నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వయంగా ఫోన్ చేసినా.. సోమిరెడ్డికి షాకిచ్చిన ఆనం సోదరులు, అదాల

ఆంధ్రప్రదేశ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. సుమారు 13ఏళ్ల తర్వాత మంత్రి పదవి చేపట్టిన ఆయనకు నేతలు, కార్యకర్తల నుంచి సాదర స్వాగతం లభించింది. నెల్లూరు నగరం మొత్తం పసుపు మయంగా మార్చేశారు.

భారీగా తరలివచ్చారు కానీ..

భారీగా తరలివచ్చారు కానీ..

జిల్లా నలుమూలల నుంచి భారీగా కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు. అయితే, జిల్లాకు చెందిన కీలక నేతలు మాత్రం ఈ కార్యక్రమానికి రాకపోవడం గమనార్హం. స్వయంగా మంత్రి సోమిరెడ్డి ఫోన్ చేసి రావాలని కోరినప్పటికీ.. జిల్లా టీడీపీ నేతలైనా ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానందరెడ్డితోపాటు మరో నేత అదాల ప్రభాకర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.

ఆనం సోదరుల డుమ్మా

ఆనం సోదరుల డుమ్మా

తన ర్యాలీ, బహిరంగ సభకు రావాలని సోమిరెడ్డి స్వయంగా ఫోన్ చేసి జిల్లా ముఖ్యనేతలతోపాటు ఈ ముగ్గురినీ ఆహ్వానించారు. అంతేగాక, తన మనుషులను అదాల, బీద రవిచంద్ర, ఆనం వివేకా, రామనారాయణ రెడ్డి ఇళ్లకు పంపి మరీ ఆహ్వానించారు. అయినా కూడా ఆనం సోదరులు, అదాల.. సోమిరెడ్డి ర్యాలీ, బహిరంగ సభలకు డుమ్మా కొట్టారు. అయితే, మంత్రి నారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర మాత్రం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు సోమిరెడ్డి వెంటే ఉన్నారు.

సోమిరెడ్డి తనదైన ముద్ర

సోమిరెడ్డి తనదైన ముద్ర

కాగా, 2004 నుంచి 2014 వరకు టీడీపీ అధికారంలో లేకపోయినా.. సోమిరెడ్డి జిల్లాలో కీలక నేతగా కొనసాగారు. అయితే నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణకు 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి పదవి లభించింది. దీంతో సోమిరెడ్డికి టీడీపీలో ప్రాధాన్యత తగ్గినట్లు అనిపించినా.. ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడంతో ఆయన మళ్లీ జిల్లాపై పట్టుసాధించడం మొదలుపెట్టారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, జిల్లా టీడీపీ శ్రేణులతో సంబంధాలను కొనసాగిస్తూ మళ్లీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడం ప్రారంభించారు.

పట్టుకోసం కసరత్తులు

పట్టుకోసం కసరత్తులు

ఈ క్రమంలోనే చంద్రబాబునాయుడు మంత్రివర్గ విస్తరణలో సోమిరెడ్డికి స్థానం కల్పించి ఆయనకు ప్రాధాన్యతనిచ్చారు. అయితే, మంత్రి నారాయణ.. సోమిరెడ్డికి పోటీగా బీద రవిచంద్రను తెరపైకి తెచ్చారనే వాదనలున్నప్పటికీ.. సోమిరెడ్డికి మంత్రి పదవి రావడంలో నారాయణ సానుకూలంగా వ్యవహరించినట్లు సమాచారం. ప్రస్తుతం మంత్రి పదవిలో కొనసాగుతున్న సోమిరెడ్డి జిల్లా పార్టీపై తన అధిపత్యాన్ని కొనసాగించేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది.

English summary
TDP leaders Anam Ramanarayana Reddy and Anam Vivekananda Reddy and Adala Prabhakar Reddy are not attended AP minister somireddy chandramohan reddy's rally and meeting held in Nellore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X