అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనంతలో గొర్రెపిల్లను మింగి కదల్లేకపోయిన అనకొండ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anaconda eat a sheep
అనంతపురం: అనంతపురం జిల్లాలో ఓ భారీ అనకొండ గొర్రెను మింగిన సంఘటన జరిగింది. పుట్టపర్తి మండలంలోని రాచువారిపల్లి సమీపంలో ఆదివారం కనుమకొండ సమీపంలో కొండ చిలువ గొర్రె పిల్లను మింగేసింది. గ్రామస్థులు కనుగొని కొండచిలువను అటవీ అధికారులకు అప్పగించారు.

గ్రామానికి చెందిన కేశవయ్య గొర్రెలను మేపేందుకు కనుమ కొండకు వెళ్లగా అక్కడ కొండ చిలువ గొర్రె పిల్లను మింగేసింది. కాపరుల ద్వారా సమాచారం తెలియడంతో కొండ చిలువను చూడడానికి గ్రామస్థులు భారీ సంఖ్యలో కనుమకొండకు చేరుకున్నారు.

ఈ కొండ చిలువ పదిహేను అడుగులు ఉంది. గొర్రెను మింగిన కొండ చిలువ ఎటు కదలలేకపోయింది. దీంతో గ్రామస్థులు ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు చెప్పారు.

పెనుకొండ సబ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారికి విషయం తెలపడంతో ఆయన సోమందేపల్లి బీట్ ఆఫీసర్ రామకృష్ణ, సబ్ బీట్ ఆఫీసర్ వెంకటేశులులను సంఘటనా స్థలానికి పంపించారు. వారు ఆ కొండ చిలువను గోనె సంచిలో బంధించి అడవిలో వదిలి పెట్టారు.

English summary

 A fifteen feet Anaconda ate a sheep in Ananthapuram district on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X