• search
 • Live TV
ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Anandaiah Medicine: వైసీపీలో చిచ్చు...ఎంపీ వర్సెస్ మంత్రి...ఆ విప్ దూకుడు..అంతు చిక్కకుండా...!!

By Lekhaka
|

ఆనందయ్య మందు. ఇప్పుడు ఎక్కడ విన్నా..సోషల్ మీడియా చూసిన ఈ పేరే వినిపిస్తోంది. ఇటువంటి మందు అనేక చర్చలు..వివాదాల తరువాత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హైకోర్టు అనుమతి సైతం లభించింది. దీంతో..ఆనందయ్య ఈ మందు పంపిణీ ప్రారంభించారు. ముందుగా స్థానికులకు ఇవ్వాలని నిర్ణయించారు. జిల్లాలకు పంపిణీ చేసే విషయంలో కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం నుండి సహాయం అందించాలంటూ ఆనందయ్య నేరుగా ముఖ్యమంత్రికి లేఖ రాసారు. ఇదే సమయంలో తొలి నుండి ఆనందయ్యకు మద్దతుగా నిలిచిన నెల్లూరు జిల్లా సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తన నియోజక వర్గంలో మందు పంపిణీ ప్రారంభించారు. ఇక, ఇప్పుడు ఈ మందు పంపిణీ చేసే ప్యాకెట్లు..డబ్బాల పైన ముఖ్యమంత్రి ఫొటో పెట్టి..వైసీపీ నేతలు ఫొటోలతో పంపిణీ చేయటం పైన విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఒంగోలు లోనూ ఈ మందు పంపిణీ వైసీపీలోని విభేదాలను బహిర్గతం చేస్తోంది.

ఒంగోలు లో ఎంపీ వర్సెస్ మంత్రి..

ఒంగోలు లో ఎంపీ వర్సెస్ మంత్రి..

ఒంగోలు లో ఎంపీ వర్సెస్ మంత్రి అన్నట్లుగా ఈ మందు వ్యవహారం నడుస్తోంది. ఒంగోలు కేంద్రంగా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి..ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆనందయ్య మందు పంపిణీకి పోటీ పడుతున్నారు. ఒంగోలులో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఆనందయ్య మందు పంపిణీని మంత్రి అనుచరులు ప్రారంభించారు. పీవీఆర్ హైస్కూలులో ఆనందయ్య మందు పంపిణీని ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రారంభించారు. ఒంగోలు నగర ప్రజలకు ఆనందయ్య తయారు చేసిన పీ రకం మందును వైసీపీ నేతలు పంపిణీ చేస్తున్నారు. పార్టీ నేతలు సైతం ఎవరికి మద్దతుగా నిలుస్తున్నారో వారి కార్యక్రమానికి హాజరయ్యారు. ఒకే పార్టీలో ఉంటూ..ఒకే మందు కావటంతో...ఒకే వేదిక ద్వారా పంపిణీ చేయాల్సిన సమయంలో.. ఇలా పోటా పోటీగా తమ అనుచరులతో కలిసి నిర్వహించటం రాజకీయంగా వివాదాస్పదంగా మారుతోంది. అధికారులు ఎవరికి మద్దతివ్వాలో తెలియని అయోమయానికి గురవుతున్నారు.

చెవిరెడ్డి దూకుడు..

చెవిరెడ్డి దూకుడు..

ఇక, తొలి నుండి ఆనందయ్య మందు విషయంలో కాకాకి గోవర్ధన్ రెడ్డి తో పాటుగా చంద్రగిరి ఎమ్మెల్యే..విప్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఆసక్తిగా ఉన్నారు. తొలుత టీటీడీ ద్వారా ఈ మందు పంపిణీ చేయించాలనే ప్రతిపాదన తెచ్చారు. అయితే, దానికి అనుమతి రాకపోవటంతో..ఇప్పుడు చంద్రగిరిలో సొంతగా ఈ మందు పంపిణీ ప్రారంభించారు. చిత్తూరు జిల్లాలో మొత్తంగా నియెజకవర్గాలు ఉండగా..అందులో వైసీపీ ఎమ్మెల్యేలు 13 మంది ఉన్నారు. అందులో ఇద్దరు మంత్రులు ఉన్నారు. జిల్లాలో ఎవరితోనూ సంప్రదింపులు లేకుండా..చెవిరెడ్డి సొంతంగా ఈ బాధ్యత తీసుకున్నారు. ఇది జిల్లాలోని మిగిలిన నేతలకు రుచించటం లేదు. ఆనందయ్య మందు కోసం వినియోగించే ఔషధాలు సౌతం శేషాచలం అడవుల నుండి తెప్పించి..మందు తయారీలో సహకరిస్తున్నారు. తన నియోజకవర్గంలో ఈ మందు పంపిణీ చేయటం ద్వారా చెవిరెడ్డి రాజకీయంగా మైలేజ్ సాధించే వ్యూహం అమలు చేస్తున్నారు.

  #Krishnapatnam COVID Medicine పై అనుమానాలు | ICMR | Nellore || Oneindia Telugu
  మరింతగా పెరుగుతున్న ఒత్తిడి..

  మరింతగా పెరుగుతున్న ఒత్తిడి..

  దీంతో...కేవలం చెవిరెడ్డికి మాత్రమే ఈ మందు ఎలా ఇస్తారు..తమకు మందు సరఫరాకు తగినట్టుగా పంపిణీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ఇలా..ఇప్పుడిప్పుడే ఈ మందు కోసం పోటీ మొదలైంది. రానున్న రోజుల్లో ఈ మందు కోసం ప్రజల నుండి మరింత సానుకూలత కనిపిస్తే...ఆనందయ్య పైన ఒత్తిడి పెరటంతో పాటుగా... ఇది రాజకీయంగానూ ఒత్తిళ్లు..విభేదాలు పెరగటానికి దారి తీయటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆనందయ్య మందు ఆధిపత్య..వర్గ పోరు వైసీపీలో హాట్ టాపిక్ గా మారుతోంది.

  English summary
  Anandaiah medicine distribution caused new rift in YCP. In ongole and Chittoor this disturbance beacame hot political discussion in YCP cirlcles.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X