నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జిల్లాలో తమ పరువు ఉండాలా.. వద్దా?: రఘువీరాను నిలదీసిన ఆనం వివేకా

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీసీసీ అధ్యక్షుడు రఘవీరా రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి ఆగ్రహా వ్యక్తం చేశారు. ఇందిరా భవన్‌లో మంగళవారం రఘవీరా రెడ్డిని కలిసిన వివేకానందరెడ్డి నెల్లూరు జిల్లాలో తమ పరువు ఉండాలా.. వద్దా? అని నిలదీశారు. రఘవీరారెడ్డిపై ఆనం వివేకా మండిపడటానికి కారణం నెల్లూరు జిల్లాలో చింతా మోహన్, పనబాక లక్ష్మీ చెప్పిన వారికే పదవులు ఇవ్వడమే.

నెల్లూరు జిల్లాలోని సేవాదళ్, ఎస్సీ కమిటీ జిల్లా అధ్యక్ష పదవులను చింతా మోహన్‌, పనబాక లక్ష్మి చెప్పిన వారికే ఇచ్చారు. దీనిపై ఇందిరా భవన్‌లో మంగళవారం రఘవీరాను కలిసిన ఆనం పార్టీ కార్యక్రమాల కోసం పట్టుమని పది మందిని కూడా తీసుకువచ్చే సామర్థ్యం లేని ఇలాంటి వారికి పదవులు ఇస్తే పార్టీ బతుకుతుందా?' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

anam vivekananda reddy fires apcc raghuveera reddy

అంతేకాదు నెల్లూరు జిల్లాలో తమ పరువు ఉండాలా? వద్దా? అని నిలదీశారు. సేవాదళ్‌, ఎస్సీ విభాగం అధ్యక్షులను తొలగించకపోతే సీరియస్‌గా తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీ కష్టాల్లో ఉన్న తరుణంలో ఏకపక్ష నిర్ణయాలు మంచివి కావని అన్నారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమకు తెలియకుండా నెల్లూరులో ఎవరెవరికో పదవులు ఇస్తే పార్టీలో ఉండాలా.. వెళ్లిపోవాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏపీసీసీ అధ్యక్షుడ రఘవీరాపై ఆనం వివేకా ఆగ్రహం వ్యక్తం చేయడంతో రాజకీయంగా చర్చకు దారితీసింది.

అయితే ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారనే వార్తలు మీడియాలో ప్రధానంగా వినిపిస్తున్నాయి.

English summary
anam vivekananda reddy fires apcc raghuveera reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X