో చకచకా చేపట్టిన మున్సిపల్ అధికార యంత్రాంగం పనులకు బ్రేక్ పడింది.

వైసీపీ నేత పీవీపీకి హైకోర్టు డెడ్ లైన్ - పోలీసులకు లొంగిపోవాలని ఆదేశం - కిడ్నాప్ కేసులో మరో ట్విస్ట్వైసీపీ నేత పీవీపీకి హైకోర్టు డెడ్ లైన్ - పోలీసులకు లొంగిపోవాలని ఆదేశం - కిడ్నాప్ కేసులో మరో ట్విస్ట్

 ఆదివారం రోజున కూడా..

ఆదివారం రోజున కూడా..

బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలుపగానే... వీక్ డే.. సెలవు దినం అని అధికారులు కూడా లేదు. విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంపై ఉన్న బోర్డులను ఆదివారం తొలగించారు. అంటే సీఆర్డీయే పేరును అమరావతి మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏఎంఆర్డీయే)గా మార్చేందుకు తెగ ఉత్సాహం చూపించారు. ప్రభుత్వ వాహనాలపై ఉన్న సీఆర్డీయే స్టిక్కర్లను కూడా తొలగించారు. వాహనాలకు ఏఎంఆర్డీయే స్టిక్కర్లు పెట్టి.. తమ స్వామి భక్తిని చాటుకున్నారు.

 సీఆర్డీయేగా మార్పు..

సీఆర్డీయేగా మార్పు..

సీఆర్డీయే వెబ్‌సైట్‌ను కూడా ఏఎంఆర్డీయేగా మార్చేశారు. అధికారుల చర్య రాజధాని రైతులు సహా, రాజధాని తరలింపును కాదనే వారికి కాస్త కోపం తెప్పించింది. కానీ హైకోర్టు స్టేటస్ కో తో మళ్లీ తోకముడవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏఎంఆర్డీయే వెబ్ సైట్‌ను సీఆర్డీఏ‌గా మర్చేశారు. హైకోర్టు కార్యాలయ తరలింపుపై కూడా స్టేటస్ కో విధించింది. కార్యాలయాలను తరలించొద్దు అని స్పష్టంచేసింది. హైకోర్టు స్టేటస్ కోతో అధికారులు వెబ్ సైట్ పేరు తిరిగి మార్చాల్సి వచ్చింది.

Recommended Video

Sushant Singh Rajput కు ఓవర్‌డోస్ మెడిసిన్స్ ఇచ్చి మరణానికి ముందు Rhea Chakraborty జంప్! || Oneindia
స్టేటస్ కో విధించడంతో..

స్టేటస్ కో విధించడంతో..

మూడు రాజధానుల బిల్లుపై హైకోర్టు ఈ నెల 14 స్టే విధించింది. రాజధాని విభజన పిటిషన్లపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరపున శ్యామ్ దివాన్, ఉన్నవ మురళీధర్ గట్టిగా వాదించారు. పిటిషన్‌పై 10 రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణకు 14వ తేదీకి వాయిదా వేసింది. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుకు జూలై 31వ తేదీన గవర్నర్ విశ్వభూషణ్ పరిచందన్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

English summary
AMRDA changed CRDA in ap municipal website after high court status co on two bills governer approval.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X