వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనకాపల్లి వైసీపీ: దిలీప్ చేరికే కారణమా,బొత్సకు ఝలక్?

By Narsimha
|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం: విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గ వైసీపీలో అసంతృప్తి నెలకొంది. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ మాజీ ఛైర్మెన్ దంతులూరి దిలీప్‌కుమార్‌ను వైసీపీలో చేర్చుకోవడాన్ని స్థానిక నేతలు కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై పార్టీ చీఫ్ వైఎస్ జగన్‌ను కలవాలని పార్టీ నేతలు కొందరు భావిస్తున్నారని ప్రచారం సాగుతోంది.

విశాఖ జిల్లా అనకాపల్లిలో వైసీపీ ఇంచార్జీగా గుడివాడ అమర్ వ్యవహరిస్తున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడుగా కూడ అమర్ ఉన్నారు. వైసీపీ నుండి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను బహిష్కరించిన తర్వాత అమర్‌కు వైసీపీ బాధ్యతలను కట్టబెట్టారు.

అనకాపల్లి అసెంబ్లీ నియోజకర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ ప్రయత్నాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా దంతులూరి దిలీప్‌కుమార్‌ను వైసీపీలో చేర్చుకొన్నారు.

దిలీప్‌కుమార్ వైసీపీలో చేరడాన్ని కొందరు వైసీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పార్టీలో ప్రచారంలో ఉంది.స్థానిక నేతలను సంప్రదించకుండానే దిలీప్‌ను పార్టీలో చేర్చుకొన్నారని స్థానిక నేతలు అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్నారని ప్రచారం సాగుతోంది.

దిలీప్ చేరికపై స్థానిక నేతల్లో అసంతృప్తి

దిలీప్ చేరికపై స్థానిక నేతల్లో అసంతృప్తి


విశాఖ జిల్లా అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే క్రమంలో దంతులూరి దిలీప్‌కుమార్‌ను వైసీపీలో చేర్చుకొన్నారు. అయితే రాష్ట్ర స్థాయి నాయకుల నిర్ణయం మేరకే దిలీప్‌కుమార్‌ వైసీపీలో చేరిక జరిగిపోయింది. ఈ నిర్ణయంపై స్థానిక వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. మూడేళ్ళుగా పార్టీ కోసం పనిచేస్తున్నవారిని పక్కనపెట్టి ఇతరులతో తమ వెంట తిప్పుకోవడంపై వైసీపీ సీనియర్లు కొంత అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.

బొత్స పర్యటనకు దూరంగా సీనియర్లు

బొత్స పర్యటనకు దూరంగా సీనియర్లు

గత వారం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అనకాపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా అనకాపల్లిలో వైసీపీకి చెందిన సీనియర్లు ఎవరూ బొత్సను కలవలేదు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు అమర్ వ్యవహరశైలితో అసంతృప్తిగా ఉన్న కొందరు సీనియర్లు బొత్సను కలవకుండా తమ ఆగ్రహన్ని వ్యక్తం చేశారని అమర్ వ్యతిరేక గ్రూపు నేతలు చెబుతున్నారు.

అనకాపల్లిపై చిన్నచూపు

అనకాపల్లిపై చిన్నచూపు


మందపాటి జానకిరామరాజు, పీడీ గాంధీ, ఆడారి సూరి అప్పారావు, మళ్ల బుల్లిబాబు, గొర్లె సూరిబాబు తదితర నాయకులు తమ శక్తిమేర పార్టీని నడిపిస్తూ వస్తున్నారు.అయితే పార్టీ కోసం పనిచేస్తున్నవారిని వదిలేసి ఇతరులకు పెద్దపీట వేయడాన్ని వైసీపీ నేతలు కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం అమర్ వ్యతిరేక వర్గీయులు ఆరోపిస్తున్నారు.దీనికి తోడు జిల్లా పదవుల విషయంలో కూడా అనకాపల్లి నియోజకవర్గాన్ని చిన్నచూపు చూశారంటున్నారు.కంటితుడుపుగా రెండు మూడు పదవులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని వారు ఆరోపిస్తున్నారు.

జగన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయం

జగన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయం

కొంతకాలం నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఈ ద్వితీయశ్రేణి సీనియర్‌ నాయకులు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని వైఎస్ జగన్‌కు వివరించాలని నిర్ణయం తీసుకొన్నారని సమాచారం.అంతేకాదు వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌ తీరుపై కూడ వైఎస్ జగన్‌కు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారని సమాచారం.

English summary
Ysrcp Anakapalli leaders decided to meet Ys jagan soon.Some Ysrcp leaders against to Dileep kumar , Dileep kumar recently joined in ysrcp
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X