వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తూ.గోలో మరోప్రమాదం..,బాంబుల ఫ్యాక్టరీలో పేలుడు.. 9మందికి గాయాలు

|
Google Oneindia TeluguNews

ఏపీలో మరోసారి బాంబుల తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవులో బాంబులు తయారు చేస్తున్న ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిందించి. ఈ ప్రమాదంలో తోమ్మిది మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడ్డవారికి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

దీపావళీ వస్తుండడంతో తూర్పు గోదావరి జిల్లాలో అనధికారికంగా బాంబులు తయారీ కేంద్రాలు ఇష్టానుసారంగా బాంబులు తాయారు చేస్తున్నారు. దీంతో సరైన ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని తాళ్లరేవులోలో బాంబులు తయారు చేస్తున్న కేంద్రంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. దీంతో బాణాసంచా కేంద్రంలో పనిచేస్తున్న 9 మందికి గాయాలయినట్టు సమాచారం. కాగా గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

An explosion at a bomb factory in East Godavari

కాగా నెల రోజుల క్రితమే తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట మండలం జీ. మేడపాడులో బాణసంచా తయారీ కేంద్రంలో కూడ పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో కూడ పలువురి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఎక్కువగా మహిళలే ఉండడంతో అయిదు మహిళలు మృతి చెందారు. దీపావళీ రావడంతో తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కువ బాణాసంచా కేంద్రాల్లో బాంబులు తాయరు చేస్తున్నారు.

English summary
An explosion at a bomb factory in East Godavari district, Nine people were injured in the accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X