విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయనగరంలో ఇదీ పరిస్థితి: ఓ వృద్ధురాలి ఆవేదన, రోజా ఇలా

|
Google Oneindia TeluguNews

విజయవాడ: పెన్షన్ కోసం సీఎం క్యాంపు ఆఫీస్ సీసీటీవీ ముందు వృద్ధురాలి దీనగాథ..!
' అనే శీర్షికతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తన ఫేస్‌బుక్ ఖాతాలో మంగళవారం ఓ వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోలో ఓ వృద్ధురాలు ఓ స్తంభానికి ఉన్న సీసీ కెమెరా వద్దకు వచ్చి తన బాధను చెప్పుకుంది.

తనకు రావాల్సిన పింఛను ఎన్నిసార్లు విన్నవించుకున్నా.. స్థానిక నేతలు, అధికారులు పట్టించుకోలేదని ఆమె సీసీ టీవీ కెమెరాల వద్ద చెప్పుకోవడం గమనార్హం.

స్థానిక అధికారులు, ఎమ్మెల్యే మీసాల గీతకు కూడా తన మొర వినిపించినా ఎవరూ పట్టించుకోలేదని ఆ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇల్లు, పింఛను మంజూరు చేయాలని కోరితే.. అధికారులు పదేసి వేల లంచాలు అడుగుతున్నారని వాపోయారు.

తన కొడుకు 15రోజుల క్రితం మరణించాడని, దీంతో అతని కుమార్తెలైన ఇద్దురు ఆడపిల్లల బాధ్యత తనపై పడిందని ఆ వృద్ధురాలు తెలిపింది. స్థానిక అధికారులు, ఎమ్మెల్యే తీరుతో విసిగిపోయి.. సీఎం చంద్రబాబునాయుడును కలవాలని విజయనగరం నుంచి విజయవాడకు వచ్చినట్లు తెలిపింది.

అయితే, ఇక్కడ తనను సీఎంను కలిసేందుకు పోలీసులు అనుమతించలేదని ఆ వృద్ధురాలు వాపోయింది. తనకు ఇల్లు, పింఛను మంజూరు చేయాలని సీసీటీవీ కెమెరాల ముందు తన ఆవేదనను వెళ్లబోసుకుంది. తనకు ఆర్థిక సాయం చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరింది.

English summary
An old woman came to vijayawada for her pension.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X